గర్భాదానము
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (అక్టోబరు 2016) |
సత్సంతానమునకు బీజముగా గర్బాధాన సంస్కారము. సంతానము మాత పితల యొక్క ఆత్మ, హృదయము, శరీరము నుండి జనించుచున్నది గదా! అందువలన తల్లిదండ్రుల దేహము (స్థూల, సూక్ష్మ) లోని దోషములు బిడ్డకు సంక్రమించును. ఈ విషయానికై తల్లిదండ్రులు తమ గర్భగ్రహణ యోగ్యతను, ఉపయుక్త కాలమును నిర్ణయించుకొని సంతానకాలమందు మనశ్శరీరాదులయందు గల పశుభావనను తొలగించుకొని సాత్త్వికమగు దైవ భావము కలిగియుండుట కొరకే ఈ గర్బాధాన సంస్కారము విధింపబడింది. తల్లిదండ్రుల చిత్తవృత్తులు సంతానోత్పత్తి కాలములో ఎలా ఉంటాయో అటువంటి లక్షణాలు కలిగిన బిడ్డలే జన్మిస్తారు. కావున తల్లిదండ్రులు గర్బాధాన సమయమున తాము దేవతలమని, పతి ప్రజాపతి యొక్క అంశ గలవాడనియు, పత్ని వసుమతి రూపమనియు తలచి దేవతా చింతనము చేయుచు గర్బాధానము చేయవలెను.
ఓం పూషాం భగం సవితామే దదాతు
రుద్రః కల్పయతు లలామగుం
ఓం విష్ణుర్యోనిం కల్పయతు
త్వష్టారూపాణి పిగుంశతు
ఆసించతు ప్రజాపతిర్ధాతా
గర్భం దధాతు తే
అనగా పుష్టి కారకుడైన సూర్యుడు, రుద్రుడు యోనిని కల్పింతురు గాక. వ్యాపకుడైన విష్ణువు గర్భగ్రహణము గావించు స్థానము ఇచ్చుగాక. దేవశిల్పియగు త్వష్ట రూపమిశ్రము చేయుగాక. ప్రజాపతి సించనము (తడువుట) చేయుగాక. సృష్టికర్త గర్భమును సంఘటింప జేయుగాక.
ఇట్లు దంపతులు దేవ భావ యుక్తమై రమించినచో తప్పకుండా సంతానము సులక్షణములతో ధార్మికము కలది కాగలదు. ఇందులో అణుమాత్రము కూడా సందేహము లేదు.
స్త్రీ పురుషులు (భార్యభర్తలు) ఇరువురు కలసి ఒక కొత్త ప్రాణికి జీవం పోయడాన్ని గర్బాధానం అంటారు. స్త్రీ పురుషుల కలయిక వలన స్త్రీ అండాశయంలో ఏర్పడిన అండంనకు పురుషునిలో ఉత్పత్తి అయిన వీర్యకణం ద్వారా ఫలదీకరణం చెందినట్లయితే స్త్రీ గర్భం దాల్చి నూతన జీవి పుట్టుకకు అవకాశం ఏర్పడుతుంది.
జంతువులు
మార్చుజంతువులు తోటి సహచర జంతువులను లోబరచుకుని వాటితో సంభోగం చేయడం ద్వారా ఆడ జంతువు అండాన్ని మగ జంతువు యొక్క ఇంద్రియం కలసి ఆడ జంతువు గర్భం దాల్చుతుంది. గర్భం దాల్చిన ఆడ జంతువు యొక్క పిండం అభివృద్ధి చెంది నూతన జంతువుకు జన్మనిస్తాయి. జంతువులు తమ తోటి సహచర జంతువులతో సంభోగాన్ని జరపడం ద్వారా ఇవి తమ సంతనాన్ని అభివృద్ధి పరచుకుంటాయి.