గవ్రీలో ప్రిన్సిప్
గవ్రీలో ప్రిన్సిప్ (1894 జూలై 25 – 1918 ఏప్రిల్ 28) సెర్బియా దేశస్థుడు. ఇతను ఆస్ట్రియాకు చెందిన ఆర్చ్ డ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్ ను, అతని భార్య సోఫియాను చంపడం మొదటి ప్రపంచ యుద్ధానికి ముఖ్య కారణమైంది.
గవ్రీలొ ప్రిన్సిప్ | |
---|---|
జననం | |
మరణం | 1918 ఏప్రిల్ 28 టెరెజిన్, బొహీమియా, ఆస్ట్రియా-హంగరీ | (వయసు 23)
మరణ కారణం | క్షయ |
సమాధి స్థలం | సెయింట్ మార్క్ శ్మశానం, సారాయెవో |
జాతీయత | ఆస్ట్రియా-హంగరీ |
ప్రిన్సిప్ బోస్నియాలోని ఓబ్లిజాయ్ అను ప్రదేశంలో జన్మించాడు. యుక్త వయసులో అతను ఆస్ట్రియా- హంగరీ ప్రాంతంలోని స్లావ్ అను ప్రాంతం సెర్బియాలో కొత్త దేశంగా ఏర్పడడానికి పోరాడే బృందాలలో చేరాడు. ఆ బృందాన్ని "యంగ్ బోస్నియా" అనేవారు. సెర్బియాలోని బ్లాక్ హాండ్ అనే శక్తివంతమైన బృందం యంగ్ బోస్నియాకు ఆయుధాలు ఇస్తూ సహాయపడుతూండేది.
ఒకసారి ఆస్ట్రియా రాజు ఫ్రాంజ్ ఫెర్డినాండ్ బోస్నియాలోని సారాయెవో ప్రాంతానికి వస్తున్నట్లు "యంగ్ బోస్నియా" బృందానికి సమాచారం అందింది. అందులోని ఆరుగురు కార్యకర్తలు బాంబులు, గన్లు తీసుకుని అతనిని చంపడానికి బయలుదేరారు. ఫెర్డినాండ్ కారు వేగంగా వెళ్ళడం వలన ఈ ఆరుగురు అతన్ని చంపలేకపోయారు. ఆ సమయంలో ప్రిన్సిప్ కేఫ్ కి సాండ్ విచ్ కొనడానికి వెళ్ళాడు. అతను బయటకి వచ్చినప్పుడు ఫెర్డినాండ్ కారు అతని ముందు ఆగుతుంది. కారు డ్రైవరు కారును పార్కింగ్ చేస్తున్న సమయంలో ప్రిన్సిప్ ఒక్క ఉదుటున వెళ్ళి ఫెర్డినాండ్ను తన వద్దనున్న గన్ తో కాల్చేసాడు. తరువాత అతని పక్కనే ఉన్న సైన్యాధ్యక్షుడిని కాల్చబోతుండగా ఫెర్డినాండ్ భార్య సోఫియా మధ్యలో అడ్డు రాగా ఆమెను కూడా కాల్చేసాడు.
ప్రిన్సిప్ను బంధించి విచారించినప్పుడు తన దేశ ప్రజల గురించి వారిని హత్య చేసినట్లు చెబుతాడు. ఆస్ట్రియా దీనిని తీవ్రమైన నేరంగా పరిగణిస్తుంది. కానిని అతనికి ఉరిశిక్ష విదించడానికి అతని వయస్సు 19 సంవత్సరాలే అవడంతో ప్రభుత్వం అతనికి 20 ఏళ్ళు వయసు వచ్చేవరకు అతనిని చెరసాలలో ఉంచమని శిక్ష విధిస్తుంది. అప్పటి ఆస్ట్రియా-హంగరీ చట్టం ఉరిశిక్ష కనీసం 20 సంవత్సరాలు దాటితేగాని వేయ్యదు. చెరసాల జీవతం కడు దయనీయంగా ఉండేది. ఆ సమయంలో అతనికి క్షయ వ్యాధి సోకింది. వ్యాధి తీవ్రతకు అతని శరీరంలోని కుడి చేయి ద్వారా పూర్తిగా తినివేయడం వలన అంగవికలుడవుతాడు. వ్యాధి కారణంగా 1918 ఏప్రిల్ 28 న మరణించాడు.
మూలాలు
మార్చు- ↑ Fabijancic, Tony (2010). Bosnia: In the footsteps of Gavrilo Princip. University of Atlanta Press. ISBN 978-0-88864-519-7.