గమనం 2021లో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానున్న సినిమా. రమేశ్ కరుటూరి, వెంకీ పుషడపు, జ్ఞానశేఖర్ వి.ఎస్. నిర్మించిన ఈ సినిమాకి సుజనారావు దర్శకత్వం వహించింది. శ్రియ, నిత్యామీనన్‌, ప్రియాంక జ‌వాల్క‌ర్,శివ కందుకూరి, సుహాస్, బిత్తిరి సత్తి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 10 డిసెంబరు​ 2021న విడుదలవ్వగా, 2022 జనవరి 28 నుండి అమెజాన్​ ప్రైమ్​ వీడియోలో స్ట్రీమింగ్​ కానుంది.[1] గమనం సినిమా గురించి. ✍️ మొన్న ఆ/ఈ మధ్య హైదరాబాదులో వచ్చిన భారీ వర్షాలు, వరదలు ఎంతోమంది జీవితాల్ని నెలల తరబడి వేదించాయి. మన అవ్యవస్థను,జీవన నాణ్యతను‌ నాగరికత నిర్వాకాన్ని కళ్ల ముందుంచాయి.

గమనం
దర్శకత్వంసుజనా రావు
రచనసుజనా రావు
నిర్మాతరమేష్ కరుటూరి
వెంకీ పుషడపు
జ్ఞానశేఖర్ వి.ఎస్‌
తారాగణంశ్రియ, నిత్యామీనన్‌, ప్రియాంక జ‌వాల్క‌ర్ , బిత్తిరి సత్తి
ఛాయాగ్రహణంజ్ఞానశేఖర్ వి.ఎస్‌
సంగీతంఇళయరాజా
నిర్మాణ
సంస్థలు
క్రియా ఫిలిం కార్పొరేషన్, కాళీ ప్రొడక్షన్స్
విడుదల తేదీs
10 డిసెంబర్​ 2021(థియేటర్)
28 జనవరి 2022 అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ
దేశం భారతదేశం
భాషతెలుగు
బహుశా మనలో ఎంతోమంది వరద కష్టాల్ని మర్చిపోయి కూడా ఉంటారు.

కానీ ఎంతో సున్నిత హృదయం కలిగిన ఈ గమనం సినిమా దర్శకురాలు వరదల నేపథ్యంలో ఓ మూడు జీవితాలు ఎలా ఇక్కట్ల పాలయ్యాయో తెరపరిచి, వారి బ్రతుకులు ఎలా స్తంబించాయో " గమనం"తో కళ్ళముందుంచింది.

నటి " శ్రీయ సరన్ "చెవిటి గృహిణిగా ప్రధాన పాత్రలో నటించింది. హైదరాబాదులోని ఒక మురికివాడలో ఇరుకు అద్దె గదిలో తన చిన్న పాపతో ఉంటూ,ఒక కుట్టుమిషన్ కేంద్రంలో పనిచేస్తూ ఉంటుంది.ఆమెను మోసం చేసి దుబాయ్ కి వెళ్లి వేరే స్త్రీని పెళ్లి చేసుకుంటాడు ఆమె భర్త . ఈవిషయం తెలియక ఆమె తన భర్త క్షేమ సమాచారాలు గురించి ఆరాట పడుతుంది..తానే స్వయంగా భర్తతో మాట్లాడ డం కోసం పొదుపు చేసిన డబ్బులతో ఒక వినికిడి పరికరం కూడా కొనుక్కుంటుంది 

ఇక కథకు రెండవ పార్శ్వంలో - ఒక ముసల్మాన్ తాత ( చారు హాసన్) నానమ్మ, సమాజంలో గౌరవం (ఇజ్జత్) తో, గౌరవంగా జీవిస్తూ- కోల్పోయిన కొడుకును మనవడిలో చూసుకుంటూ గడుపుతుంటారు. తనకు ఇష్టమైన క్రికెట్ ఆటలో తన భవిష్యత్ వెతుక్కుంటూ తాత కోసమే మెడిసిన్ చదువుతుంటాడు వారి మనవడు. అనుకోకుండా అతని ప్రేమ వ్యవహారం తాతకు తలవొంపుగా మారుతుంది . తన వల్ల ఏంతో ఇజ్జత్ తో బ్రతికే తాత తీవ్ర అవమానం పాలు కావడాన్ని జీర్ణించుకోలేక పోతాడు మనవడు. కథలోని మూడవ పార్శ్వం- అనాథలు అయిన ఇద్దరు అన్నదమ్ముల జీవన యానం చెత్త సేకరణతో గడుస్తుంటుంది. తమ్ముడు ఎంతో ఆశ పడ్డ పుట్టినరోజు కేక్ కొనుక్కోవడం కోసం డబ్బు కూడా బెట్టే క్రమంలో, పరిచయం ఉన్న వ్యక్తి ( బిత్తిరి సత్తి) దగ్గర మట్టి వినాయక విగ్రహాలు తీసుకుని అమ్మేందుకు బయల్దేరి ఆపసోపాలు పడుతుంటారు.

