గణేష్ హిమల్
గణేష్ హిమాల్ అనేది ఉత్తర-మధ్య నేపాల్‌లో ఉన్న, హిమాలయాల ఉప-శ్రేణి. అయితే ఈ శ్రేణి లోని కొన్ని శిఖరాలు టిబెట్ సరిహద్దులో ఉన్నాయి. తూర్పున ఉన్న త్రిశూలి గండకి లోయ దీనిని లాంగ్టాంగ్ హిమాల్ నుండి వేరు చేస్తుంది; పశ్చిమాన ఉన్న బుధి (బురి) గండకి లోయ, శ్యార్ ఖోలా లోయలు దీనిని శృంగి హిమాల్, మన్సిరి హిమల్ (మనస్లు శిఖరం ఇక్కడే ఉంది) నుండి వేరు చేస్తాయి. [2]
గణేష్ హిమల్ | |
---|---|
అత్యంత ఎత్తైన బిందువు | |
శిఖరం | యాంగ్రా |
ఎత్తు | 7,422 మీ. (24,350 అ.)[1] |
నిర్దేశాంకాలు | 28°23′33″N 85°07′48″E / 28.39250°N 85.13000°E[1] |
భౌగోళికం | |
దేశం | నేపాల్ |
జిల్లా | ధాడింగ్ - గూర్ఖా సరిహద్దు |
పర్వత శ్రేణి | హిమాలయాలు |
సరిహద్దు | లాంగ్టాంగ్ హిమల్, శృంగి హిమల్ and మాన్‌సిరి హిమల్ |
శ్రేణిలో ఎత్తైన శిఖరం యాంగ్రా 7,422 మీ. (24,350 అ.) ఎత్తున ఉంది. 7,000 మీ. (23,000 అ.) కంటే ఎక్కువ ఎత్తున మరో మూడు శిఖరాలు, 6,000 మీ. (20,000 అ.) కంటే ఎక్కువ ఎత్తున పద్నాలుగు శిఖ్రాలూ ఉన్నాయి.
శ్రేణికి ఈ పేరు హిందూ దేవత గణేశుడి నుండి వచ్చింది. ఈ శ్రేణి లోని పర్వతాల పేర్లు, ఎత్తులను వివిధ వర్గాలను బట్టి విభిన్నంగా ఉంటాయి. విభిన్న శిఖరాలను సూచించడానికి అతి తక్కువ సందిగ్ధతతో కూడిన పద్ధతి "గణేష్ NW" లాగా రాయడం. కానీ ఈ శ్రేణికి సంబంధించిన సాహిత్యంలో ఇలా వాడలేదు
ఎత్తైన శిఖరాలు
మార్చుశిఖరం[1] | ఎత్తు (m) [2] | ఎత్తు (ft) | నిర్దేశాంకాలు[3] | ప్రామినెన్స్ (m) [4] | మాతృ పర్వతం | మొదటి అధిరోహణ |
---|---|---|---|---|---|---|
యాంగ్రా (గణేష్ I/మెయిన్/NE) | 7,422 | 24,350 | 28°23′33″N 85°07′48″E / 28.39250°N 85.13000°E | 2,352 | మానస్లు | 1955 |
గణేష్ II/NW | 7,118 | 23,353 | 28°22′45″N 85°03′24″E / 28.37917°N 85.05667°E | 1,198 | యాంగ్రా | 1981 |
సాలసుంగో (గణేషు III/SE) | 7,043 | 23,107 | 28°20′06″N 85°07′18″E / 28.33500°N 85.12167°E | 641 | గణేష్ IV | 1979 |
పబీల్ (గణేషు IV/SW) | 7,104 | 23,307 | 28°20′45″N 85°04′48″E / 28.34583°N 85.08000°E | 927 | గణేష్ II | 1978 |
గమనికలు
మార్చు- ^ గణేశ్ II, సాలసుంగో (గణేశ్ III), పబీల్ (గణేశ్ IV) అనే పేర్లు Finnmap నుండి వచ్చాయి.[3] దీని కంటే ముందు వచ్చిన Carter[2][4], Neate[5] (Carter నుండి ఉత్పన్నమైనది) ల లోని పేర్ల కంటే ఇవి భిన్నంగా ఉంటాయి. Ohmori attests the name ఇక్కడ సాలసుంగో పేరుతో ఉన్న ఆగ్నేయ శిఖరానికి ఓహ్మోరి "లాప్సాంగ్ కార్బో" అనే పేరు పెట్టాడు.[6]
- ^ ఎత్తులు Finnmap చూపించినవి.[3]
- ^ నిర్దేశాంకాలు, ఎబర్‌హార్డ్ జుర్గాల్స్కీ Finnmap నుండి తెచ్చినవి.
- ^ ప్రామినెన్స్ విలువలు (యాంగ్రా తప్పించి) ఎబర్‌హార్డ్ జుర్గాల్స్కీ Finnmap నుండి తెచ్చినవి. యాంగ్రా విలువ, peaklist.org నుండి తెచ్చినది.[1]
- ధాడింగ్ ప్రదేశం
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 "Tibet Ultra-Prominences". PeakList. Retrieved 3 January 2015.
- ↑ 2.0 2.1 . "Classification of the Himalaya".
- ↑ 3.0 3.1 Finnmap topographic map of the Ganesh Himal, produced for the Government of Nepal.
- ↑ American Alpine Journal 1989, p. 210.
- ↑ Neate, J. (1989). High Asia: An Illustrated History of the 7000 Metre Peaks. The Mountaineers. ISBN 978-0898862386.
- ↑ Ohmori, K. (1994). Over The Himalaya. Cloudcap Press (The Mountaineers). ISBN 978-0938567370.