గద్దె లింగయ్య
గద్దె లింగయ్య ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు. బహు గ్రంథకర్త. అనువాదకుడు. ఇతడు కృష్ణా జిల్లా, పెదపారుపూడి మండలానికి చెందిన ఎలమర్రు గ్రామంలో నివసించాడు. 1931లో ఆదర్శ గ్రంథమండలిని నెలకొల్పాడు. ఇతడు స్వాతంత్ర్య సంగ్రామంలో అరెస్టు కాబడి రాజమండ్రి, కడలూరు జైళ్లలో ఆరునెలలు శిక్ష అనుభవించాడు. ఇతడు పడవలపై అచ్చుయంత్రాలను అమర్చి రహస్యంగా పుస్తకాలు, కరపత్రాలు ప్రచురించి స్వాతంత్ర్యోద్యమానికి ఎంతగానో పాటుపడ్డాడు. ఇతడు ప్రభ అనే మాసపత్రికను 1935లో ప్రారంభించి దానికి సంపాదకుడిగా వ్యవహరించాడు. ఈ పత్రిక ఆంధ్రప్రాంతంలో తొలి కమ్యూనిస్టు ఉద్యమ పత్రిక. ఇతని జ్ఞాపకార్థం విజయవాడలో ఒక గ్రంథాలయానికి గద్దెలింగయ్య గ్రంథాలయం అనే పేరును పెట్టారు. హర్యానా రాష్ట్రంలో ఇతని పేరుమీద లింగయ్య యూనివర్శిటీ నెలకొల్పబడి ఉంది. విజయవాడ సమీపంలోని నున్న గ్రామంలో లింగయ్యాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ టెక్నాలజీ ఇతని పేరుమీదనే ఉంది.