లక్క (shellac or lac) ఒక రకమైన జుగురు పదార్థం. భారతదేశపు లక్క కీటకాన్ని లాక్సిఫెర్ లక్కా లేదా టకార్డియా లక్కా అంటారు. ఉష్ణ మండల దేశాల్లోని అడవుల్లో లక్క కీటకం ఎక్కువగా జీవుస్తుంది. ఈ కీటకానికి ముఖ భాగం పెద్దదిగా వుండి దాంతో చెట్టు కొమ్మలను గుచ్చి రసం పీల్చు కునెందుకు వీలుగా ముఖ భాగాలుంటాయి. ఈ కీటకాలు మర్రి, తుమ్మ, రేగు చెట్లమీద ఉంటాయి. ఇవి లైంగిక ద్విరూపకతను ప్రదర్శిస్తాయి.

లక్క పుట్తుపూర్వోత్తరాలు

మార్చు

లక్కకు పుట్టిల్లు భారతభూమి. లక్కను మహాభారతంలో చెప్పబడిన, పాండవులు వసించుటకై కౌరవులు నిర్మించిన లాక్షా గృహము ను బట్టి లక్కయొక్క పురాతనత మనకు తెలుస్తుంది. సంస్కృత శబ్దమైన లక్ష నుండి ఉత్పత్తి అయింది లక్క అనే పదం. లక్షలకొలదీ లక్క పురుగులచే స్వేదించబడిన మూలమునకో లేక, అధర్వణ వేదం లో, లక్కను పండించు మోదుగ చెట్టు లక్షతరువు గా నెన్నబడిన కారణం చేతనో లక్కయను పదం వాడుకలోనికి వచ్చింది. సా.శ. 10 వ శతాబ్దములో రచింపబడిన పెరిప్లస్ (Periplus) అనే గ్రంథంలో, హిందూదేశమునుండి లక్కరంగు ఎర్రసముద్ర తీరమందలి ఆఫ్రికాఖండములోని ఆదులి (Aduli) కి గొంపోబడినదని వ్రాయబదియున్నది. సా.శ. 150లో ఏరియను (Aerian) అను చరిత్రకారుడు తన గ్రంథములో, భారతదేశములో ఒక విధమైన పురుగు రంగు పదార్ధమునిచ్చునని వరాసియున్నాడు. 1563లో గ్రేసియా డి ఆర్టా (Gracia De Arta) అను వైద్యుడు లక్కయొక్క జిగురు గురుంచి వ్రాసియున్నాడు. అటుపై 1590లో వెలువడిన అం న్-ఇ-అక్బరీ (Ain-I-Akbari) అను గ్రంథములో లక్క జిగురుతో రంగు మొదలైన తదితర పదార్ధములను చేర్చి వార్నిషు చేయబడిన వెదురు చాపలు ప్రభుత్వపు కచేరీలలోనూ, మహాళ్ళలోనూ వాడుకలో ఉన్నట్లు యున్నది.

లక్క పంట

మార్చు

లక్కను కొన్ని దేశాలలో పంటగా పండిస్తున్నారు. లాక్సిఫెర్ లక్క అనె చిన్న కీటకాలు సహజమైన జిగురు పదార్థమే లక్క. ఈ కీటకాలు లార్వా దశలో వున్నప్పుడు కొన్ని రకాల చెట్ల కాండాలమీదకు చేరి వాటి రసాన్ని ఆహారంగా పీల్చి ఆతర్వాత జిగురు లాంటి పదార్తాన్ని విసర్జిస్తుంటాయి. ఈ పురుగు జీవిత కాలం ఆరు నెలలు మాత్రమే. ఒక చెట్టు నుండి ఏడాదికి రెండు లక్క పంటలను పండించ వచ్చు. ముందుగా ఆడ కీటకాలను చెట్ల మీదకు చేరుస్తారు. ఒక్కో పురుగు సుమారు వంద గ్రుడ్ల వరకు పెడుతుంది. సూర్య రస్మికి ఈ గ్రుడ్లు పొదగ బడి లార్వాలుగా మారి తల్లి నుండి వేరు పడి పాక్కుంటు చెట్ల కాండాలను చేరుకుంటాయి. ఈ లార్వాలలో ఆడ మగ కూడా వుంటాయి. ఇవి తమ పొడవాడి నోటి ద్వారా చెట్ల కాండం నుండి రసాన్ని పీల్చి తింటాయి. ఆ సమయంలో అవి తమ శత్రువుల నుండి రక్షణ కొరకు ఒక రకమైన జిగురు పదార్థాన్ని విసర్జిస్తాయి. ఆ జిగురును తమ శరీరం చుట్టు కవచంగా ఏర్పరచుకొని శత్రువులనుండి రక్షణ పొందుతాయి. సుమారు ఎనిమిది వారాలకు ఈ లార్వాలు కీటకాలుగా మారుతాయి. కాని మగ పురుగులు మాత్రమే పూర్తి కీటకంగా రూపాంతరం చెందు తుంది. కాళ్లు రెక్కలు వచ్చిన మగ పురుగులు ఆడ పురుగుల వద్దకు వెళ్లి జత కడతాయి. కాని వెంటనే చనిపోతాయి. ఆడ పురుగులకు కదలలేవు. వాటి నోటి బాగాలు మాత్రం అభివృద్ధి చెందినా కాళ్లు, రెక్కలు రావు. ఈ ఆడ కీటకాలు ఆ కవచంలోనె గ్రుడ్లు పెట్టి అవి పొదగబడిన తర్వాత అందులోనె మరణిస్తుంది. ఇలా ఈ కీటకాల పై కవచంలాగ ఏర్పడి గట్టిపడిన జిగురు పదార్తమే లక్క. దీన్ని చెట్ల కొమ్మల నుండి సేకరించి దానిలో ఇరుక్కున్న కీటకాల భాగాలను, చెట్టుకొమ్మ బాగాలను వేరు చేసి శుభ్ర పరిచి కరిగించి బిళ్లల రూపంలోనో, లేదా కడ్డీల రూపంలో చేసి అమ్ముకుంటారు తయారి దారులు.

