గదగ్

కర్ణాటక రాష్ట్రం, గడగ్ జిల్లాలోని ఒక పట్టణం.

గదగ్-బెటగేరి, భారతదేశం, కర్ణాటక రాష్ట్రం, గడగ్ జిల్లాలోని ఒక పట్టణం.ఇది నగరపురపాలక సంఘం,గడగ్ జిల్లాకు పరిపాలనా ప్రధాన కార్యాలయం. అసలు నగరం గదగ్ -బెటగేరి (లేదా బెట్గేరి ) గదగ్ నగర సోదర పట్టణం. ఈ రెండు సంయుక్త నగర పరిపాలనను కలిగి ఉన్నాయి. గదగ్-బెటగేరి పురపాలక సంఘం పరిధిలో 1,72,813 జనాభా ఉన్నారు.ఈ పట్టణం 54.0956 చ.కి.మీ. (20.884 చ.మైళ్లు) వైశాల్యంతో ఉంది.గదగ్‌లోని కనగినహాల్ ఆసియాలోనే మొదటి సహకార సంఘం జన్మస్థలం.[1] [2] పట్టణంలో వీరనారాయణ ఆలయం, త్రికూటేశ్వర ఆలయం, మతపరమైన, చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగినప్రదేశాలు. [3] గదగ్ పట్టణం ధార్వాడ్ నుండి 80 కి.మీ. (50 మైళ్లు) దూరంలో ఉంది. గుత్తి-వాస్కో జాతీయ రహదారిపై హుబ్లీ నుండి 60 కి.మీ. (37మైళ్లు) దూరంలో ఉంది.

Gadag-Betageri
Veeranarayana Temple
Veeranarayana Temple
Gadag-Betageri is located in Karnataka
Gadag-Betageri
Gadag-Betageri
Location in Karnataka, India
Gadag-Betageri is located in India
Gadag-Betageri
Gadag-Betageri
Gadag-Betageri (India)
Coordinates: 15°25′00″N 75°37′00″E / 15.4167°N 75.6167°E / 15.4167; 75.6167
Country India
StateKarnataka
RegionBayaluseeme
DistrictGadag
Government
 • TypeCity Municipal Council (CMC)
 • BodyGadag-Betageri CMC
విస్తీర్ణం
 • City54.01 కి.మీ2 (20.85 చ. మై)
Elevation
654 మీ (2,146 అ.)
జనాభా
 (2010)
 • City1,72,813
 • జనసాంద్రత4,657/కి.మీ2 (12,060/చ. మై.)
 • Metro
3,67,258
Languages
 • OfficialKannada
Time zoneUTC+5:30 (IST)
PIN
582 101-103
Telephone code08372
ISO 3166 codeIN-KA
Vehicle registrationKA-26

గదగ్ నిర్మాణ శైలి

మార్చు

గదగ్ వాస్తుశిల్పం, [4] క్లిష్టమైన శిల్పకళతో అలంకరించబడిన స్తంభాలతో గుర్తించబడింది,[5] పశ్చిమ చాళుక్య (లేదా కళ్యాణి చాళుక్యులు) రాజుసోమేశ్వర -1 కాలంలో ఉద్భవించింది.ఇదిసా.శ.1050 నుండి సా.శ.1200 మధ్య 150 సంవత్సరాల కాలంలో అభివృద్ధి చెందింది. ఈ కాలంలో చుట్టుప్రక్కల ఆ ప్రాంతంలో దాదాపు 50 దేవాలయాలు నిర్మించబడ్డాయి.వాటికి ఉదాహరణలుగా గదగ్‌లోని త్రికూటేశ్వర ఆలయం, కాశీవిశ్వేశ్వర ఆలయం (లక్కుండి), దంబాల్‌లోని దొడ్డబసప్ప ఆలయం, అన్నిగేరిలోని అమృతేశ్వర ఆలయం మొదలైనవి.

