పిండం లేదా భ్రూణం అనేది ఒక బిడ్డ శిశువుగా పుట్టకముందు అభివృద్ధి చెందుతున్న దశ.[1] మానవులలో పిండం అనేది పిండోత్పత్తి దశ తరువాత దశ (అభివృద్ధి సమయం). మానవులలో ఈ పిండం దశ ఫలదీకరణం తరువాత తొమ్మిదవ వారం (లేదా గర్భధారణ వయస్సు 11 వారాలు) నుండి ప్రారంభమై పుట్టుక వరకు కొనసాగుతుంది. మానవులలో పిండమును 'గర్భస్తశిశువు' అని అంటారు, లేదా ఫలదీకరణం తరువాత ఇంచుమించు రెండు నెలలు లేదా 8 వారాల తర్వాత నుండి పురిటి సమయం వరకు 'గర్భస్తశిశువు' అని పిలుస్తారు. జనన పూర్వ అభివృద్ధి అనేది ఒక నిరంతరక్రియ, పిండం నుండి గర్భస్తశిశువును వేరుచేసే స్పష్టమైన లక్షణం లేదు. ఏదేమైనా, పిండం అన్ని ప్రధాన శరీర అవయవాల ఉనికిని కలిగి ఉంటుంది, అయినప్పటికీ అవి ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందివుండవు, క్రియాత్మకంగా ఉండవు, కొన్ని వాటి తుది శరీర నిర్మాణ సంబంధమైన ప్రదేశంలో ఉండివుండవు.

మానవ పిండం

మానవ గర్భంలో సాధారణంగా ఒక పిండం వుంటుంది, చాలా అరుదుగా రెండు లేదా అంతకుమించి పిండాలు ఏర్పడతాయి.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Ghosh, Shampa; Raghunath, Manchala; Sinha, Jitendra Kumar (2017), "Fetus", Encyclopedia of Animal Cognition and Behavior (in ఇంగ్లీష్), Springer International Publishing, pp. 1–5, doi:10.1007/978-3-319-47829-6_62-1, ISBN 9783319478296

వెలుపలి లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=పిండం&oldid=3871625" నుండి వెలికితీశారు