గాజు (ఆభరణం)

(గాజులు నుండి దారిమార్పు చెందింది)

గాజులు (ఆంగ్లం Bangles) ముఖ్యంగా స్త్రీలు చేతికి ధరించే ఆభరణాలు. ఇవి గాజుతో గాని, ప్లాస్టిక్, లక్క లేదా, బంగారంతో గాని తయారుచేస్తారు.

ఒక దుకాణంలో అమ్మకానికి ఉన్న గాజులు

హిందూ సాంప్రదాయంలో గాజులు ధరించడం అయిదోతనానికి గుర్తు. భారతదేశము, ఆంధ్రదేశము హస్తకళలకు, చేతి వృత్తులకు ఒకప్పుడు కాణాచి. బ్రీటిషుపలనకు పూర్వము ఆంధ్ర గడ్డలో చేతి వృత్తులకు ఆపూర్వ ఆదరణ లభించింది. అగ్గిపెట్టెలో యిమిడె పట్టుచేరను నేసిన ఘనత మన తెలుగు నేతగాళ్ళది. అలాగే శిల్పకళ, చిత్రకళ, కుమ్మరి, కమ్మరి వృత్తులు కాడా ఆదరణ చెందాయి. బ్రీటిశు పాలనలో క్రమముగా పై వృత్తుల కళల ప్రాభాల్యం క్రమముగా సన్నగిల్లి అడుగంటిపోయాయి. నేడు నేతన్నలు అప్పుల ఊబిలో కారుకుపొయ్యి అత్మహత్యలు చేసుకుంటిన్నారు.