లక్కను ఎక్కడ పండిస్తారు లక్క పంటను ఎక్కువగా తాయిలాండు, చైనా, భారత దేశంలో ఎక్కువగా పండిస్తున్నారు. భారత దేశంలో ఈ పంటను జార్ఖండులో ఎక్కువగా పండిస్తున్నారు. తరువాతి స్థానంలో మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఒడిషా రాష్ట్రాలలో కూడా పండిస్తున్నారు.

లక్క ఉపయోగాలు. లక్క వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. దీన్ని పైంట్లలోను, వారీషులలోను, అద్దకం రంగుల్లోను, రబ్బరు ఉత్పత్తులలోను, పాలీష్ చేసె అన్ని వస్తువులలోను లక్క వాడు తున్నారు. అంతేగాక లక్క బొమ్మలు, లక్క గాజులు, కూడా తయారు చేస్తారు. బంగారు ఆబరణాలలో లక్క ఉపయోగం చాల ఉంది. అంతే గాక ఏదేని వస్తువును ప్యాక్ చేచి భద్రత కొరకు దాన్ని "సీల్'' చేస్తారు. అది లక్కతోనె చేస్తారు. ఆ సీల్ మీద ఆయా కంపెనీల, వ్యక్తుల ముద్ర వుంటుంది. పూర్వ కాలం రాజులు తమ ఉంగరం ముద్రను ఈ లక్కపై వేసే వారని తెలుసు. అదే విదంగా మహా భారతంలో కౌరవులు పాండవుల కొరకు లక్క ఇంటిని నిర్మించి ఇచ్చి వారిని దహించ డానికి దానికి నిప్పు పెట్టిన సంఘటన అందరికి తెలిసిందె. ఈ లక్క చాల సులభంగా మండి పోతుంది.

అధర్వణ వేదంలో లక్క-లాక్షపరిశ్రమ

మార్చు

లక్షాక్రిమిని ఉద్దేశించి అధర్వణ వేదము న పంచమకాండములో ఇదవ సూక్తము ఉంది. ఈ క్రిమిని యువతిగా భావించి అతిసుందరమైన భావగీతమున శాస్త్రవిషయములను ఇచ్చియున్నారు.ఈ సూక్తమును సాయనాచార్యులు వ్యాఖ్యానించలేదు.

రాత్రీమాతానభః పితార్యమా తేపితామహః
సిలాచీ నామవా అసి సా దేవా నామసిస్వపాః

ఈ లక్క పురుగును సిలాచీ అని పిలుచుచున్నారు.ఈ సిలాచీకి తల్లి రాత్రి, మేఘము తండ్రి, సౌమ్యప్రకాశము గల అర్యమణుడను సూర్యుడు తాత.మేఘాఛ్చాదితమైన రాత్రివేళగల శీతోష్ణ పరిమాణము, అనగా చలికాలమందలి పగటి వేడిమి మాత్రమే ఇది వృద్ధి పొందుటకు కావలసిన సహకారులు. ఇట్టి సిలాచీ దేవతల సహోదరి. లక్క అత్యంత అవసరమైన వస్తువు అగుటచే ఈ రీతిగా ప్రస్తుతించబడింది.

యస్త్వాపిబతి జీవతి త్రాయసే పురుషంతవం 
భర్త్రీహి శశ్వతామసి జనానాంచన్య ఇంచనీ.

లక్కతో చేయబడిన కషాయమౌషధమువంటిది అని సంప్రదాయము.ఈకషాయమును ఎవరు త్రాగుతారో అట్టి పురుషుని లక్క రక్షించుచున్నదట. కావుననే లక్కను పోషకురాలనీ "భర్త్రీ" శబ్దముతో పోల్చారు.కావుననే తల్లి శిశువును ఓడిలోనుంచుకొని లాలించునట్లుగా సర్వజనులకీ లక్క ఒడి (న్య ఇంచనీ) వంటిది. అనగా వారి బాధను నివారించునది. లక్క పురుగులలోని స్త్రీ కణములనుండి తీయబడిన ఎర్రని రసము రక్తమువలె నుండును.

