కాశ్మీరు విభాగం

జమ్మూ కాశ్మీరు రాష్ట్రంలోని జిల్లాల సమూహాలతో కూడిన ఒక విభాగం
(కాశ్మీరు లోయ నుండి దారిమార్పు చెందింది)

కాశ్మీర్ విభాగం, జమ్మూ కాశ్మీరు రాష్ట్రంలోని జిల్లాల సమూహాలతో కూడిన రెండు పరిపాలనా విభాగాలలో ఇది ఒకటి. దీనిని కాశ్మీరు లోయ, " వేల్ ఆఫ్ కాశ్మీర్ " అని కూడా పిలుస్తారు. ఈ లోయకు నైరుతిదిశలో పీర్ పంజాల్ శ్రేణి, ఈశాన్యంలో ప్రధాన హిమాలయ శ్రేణి సరిహద్దులుగా ఉన్నాయి.ఇది సుమారు 135 కి.మీ.(84 మైళ్లు) పొడవు, 32 కి.మీ. (20 మైళ్ళు) వెడల్పుతో జీలం నది పరీవాహక ప్రాంతంలో ఉంది.కాశ్మీరు లోయ విభాగంలో ప్రధానమైన నగరం శ్రీనగర్. ఇది జమ్మూ కాశ్మీరు రాష్ట్రానికి వేసవి రాజధాని. కాశ్మీరు లోయలోని ఇతర ప్రధాన నగరాలు బారాముల్లా, అనంతనాగ్, పుల్వామా.

కాశ్మీరు విభాగం
ఉపగ్రహం నుండి కాశ్మీర్ లోయ. పిర్ పంజాల్ శ్రేణి మంచుతో కప్పబడిన శిఖరాలు (చిత్రంలో ఎడమ; దిక్సూచిలో నైరుతి) హిమాలయాలు (చిత్రంలో కుడి; దిక్సూచిలో ఈశాన్య) లోయలో ఉన్నాయి
ఉపగ్రహం నుండి కాశ్మీర్ లోయ. పిర్ పంజాల్ శ్రేణి మంచుతో కప్పబడిన శిఖరాలు (చిత్రంలో ఎడమ; దిక్సూచిలో నైరుతి) హిమాలయాలు (చిత్రంలో కుడి; దిక్సూచిలో ఈశాన్య) లోయలో ఉన్నాయి
కాశ్మీర్ డివిజన్ (నారింజ రంగు సరిహద్దు) విస్తృత కాశ్మీర్ ప్రాంతంలో చూపబడింది
కాశ్మీర్ డివిజన్ (నారింజ రంగు సరిహద్దు) విస్తృత కాశ్మీర్ ప్రాంతంలో చూపబడింది
దేశం భారతదేశం
రాష్ట్రంజమ్మూ కాశ్మీరు
జిల్లాఅనంతనాగ్, బారాముల్లా, బుద్గాం, బండిపోరా, గందర్బల్ కుప్వారా, కుల్గాం, పుల్వామా, షోపియన్, శ్రీనగర్
ప్రధానకేంద్రంశ్రీనగర్
చరిత్రగల విభాగాలు
జాబితా
  • Kamraz (North Kashmir)[1]
Government
 • Typeపరిపాలనా విభాగాలు
 • డివిజనల్ కమీషనర్పాండురంగ్ కొండ్‌బరావ్ పోల్
విస్తీర్ణం
 • Total15,948 కి.మీ2 (6,158 చ. మై)
Dimensions
 • Length135[2] కి.మీ (83.885 మై.)
 • Width32[2] కి.మీ (19.884 మై.)
Elevation
1,620[2] మీ (5,314 అ.)
జనాభా
 (2011[3])
 • Total69,07,622[3]
 • జనసాంద్రత450.06/కి.మీ2 (1,165.7/చ. మై.)
Demonym(s)కాశ్మీరీలు, కోషూర్స్
జాతి, భాష
 • భాషలుకాశ్మీరీ, ఉర్దూ, హిందీ,[4] ఆంగ్లం,[5] కాశ్మీరీ, గ్రోజ్రి, సైనా
Time zoneUTC+5:30 (ప్రామాణిక కాలమానం)
Vehicle registrationJK
ఎత్తైన శిఖరంమాకోయి శిఖరం (5458 మీ.)
పెద్ద సరస్సులువూలార్ సరస్సు(260 కి.మీ2 (100 చ. మై.))[6]
Websitehttp://kashmirdivision.nic.in/