పై మూడు కోణాల్లో కథనం సాగుతుండగా నగరంలో కురిసిన భారీ వర్షాలు ఈ ముగ్గురి జీవితాలను ఎంత దుర్భర పరిస్థితుల్లోకి నెట్టివేసాయి అన్నది ఈ గమనం . 

వరదల వల్ల ఊహించని విధంగా తన గదిలో నీటిలో దిక్బందనం అయిన ఆ చెవిటి మహిళ తన కూతుర్ని రక్షించుకో గలిగిందా? తాతయ్య పరువు కోల్పోయేలా చేశానన్న వ్యధతో ఇల్లు విడిచి వర్షాల్లో ఎక్కడికో బయల్దేరిన ఆ యువ క్రికెటర్ తిరిగి తన తాతయ్య గౌరవ మర్యాదలు నిలుపగలిగాడా?? మట్టి విగ్రహాలు అమ్మి పుట్టినరోజు కేకు కొనాలి అనుకుంటున్న ఆ చిన్నారి అభాగ్యుల కోరిక నెరవేరిందా??? మన సున్నితత్వాన్ని ప్రశ్నించుకునే, పరీక్షించుకునే సినిమా గమనం-#

చిత్ర నిర్మాణం

మార్చు

ఈ సినిమా నిర్మాణం 2019లో ప్రారంభమైంది.[2] చిత్ర షూటింగ్ ఎక్కువ శాతం హైదరాబాద్, విశాఖపట్నంలో జరిగింది. ఈ చిత్ర షూటింగ్ 2020లో పూర్తవగా, ట్రైలర్ ను 2020 నవంబరు 11న నటుడు పవన్‌కల్యాణ్‌ విడుదల చేశాడు.[3]

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
 • బ్యానర్: క్రియా ఫిలిం కార్పొరేషన్, కాళీ ప్రొడక్షన్స్
 • నిర్మాతలు:జ్ఞానశేఖర్ వి.ఎస్‌, రమేశ్‌ కరుటూరి, వెంకీ పుషడపు
 • కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుజనారావు [6]
 • సంగీతం: ఇళయరాజా
 • సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్ వి.ఎస్‌
 • పాటలు: కృష్ణకాంత్
 • మాటలు: సాయిమాధవ్‌ బుర్రా
 • ఎడిటర్: రామకృష్ణ ఎర్రం

మూలాలు

మార్చు
 1. Sakshi (27 January 2022). "ఇక ఓటీటీలోనూ గమనం చిత్రం.. ఎక్కడా ? ఎప్పుడంటే ?". Archived from the original on 28 జనవరి 2022. Retrieved 28 January 2022.
 2. The Times of India (12 September 2020). "Gamanam is an anthology that tells three stories: Sujana Rao - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 14 July 2021. Retrieved 14 July 2021.
 3. EENADU (11 November 2020). "నాకు వినపడకపోయినా నీకు గంట కొడుతున్నా: శ్రియ - Gamanam Trailer Out Now". Archived from the original on 14 July 2021. Retrieved 14 July 2021.
 4. 10TV (18 September 2020). "శైలపుత్రీ దేవిగా నిత్యా.. ఆదా శర్మ.. ?." (in telugu). Archived from the original on 14 July 2021. Retrieved 14 July 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
 5. Deccan Chronicle, Sashidhar (23 March 2020). "Discovering her calling in acting" (in ఇంగ్లీష్). Archived from the original on 14 July 2021. Retrieved 14 July 2021.
 6. Andhrajyothy (3 December 2021). "శ్రియ ఏడ్చింది.. ఇళయరాజా 'హే ఆపు' అన్నారు: సృజనారావు". Archived from the original on 3 December 2021. Retrieved 3 December 2021.

బయటి లింకులు

మార్చు