గస్ ఆట్కిన్‌సన్

అంగస్ అలెగ్జాండర్ పాట్రిక్ అట్కిన్సన్ (జననం 19 జనవరి 1998) ఒక ఇంగ్లీష్ క్రికెట్ ఆటగాడు . [1]

గస్ అట్కిన్సన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఆంగస్ అలెగ్జాండర్ పాట్రిక్ అట్కిన్సన్
పుట్టిన తేదీ (1998-01-19) 1998 జనవరి 19 (వయసు 26)
చెల్సీ, లండన్, ఇంగ్లాండ్
ఎత్తు6 ft 2 in (1.88 m)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్
పాత్రబౌలరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి T20I (క్యాప్ 101)2023 సెప్టెంబరు 1 - న్యూజీలాండ్ తో
చివరి T20I2023 సెప్టెంబరు 3 - న్యూజీలాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2020–presentసర్రే (స్క్వాడ్ నం. 37)
2021Southern Brave
2023–presentOval Invincibles
కెరీర్ గణాంకాలు
పోటీ టి20 ఫక్లా లిఎ T20
మ్యాచ్‌లు 1 14 2 44
చేసిన పరుగులు 394 15 74
బ్యాటింగు సగటు 28.14 15.00 8.22
100లు/50లు –/– 0/3 0/0 0/0
అత్యుత్తమ స్కోరు 91 15 14
వేసిన బంతులు 17 2,035 96 796
వికెట్లు 4 45 5 60
బౌలింగు సగటు 5.00 26.64 22.60 19.21
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 1 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 4/20 6/68 4/43 4/20
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 2/– 1/– 15/–
మూలం: Cricinfo, 2 September 2023

దేశీయ కెరీర్ మార్చు

అతను 2020 బాబ్ విల్లీస్ ట్రోఫీలో సర్రే తరపున 2020 ఆగస్టు 8 న ఫస్ట్-క్లాస్ రంగప్రవేశం చేశాడు.[2] 2020 t20 బ్లాస్ట్‌లో సర్రే తరపున 2020 ఆగస్టు 28 న తన తొలి ట్వంటీ20 ఆడాడు. [3] 2021 రాయల్ లండన్ వన్-డే కప్‌లో సర్రే తరపున 2021 జూలై 22 న తన లిస్ట్ A రంగప్రవేశం చేశాడు. [4]

2022 ఏప్రిల్‌లో, ది హండ్రెడ్ 2022 సీజన్ కోసం అతన్ని ఓవల్ ఇన్విన్సిబుల్స్ కొనుగోలు చేసింది. 2022 కౌంటీ ఛాంపియన్‌షిప్ గెలిచిన సర్రే జట్టులో అట్కిన్సన్ భాగం. ది హండ్రెడ్ [5] 2023 సీజన్ కొరకు అతన్ని ఓవల్ ఇన్విన్సిబుల్స్ మళ్ళీ తీసుకుంది.

అంతర్జాతీయ కెరీర్ మార్చు

న్యూజిలాండ్‌తో జరిగిన వన్‌డే, T20I సిరీస్‌ల కోసం 2023 ఆగస్టు 16 న అట్కిన్సన్ సీనియర్ ఇంగ్లండ్‌ కట్టుకు పిలుపునందుకున్నాడు.[6] అతను T20I రంగప్రవేశం 2023 సెప్టెంబరు 1 న న్యూజిలాండ్‌తో నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండవ T20Iలో చేసాడు. ఆ మ్యాచ్‌లో 4/20 సాధించి, ఇంగ్లండ్ బౌలర్లలో తొలి T20I మ్యాచ్‌లో అత్యుత్తమ గణాంకాల రికార్డు నెలకొల్పాడు.[7]

మూలాలు మార్చు

  1. "Gus Atkinson". ESPN Cricinfo. Retrieved 8 August 2020.
  2. "South Group, Chelmsford, Aug 8-11 2020, Bob Willis Trophy". ESPN Cricinfo. Retrieved 8 August 2020.
  3. "South Group, Hove, Aug 28 2020, Vitality Blast". ESPN Cricinfo. Retrieved 28 August 2020.
  4. "Scarborough, Jul 22 2021, Royal London One-Day Cup". ESPN Cricinfo. Retrieved 22 July 2021.
  5. "Oval Invincibles 2023 Squad". The Hundred. Retrieved 18 July 2022.
  6. "First England call up for Atkinson". Surrey County Cricket Club. Retrieved 16 August 2023.
  7. "Atkinson four-for condemns New Zealand after Bairstow, Brook tee off". ESPN Cricinfo.