విభాగంలోని జిల్లాలు

మార్చు

జమ్మూ కాశ్మీరు కేంద్రపాలిత ప్రాంతంలోని రెండు విభాగాలలో కాశ్మీర్ విభాగం ఒకటి. ఈ విభాగానికి దక్షిణాన జమ్మూ విభాగం, తూర్పున లడఖ్ సరిహద్దులుగా ఉండగా, దానికి ఉత్తర, పశ్చిమ దిక్కుల్లో సరిహద్దుగా నియంత్రణ రేఖ ఉంది. ఈ విభాగంలో ఈ కింది 10 జిల్లాలు ఉన్నాయి.[7]

  1. అనంతనాగ్
  2. కుల్గాం
  3. పుల్వామా
  4. షోపియన్
  5. బుద్గాం
  6. శ్రీనగర్
  7. గందర్బల్
  8. బండిపోరా
  9. బారాముల్లా
  10. కుప్వారా

గణాంకాలు

మార్చు

2001, 2011 భారత జనాభా లెక్కలు ప్రకారం జమ్మూ విభాగంలోని జిల్లాల జనాభా గణాంకాలు ఈ కింది విధంగా ఉన్నాయి.

జిల్లా పేరు జిల్లా ప్రధాన కేంద్రం విస్తీర్నం జనాభా
(2001)
జనాభా
(2011)
వైశాల్యం

(చ.కి.మీ)

వైశాల్యం

(చ.మైళ్లు)

గ్రామీణ ప్రాంతం

(చ.కి.మీ)

పట్టణ ప్రాంతం

(చ.కి.మీ)

సూచిక
అనంతనాగ్ అనంతనాగ్ 3,574 1,380 3,475.76 98.24 [8] 7,34,549 10,69,749
కుల్గాం కుల్గాం 410 158 360.20 49.80 [9] 4,37,885 4,23,181
పుల్వామా పుల్వామా 1,086 419 1,047.45 38.55 [10] 4,41,275 5,70,060
షోపియన్ షోపియన్ 312 120 306.56 5.44 [11] 2,11,332 2,65,960
బుద్గాం బుద్గాం 1,361 525 1,311.95 49.05 [12] 6,29,309 7,55,331
శ్రీనగర్ శ్రీనగర్ 1,979 764 1,684.42 294.53 [13] 9,90,548 12,50,173
గందర్బల్ గందర్బల్ 259 100 233.60 25.40 [14] 2,11,899 2,97,003
బండిపోరా బండిపోరా 345 133 295.37 49.63 [15] 3,16,436 3,85,099
బారాముల్లా బారాముల్లా 4,243 1,638 4,179.44 63.56 [16] 8,53,344 10,15,503
కుప్వారా కుప్వారా 2,379 919 2,331.66 47.34 [17] 6,50,393 8,75,564

వాతావరణం

మార్చు
శ్రీనగర్
Climate chart (explanation)
ఫిమామేజూజుసెడి
 
 
48
 
7
−2
 
 
68
 
8
−1
 
 
121
 
14
3
 
 
85
 
21
8
 
 
68
 
25
11
 
 
39
 
30
15
 
 
62
 
30
18
 
 
76
 
30
18
 
 
28
 
27
12
 
 
33
 
22
6
 
 
28
 
15
1
 
 
54
 
8
−2
Average max. and min. temperatures in °C
Precipitation totals in mm

కాశ్మీర్ లోయలో ఒక మోస్తరు వాతావరణం ఉంటుంది. భౌగోళికంగా ఇది ఉన్న స్థానాన్ని బట్టే ఇక్కడి శీతోష్ణస్థితి ఉంటుంది. లోయకు ఉత్తరాన కారకోరం శ్రేణి, దక్షిణ పశ్చిమాల్లో పిర్ పంజాల్ శ్రేణి ,తూర్పున జన్స్కార్ శ్రేణి ఉన్నాయి.[18] వసంత ఋతువు, శరదృతువుల్లో చల్లగాను, వేసవిలో తేలికపాటి చల్లగాను, శీతాకాలంలో బాగా చల్లగానూ ఉంటుందని ఇక్కడి శీతోష్ణస్థితి గురించి చెప్పవచ్చు. సువిశాలమైన లోయలో భౌగోళిక పరిస్థితుల్లో వైవిధ్యం కనిపించే వివిధ జిల్లాలలో, దిగువన ఉన్న జిల్లాలతో పోలిస్తే కొండ ప్రాంతాలలో వాతావరణం చల్లగా ఉంటుంది.