గణాంకాలు

మార్చు

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం గడగ్-బెటగేరిలో పట్టణంలో 1,72,813 జనాభా ఉంది. మొత్తం జనాభాలో పురుషులు 86,165 మంది ఉండగా, స్త్రీలు 86,648 మంది ఉన్నారు.గడగ్-బెటగేరి సగటు అక్షరాస్యత రేటు 85.56%. లింగనిష్పత్తి 1000 మంది పురుషులకు 1006 మంది స్త్రీలు ఉన్నారు. మొత్తం జనాభాలో 18,419 మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు.[6] కన్నడం ప్రధానమైన, విస్తృతంగా మాట్లాడేభాష. ఇంగ్లీషు, హిందీ కొంతమంది మాట్లాడతారు.కొంత మందికి అర్థం అవుతుంది.

ప్రముఖ వ్యక్తులు

మార్చు
  • పంచాక్షర గవాయి -గదగ్‌కు చెందినగాయకుడు. అతని సంగీత పాఠశాల వీరేశ్వర పుణ్యాశ్రమ ఉత్తర కర్ణాటకలో ప్రసిద్ధి చెందిన సంస్థ. అతను 2010 చివరిలో మరణించే వరకు వీరేశ్వరపుణ్యాశ్రమానికి నాయకత్వం వహించాడు.
  • పుట్టరాజ్ గవాయ్ - భారత ప్రభుత్వంనుండి "పద్మ భూషణ్" అవార్డు గ్రహీత. దృశ్యపరంగా సవాలుచేయబడిన భారతీయ సంగీతకారుడు (విద్వాంసుడు,సంగీత ఉపాధ్యాయుడు, సామాజిక సేవకుడు.
  • భీమ్‌సేన్ జోషి-హిందూస్థానీ గాయకుడు, భారతరత్న అవార్డు గ్రహీత
  • సునీల్ జోషి - క్రికెటర్, గదగ్‌లో జన్మించాడు.
  • హుయిల్‌గోల్ నారాయణరావు - కర్నాటక రాష్ట్ర ఆవిర్భావాన్ని తెలిపే "ఉదయవగలి నమ్మ చెలువ కన్నడ నాడు" గీతాన్ని రచించాడు
  • విజయ్ సంకేశ్వర్ - వ్యాపారవేత్త, వి.ఆర్.ఎల్. సముదాయ వ్యవస్థాపకుడు, విజయ కర్ణాటక వార్తాపత్రిక, విజయవాణి.
  • విలాస్ నీలగుండ్ - 100 మీటర్ల స్ప్రింట్‌లో (4x100 మీటర్లు) భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన రన్నర్.[7]
  • ఆర్. ఎస్. మొగలి - ప్రముఖ రచయిత, "కన్నడ సాహిత్య చరిత్ర" రచయిత
  • గిరడ్డి గోవిందరాజు - ప్రముఖ విమర్శకుడు, "కర్ణాటక సాహిత్య అకాడమీ" మాజీ అధ్యక్షుడు.[8][9]
  • జి. బి. జోషి - ప్రముఖ నాటక రచయిత, "మనోహర గ్రంథమాల" వ్యవస్థాపకుడు

మూలాలు

మార్చు
  1. Nayak, N. Dinesh (2016-03-18). "Reviving the Kanaginahal cooperative society". The Hindu. ISSN 0971-751X. Retrieved 2022-03-05.
  2. Vincent D'Souza (May 13, 2009). "Asia's first co-op bank's future bleak | Hubballi News - Times of India". The Times of India. Retrieved 2022-03-05.
  3. "Gadag" Archived 4 మార్చి 2016 at the Wayback Machine www.nkpost.kar.nic.in. Retrieved September 9, 2012
  4. "In search of Indian records of Supernovae" (PDF). Retrieved 2009-03-12.
  5. "Kalyani Chalukyan & chanakya temples". Retrieved 2009-03-12.
  6. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
  7. "Islamabad-bound athletes named" Archived 2016-03-04 at the Wayback Machine Deccan Herald(on-line), 21 March 2004. Retrieved 9 September 2012
  8. "Giraddi Govindraj passes away". The Hindu. 11 May 2018. ISSN 0971-751X. Retrieved 17 July 2022.
  9. Staff Correspondent (2016-01-22). "Ambikatanayadatta Award for Giraddi Govindaraj, Venkatesh Murthy". The Hindu. ISSN 0971-751X. Retrieved 2022-03-05.

వెలుపలి లంకెలు

మార్చు


"https://te.wikipedia.org/w/index.php?title=గదగ్&oldid=3940957" నుండి వెలికితీశారు