హిందూ సంస్కృతి

మార్చు

అతి పూరాతనమైన చేతికళల పరిశ్రమలలో చేతిగాజుల పరిశ్రమ ఇకటి. మహిళలకు అత్యంత ప్రీతిపాత్రమైనవి మట్టిగాజులు. చేతికి గాజులులేని స్త్రీలను వుహించలేము. స్త్రీలచేతులకు గాజులు వుండటం గౌరవ సూచకము.స్త్రీలు ఆభరణాలపై,పట్టుచేరెల పై ఎంత మక్కువ చూపెదరో, గాజులపై అంతే మక్కువ చూపిస్తారు. గాజులను మహిళలు ధరించడం సనాతన భారతీయ సంప్రదాయములో ఒకభాగము. ముతైదువకు వుండే ఐదు లక్షణాలలో గాజులు ఒకటి. గాజుల తయారి,అమ్మకం పై ఆధారపడి నేటికి కొన్ని లక్షల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి.ఎక్కడ తిరునాల, లేదా జాతర జరిగిన మనకు తప్పని సరిగా కన్పించేవి గాజులమ్మేదుఖాణాలు. గ్రామ ప్రాంతాలలోని వారపు సంతలలో కాడా గాజులమ్మేవారు కన్పిస్తారు. పూర్వకాలములో ప్రత్యేకముగా ఒక కులము (గాజుల బలిజ) వారు ఈ గాజులమ్మే వృత్తిలో వుండేవారు. గాజుల వుత్పత్తిదారులనుండి గాజులను టోకులో కొనుగోలున తెచ్చుకుని వూరూర తిరుగుచు, ఇంటింటికి తిరిగి గాజులమ్మేవారు. పూర్వకాలములో ఇంటిలో పెళ్ళి జరిగిన, శ్రీమంతము జరిగిన, లేదా ఏ శుభకార్యము జరిగిన గాజులోళ్ళను ఇంటికి పిలిపించుకుని, ఇంటిళ్ళిపాది ఆడవాళ్ళు గాజులు వేయించుకుని, వారికి నమస్కరించి, తగిన విధముగా సంభావన యిచ్చి పంపేవారు.ఏదైన కార్యము మీద బయటకు వెళ్ళునప్పుడు గాజులమ్మేవారు కాని, మట్టిగాజులు ధరించిన స్ర్తీ ఎదురుగా వచ్చిన శుభకరమని, వెళ్ళె కార్యాము జయప్రథముగా జరుగుతుందని భావిస్తారు. ఆధునీక కాలములో వచ్చిన పెను మార్పుల కారణముగా వూరూర తిరిగి గాజులమ్మే వారు కనుమరిగైపోయారు. కాని గాజుల వాడకం మారలేదు, తగ్గలేదు. అధునాతనంగా, పారిశ్రామికంగా దేశము మారినను, ఇప్పటికి గాజుల పరిశ్రమ హస్తకళ/చేతి వృత్తుల పరిశ్రమగా కొనసాగుతు, కొన్ని లక్షల మధ్య తరగతి కుటుంబ ఆడవారికి జీవనోపాది కల్పిస్తున్నది. వేదకాలం నాటి కన్న ముందే స్ర్తీలు గాజులు ధరించే వారని లభించిన ఆధారలను బట్టి తెలుస్తున్నది. మహోంజొదార త్రవ్వకాలలో లభించిన చిత్రాలలో చేతికి కంకణంధరించిన స్త్రీ చిత్రాలున్నాయి. యక్షిణి చిత్రాలలోని కూడా యక్షిణి చేతికి కంకణం ధరించింది. బాణబట్టు తన కావ్యములో సరస్వతిదేవి చేతికి గాజులు (కంగణ్‌) ధరించినట్లుగా పెర్కొన్నాడు.పురాతన తవ్వకాలలో తక్షశిల వద్ద, మౌర్య సామ్రాజ్యకాలం నాటి రాగి గాజులు లభించాయి. అజంతా చిత్రాలలోని, ఎల్లోరా శిల్పాలలోని స్త్రీలు గాజులు (కంగణ్‌) ధరించడం కన్పిస్తున్నది. B.C.230-100 నాటికే సిందులోయలో గాజులు ధరించెవారని తెలుస్తున్నది. జానపదపాటలలో,కావ్యాలలో,సాహిత్యములో గాజుల ప్రస్తవన విస్రుతముగా కన్పిస్తున్నది.సిక్కులు తమ మతాచారంలో లోహంతో చేసిన గాజును ధరించెదరు.దానిని 'కడ' (kada) అంటారు.చేతికి ధరించే ఈ కంకణములను ఎక్కువగా గాజు (Glass) తో చెయ్యడం వలన "గాజులు" అనే పేరు తెలుగులో రూడి అయ్యింది. గాజులనే కరకంకణములని కూడా అంటారు. గాజులను సంస్కృరములో 'కంకణ్‌' అనియు, హిందిలో 'చిడియ', 'చుడ' అని అంటారు. పంజాబులో వధువులు పెళ్ళికి 21 రోజుల ముందు నుండి కాని, లేదా పెళ్ళి తరువాత సంవత్సరం వరకు ఏనుగు దంతము (ivory) తో చేసిన గాజులని ధరించదం సంప్రదాయం. ఉత్తర ప్రదేశ్‌లో పెళ్ళికూతురు ఏర్రచీర, ఏర్రగాజులు ధరించడం శుభదాయకంగా తలంచెదరు. మహారాస్ట్రలో, కర్నాటకలో, ఆంధ్రలో పెళ్ళికూతురు పచ్చగాజులు ధరించడం ఆనవాయితీ. పచ్చరంగు శుభానికి పతీకగా భావిస్తారు.

 
Kumbh Mela - Bangles

అలాగే పూర్వకాలంలో రాజస్తాన్‌ వివాహిత స్త్రీలు భర్త వున్నంత కాలము మణికట్తు నుంచి,ముంచెయ్యివరకు ఏనుగు దంతముతో చేసిన గాజులు ధరించేవారు.అలాధరించడం వలన తన కుటుంబానికి, భర్తకు, సంతానానికి శుభం కలుగుతుందని నమ్మకము, విశ్వాసం.పశ్చిమ బెంగాల్‌లో చిన్న గవ్వలు లేదా ఎర్ర పగడాలతో చేసిన గాజులను చేతులకు వేసుకొనడం పెళ్లయిన ఆడవారికి ఆచారంగా ఉంది. నేటికి ఆదివాసి, గిరిజన స్త్రీలు చేతులకు నిండుగా, ముంజేతి వరకు తెల్లటి, వెడల్పాటి చెక్కతో లేదా వెదురుతో చేసిన గాజులు ధరించడం గమనించవచ్చును.స్త్రీ దేవరామూర్తులకు ఎర్రగాజులను భక్తులు కానుకగా,మూడుపులుగా సమర్పించెదరు. కలకత్తలో కాళి దేవతకు ఎర్రగాజులను భక్తులు సమర్పించుకుంటారు. మిగాతా ప్రాంతాలలో నల్లటి గాజులను సమర్పించుకుంటారు. దక్షిణ భారతదేశములో స్త్రీ గర్భవతిగా వున్నప్పుడు, పుట్టింటి వారు 'శ్రీమంతము'లో ఒకచేతికి 21 గాజులు, మరోచేతికి 22 గాజులు తొడుగుతారు.గాజుతో చేసె గాజుల పరిశ్రమను మొగలుల కాలములో బాగా ప్రోత్యాయించారు. ముఖ్యముగా ఫెరొజాబాద్‌లో గాజుల పరిశ్రమ అభివృద్ధి చెందుటకు కారణము మొగలు సుల్తానులు యిచ్చిన ప్రోత్యాహమే కారణము.