వేసవి సాధారణంగా తేలికగా, చాలా పొడిగా ఉంటుంది. కానీ సాపేక్ష ఆర్ద్రత (రిలెటివ్ హ్యుమిడిటీ) సాధారణంగా ఎక్కువగా ఉంటుంది, రాత్రులు చల్లగా ఉంటాయి. అవపాతం ఏడాది పొడవునా సంభవిస్తుంది. ఏ నెల కూడా ప్రత్యేకించి పొడిగా ఉండదు. జూలై నెలలో ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది (కనిష్ట ఉష్ణోగ్రత 16°C,గరిష్ట ఉష్ణోగ్రత 32°C). డిసెంబరు-జనవరి నెలలు అత్యంత శీతలమైనవి (కనిష్ట ఉష్ణోగ్రత -15°C, గరిష్ట ఉష్ణోగ్రత 0°C).

భారతదేశంలోని ఇతర మైదాన ప్రాంతాలతో పోలిస్తే, కాశ్మీర్ లోయలో మరింత మితమైన వాతావరణం ఉంటుంది. కానీ వాతావరణ పరిస్థితులు అనూహ్యంగా ఉంటాయి. నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 33°C, నమోదైన అత్యల్పం 18°C.). 2012 జనవరి 5, 6 తేదీలలో వచ్చిన శీతాకాలపు తుఫానులో లోయను మంచు మందపాటి పొరగా కమ్మేసి లోయను దిగ్భ్రాంతికి గురిచేసింది. కాశ్మీర్ లోయలో గత కొన్నేళ్లుగా సాపేక్ష ఆర్ద్రత, వార్షిక అవపాతం పెరుగుతూ ఉన్నాయి. వాణిజ్యపరంగా చేపట్టిన అడవుల పెంపకం ప్రాజెక్టులు దీనికి కారణం. పార్కుల విస్తరణ కూడా ఒక కారణమే.

రవాణా

మార్చు

కాశ్మీర్ లోయ రోడ్లు, వాయు మార్గాల ద్వారా జమ్మూ ప్రాంతానికి, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతానికీ అనుసంధానించబడి ఉంది. ఖాజీగుండ్ సమీపంలోని బనిహాల్ సొరంగ మార్గం ద్వారా వెళ్ళే జాతీయ రహదారి 1ఎ ద్వారాను, సింథన్ కనుమ, కిష్త్వార్ ల గుండా వెళ్ళే జాతీయ రహదారి ఎచ్ 1బి ద్వారానూ కాశ్మీరు లోయ నుండి జమ్మూ ప్రాంతాన్ని, భారతదేశం లోని ఇతర ప్రాంతాలనూ చేరుకోవచ్చు.

శ్రీనగర్ విమానాశ్రయం, కాశ్మీర్ లోయలోని ప్రధాన విమానాశ్రయం. జమ్మూ, లేహ్, ముంబై, చండీగఢ్, న్యూడిల్లీ నుండి విమానాలు నడుస్తున్నాయి. ఇతర విమానాశ్రయాలు ఉధంపూర్, లే, జమ్మూలలో ఉన్నాయి. అనంతనాగ్‌లో విమానాశ్రయం ప్రతిపాదనలో ఉంది.

కాశ్మీర్ లోయలో 119 కి.మీ (74 మైళ్లు) పొడవైన ఆధునిక రైల్వే మార్గం లోయ పశ్చిమ భాగంలోని బారాముల్లాను, శ్రీనగరును, ఖాజిగుండ్‌తో కలుపుతోంది. 2009 అక్టోబరులో దీన్ని ప్రారంభించారు. లోయలో రవాణా ప్రధానంగా రోడ్డు మార్గం ద్వారా జరుగుతుంది.

