గడ్సర్ సరస్సు
గడ్సర్ సరస్సు కాశ్మీర్ లోయలోని గందర్బల్ జిల్లా లో 3600 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక సుందరమైన సరస్సు. ఇది 0.85 కిలోమీటర్ల పొడవు, 0.76 కిలోమీటర్ల వెడల్పు కలిగి ఉంది.[1]
గడ్సర్ సరస్సు | |
---|---|
పువ్వుల లోయ | |
ప్రదేశం | గందర్బల్ జిల్లా, కాశ్మీరు లోయ |
అక్షాంశ,రేఖాంశాలు | 34°25′18″N 75°03′26″E / 34.421669°N 75.057274°E |
రకం | ఒలిగోట్రోఫిక్ సరస్సు |
సరస్సులోకి ప్రవాహం | మంచు కరగడం |
వెలుపలికి ప్రవాహం | నీలం నది |
ప్రవహించే దేశాలు | భారతదేశం |
గరిష్ట పొడవు | 0.85 కిలోమీటర్లు (0.53 మై.) |
గరిష్ట వెడల్పు | 0.76 కిలోమీటర్లు (0.47 మై.) |
ఉపరితల వైశాల్యం | 0.7421 కి.మీ2 (0.2865 చ. మై.) |
ఉపరితల ఎత్తు | 3,600 మీటర్లు (11,800 అ.) |
ఘనీభవనం | డిసెంబర్ నుంచి ఏప్రిల్ |
భౌగోళికం
మార్చుకాశ్మీరీ భాషలో గడ్సర్ అంటే చేపల సరస్సు అని అర్థం. ఇది ట్రౌట్ వంటి అనేక రకాల చేపలకు సహజ ఆవాసం. ఈ సరస్సు నవంబర్ నుండి ఏప్రిల్ నెలల్లో ఎక్కువగా మంచుతో కప్పబడి ఉండి, ఘనీభవిస్తుంది. ఇది వివిధ రకాల అడవి పువ్వులతో నిండిన పచ్చిక భూములను కలిగి ఉంది కాబట్టి ఈ సరస్సును పువ్వుల లోయ అని కూడా అంటారు. ఈ సరస్సు ప్రధానంగా హిమానీనదాల ద్రవీభవనం ద్వారా ఏర్పడింది. దీని ప్రవాహం వాయువ్య దిశగా ఉండి, తులాయిల్ వద్ద నీలం నదిలో కలుస్తుంది.[2]
వివిధ ప్రాంతాల నుంచి దూరం
మార్చుగడ్సర్ సరస్సు శ్రీనగర్ నుండి ఈశాన్యంలో 108 కిలోమీటర్ల దూరంలో, నారనాగ్ నుండి 28 కిలోమిటర్ల దూరంలో ఉంది. జూన్ నుండి సెప్టెంబర్ మధ్య కాలంలో ఈ సరస్సును సందర్శించడానికి అనువైన సమయం.[3] [4]
నమ్మకాలు
మార్చుగడ్సర్ సరస్సును యమసర్ అని కూడా అంటారు, అంటే యమ సరస్సు అని అర్థం. దీనిని మృత సరస్సు అని కూడా అంటారు. ఎందుకంటే వేసవి కాలంలో ఈ సరస్సు పొలిమేరల్లో మేస్తున్న అనేక గొర్రెలను ఈ సరస్సు మింగేస్తుంది దీంట్లో ఉన్న ఆక్టోపస్ దీనికి కారణం అని ప్రజలు నమ్ముతారు. కాబట్టి దీనిని రాక్షస సరస్సుగా కూడా ప్రజలు భావిస్తారు.[5]
మూలాలు
మార్చు- ↑ Central Asia: section 1. A gazetteer of Kashmír. Barbican Publishing Company, 1995. 1995. pp. 188, 496–. ISBN 9781900056854. Retrieved 31 July 2012.
{{cite book}}
: Cite uses deprecated parameter|authors=
(help) - ↑ "Gangabal in Ganderbal". kashmirparadise.com. Archived from the original on 2012-04-25. Retrieved 2012-04-19.
- ↑ "Fishes and Fisheries in high altitude lakes, Vishansar, Gadsar, Gangabal, Krishansar". Fao.org. Retrieved 2012-04-19.
- ↑ Petr, T, ed. (1999). Fish and fisheries at higher altitudes : Asia. Rome: FAO. p. 72. ISBN 92-5-104309-4.
- ↑ Excelsior, Daily (2012-08-17). "Sacred Shrines of Haramukh" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-05-15.