గాజుల తయారీ

మార్చు

గాజులను చెయ్యుటకు, మాములుగా యితర గాజు (glass) వస్తువులను తయారు చేసె ముడి గాజునే ఉపయోగిస్తారు. 'ఫర్నెస్'లో ముడి గాజును బాగా కరగు వరకు వేడిచేసి అందులో ఒక గొట్టం (pipe)ను ముంచి బయటకు తియ్యుదురు.గొట్టం చుట్టు కరగిన గాజు స్తూపాకరం (cylinderical) గా ఏర్పడును. ఇలా ఏర్పడిన స్తూపాకారవలయ గాజును గోట్టం మీద వుండగానే, గాజు గట్టిపడకముందే నెమ్మదిగా కొట్తి సమఆకారంగా,సమ మందంగా, వుండేటట్లు చేస్తారు. యిప్పుడు మరో ఫర్నెస్లో యాంత్రికంగా, నెమ్మదిగా తిరుగుచున్న రోలరుకూ పై భాగములో,గోట్టముపై వున్న గాజును వేడి చేసి, రోలరుయొక్క పై భాగానికి తాటించెదరు.యిప్పుడు, గొట్టం మీది గాజు రోలరు మీద సన్నని దారాలవలే వలయాలుగా (circular rings) ఏర్పడును. చూడటనికి ఈ స్దితిలో 'స్ప్రింగ్'వలే వుండును. ఈ వలయాని నిలువుగా' డైమండ్ కట్టరు'ద్వారా కట్ చేస్తారు. యిలా కట్ చెయ్యడం వలన రెండు చివరులున్న రింగులుగా ఏర్పడును.

1. జుదాయి

మార్చు

'జుదాయి'లేదా 'జుడాయి' విభాగములో విడిగా వున్నరింగులను దగ్గరిగా చేర్చిరింగుగా చెయ్యడం జరుగును.దీనిని "జోడించడం'లేదా 'జుదాయి' అంటారు. కిరొసిన్ ద్వారా గాలిని వేడిచేసి, వేడిగాలి సన్నని గొట్టం వంటి నాజిల్ద్వారా వచ్చేటప్పుడు గాజు రింగుల రెండు విడి చివరలను వేడి గాలి ద్వారా,లేదా సన్నని మంట ద్వారా, రెండు చివరలు దగ్గరిగా చేర్చి అతికించెదరు. ఏక్కువగా ఈ పనిని ఆడ కార్మికులు చెయ్యుదురు.

2. సాదై

మార్చు

ఈ విభాగంలో అంచులను దగ్గరిగా చేర్చీఅతికించిన గాజుల జాయింట్లను మరియొకసారి వేడిచేసి, ఏమైన తేడాలుంటే సరిచేసి, గాజు అనీ వైపులనుండి సమానంగా కన్పించేలా చెయ్యుదురు. ఈ పనికూడా ఎక్కువగా మహిళ కార్మికులే చెయ్యుదురు.

3. డెకరెషన్

మార్చు

ఈ విభాగంలో గాజులకు నగీషీలు చెక్కి,అవసరమఒతే 'జరీ' అద్ది కావలసిన రంగులను అద్దకము చెయ్యబడును. ఈ విభాగంలో కాస్త ఎక్కువ నైపుణ్యమ్ కలిగిన కార్మికులను నియమించెదరు.

రకాలు

మార్చు
 
హైదరాబాదు లాడ్ బజారులో ఒక గాజుల దుకాణం