మూలాలు

మార్చు
  1. "Spoken Kashmiri: A Language Course". Archived from the original on 29 November 2016. Retrieved 1 February 2017.
  2. 2.0 2.1 2.2 "Vale of Kashmir | valley, India". Archived from the original on 4 August 2016. Retrieved 2016-07-08.
  3. 3.0 3.1 "Archived copy". Archived from the original on 22 February 2018. Retrieved 18 December 2016.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  4. "The Jammu and Kashmir Official Languages Act, 2020" (PDF). The Gazette of India. Retrieved 27 September 2020.
  5. "Parliament passes JK Official Languages Bill, 2020". Rising Kashmir. 23 September 2020. Archived from the original on 24 సెప్టెంబరు 2020. Retrieved 23 September 2020.
  6. "Wular Lake | lake, India". Archived from the original on 2 February 2017. Retrieved 1 February 2017.
  7. "In Depth-the future of Kashmir". BBC News. Archived from the original on 14 June 2017. Retrieved 16 April 2013.
  8. District Census Handbook Anantnag, Part A (PDF). Census of India 2011 (Report). July 2016. p. 9. Retrieved 21 November 2020.
    District Census Handbook Anantnag, Part B (PDF). Census of India 2011 (Report). July 2016. pp. 12, 22. Retrieved 21 November 2020.
  9. District Census Handbook Kulgam, Part A (PDF). Census of India 2011 (Report). July 2016. p. 10. Retrieved 21 November 2020.
    District Census Handbook Kulgam, Part B (PDF). Census of India 2011 (Report). 16 June 2014. pp. 12, 22. Retrieved 21 November 2020.
    Part B page 12 says the are of the district is 404 sq km, but page 22 says 410 sq km.
  10. District Census Handbook Pulwama, Part B (PDF). Census of India 2011 (Report). 16 June 2014. pp. 12, 22. Retrieved 21 November 2020.
  11. District Census Handbook Shupiyan, Part A (PDF). Census of India 2011 (Report). 16 June 2014. p. 10. Retrieved 21 November 2020.
    District Census Handbook Shupiyan, Part B (PDF). Census of India 2011 (Report). 16 June 2014. p. 12, 22. Retrieved 21 November 2020.
    Part B pages 12 and 22 say the district area is 312.00 sq km, but Part A page 10 says 307.42 sq km.
  12. District Census Handbook Badgam, Part A (PDF). Census of India 2011 (Report). July 2016. pp. 10, 46. Retrieved 21 November 2020.
    District Census Handbook Badgam, Part B (PDF). Census of India 2011 (Report). 16 June 2014. pp. 11, 12, 22. Retrieved 21 November 2020.
    Part A says the district area is 1371 sq km, Part B says 1371 sq km (page 11) and 1361 sq km (page 12s and 22).
  13. District Census Handbook Srinagar, Part A (PDF). Census of India 2011 (Report). July 2016. pp. 11, 48. Retrieved 21 November 2020.
    Part A page 48 says the district area was 2228.0 sq km in 2001 and 1978.95 sq km in 2011.
  14. District Census Handbook Ganderbal, Part B (PDF). Census of India 2011 (Report). July 2016. pp. 11, 12 and 22. Retrieved 21 November 2020.
    Part B page 11 says the district area is 393.04 sq km, but pages 12 and 22 say 259.00 sq km.
  15. District Census Handbook Bandipora, Part A (PDF). Census of India 2011 (Report). July 2016. pp. 10, 47. Retrieved 21 November 2020.
    District Census Handbook Bandipora, Part B (PDF). Census of India 2011 (Report). 16 June 2014. pp. 11, 20. Retrieved 21 November 2020.
  16. District Census Handbook Baramulla, Part A (PDF). Census of India 2011 (Report). July 2016. p. 11. Retrieved 21 November 2020.
    District Census Handbook Baramulla, Part B (PDF). Census of India 2011 (Report). 16 June 2014. p. 22. Retrieved 21 November 2020.
  17. District Census Handbook Kupwara, Part A (PDF). Census of India 2011 (Report). July 2016. p. 7. Retrieved 21 November 2020.
    District Census Handbook Kupwara, Part B (PDF). Census of India 2011 (Report). 16 June 2014. pp. 11, 12. Retrieved 21 November 2020.
  18. Sharad Singh Negi (1986). Geo-botany of India. Periodical Expert Book Agency, 1986. p. 58–. ISBN 9788171360055. Retrieved 11 July 2012.

వెలుపలి లంకెలు

మార్చు