యద్దండేన యదిష్వా యద్వారు ర్హరసాకృతం 
త్స్యత్వమసి నిష్కృతిఃసేమం నిష్కృధిపూరుషం.

ఈలక్క, దండచే గాని, బాణము గాని, అగ్నిచే గాని కావింపబడిన గాయమును మానుపునది.ఇట్టి గాయముకల పురుషుని కారోగ్యము చేకూర్చమని ప్రార్ధింపబడుచున్నది.

భద్రాత్ల్పక్షాని స్తిష్ఠ స్య శ్వత్థాత్ఖదిరాద్దవాత్
భద్రాన్న్యగ్రోధాత్పర్ణాత్సాన పహ్యరుంధతి.

లక్కకు దోహదమిచ్చు వృక్షములు 65 కలవని శాస్త్రజ్ఞలు నేడు చెప్పుచున్నారు. ప్లక్ష, అశ్వత్థ, ఖడివ, ధవ, న్యగ్రోధ, పర్ణ, వృక్షములు వీటిలో విశేషంగా శుభములని చెప్పుచున్నారు.లాక్షా రసమును తయారుచేయు సిలాచీ దేవతల సోదరిగా చెప్పునప్పుడు ఈ ముఖ్యవృక్షముల నేతదాశ్రయములనుగా చెప్పుట సముంజసము. లక్క పూతచే ఈ చెట్లు రక్షింపబడుచున్నవి. కాగా ఈవృక్షములు భద్రవంతములైనవి.లక్క పురుగు అరుంధతి; అనగా గాయములను నయముచేయునది.

హిరణ్యవర్ణే సుభగే సుర్యవర్ణే వపుష్టమే 
రుతం గఛ్హాసి నిష్కృతే నిష్కృతిర్నామ వా అసి.

యౌవనమునొందిన లాక్షాక్రిమి సూర్యవర్ణముతో నుండు గృహమున శుభప్రదయై, బంగారుచాయతో, అత్యంత్ అసౌందర్యవతియై ఒప్పుచున్నది. ద్రవరూపమున రోగార్తునకీయబడి, రక్తప్రసారమార్గమున పోవుచు గాయము వద్దకు జేరి సయము చేయవలెనని అర్ధింపబడుచున్నది.

హిరణ్యవర్ణే సుభగే శుష్మే లోమశవక్షణే
అపామసి స్వసాలాక్షే వాతో హాత్మాబభూవతే.

అగ్నివలె ప్రకాశించుచు బంగారుచాయతోనున్న లాక్షాక్రిమికి పైన, క్రిందిభాగమున నూగువలె వెంట్రుక లుండును. ఇందుచే "లోమశవక్షణా" నబడుచున్నది. లాక్షారసము ద్రవమగుటచేతను, నీటిలో కరుగుటచేతను ఇది జలముల సోదరియనిరి.వాయువు యొక్క వేగమునబడి ఈక్రిములు వృద్ధి పొందుటవలనను, వృక్షమునుంచి వృక్షమునకు ఇవి తీసుకొని పోబడుటవలనను, లాక్షాక్రిమి యొక్క ఆత్మయే వాయువని చెప్పబడింది.వాయువీ ఉపకారము చేయనిచో ఇవి నశించునవి.

సిలాచీ నామ కానినోజబభ్రాపితా తవ
అశ్వోయమస్యయః శ్వావస్తస్య హాస్నాస్యుక్షితాః.

లక్క పురుగులలో మగది అత్యంతము చిన్నది అగుటచే "కానీనః" అనినారు. దీనివలన లక్క మిక్కిలిగా ఉత్పతికాదు. కనుకనే ఈవాక్యమున నిరసనభావముతో ఉద్దిష్టమైనది. లక్కకు కావలసిన ఎర్రరంగు ఈమగ పురుగుచేరానేరాదు. మేకవంటి బభ్రువర్ణముగల ఈ మగ ప్రురుగుయొక్క కుమార్తయే సిలాచీ. యముని నల్లని అశ్వముయొక్క నెత్తురు ఈ ఆడపురుగుపై చల్లుటచే ఇది ఎర్రనై, ఎర్రని లక్కనిచ్చునట. యముని వాహనము మహిషము; కాని ఇచ్చట అశ్వవాహన మని ఇచట చెప్పబడింది.

అశ్వస్యాస్నః సంపతితా సావృక్షాం అభిసిష్యదే 
సరాపతత్రిణీ భూత్వాసాన పహ్యరుంధతి.

రక్తముచే ప్రోక్షంచబడిన లాక్షాక్రిమి నెత్తురు వంటి లాక్షారసముతో చెట్ల కొమ్మలను ప్రోక్షించుచున్నది. యముని వాహనమైన గుర్రముయొక్క నెత్తురునుంచి ఉత్పన్నమైనట్లు కనిపించు దిద్ యట! చెట్లపై తీగవలె ప్రాకుచూ, పక్షివలె పోవుచు చెట్లను లాక్షారసమయముగా చేస్తోంది. అట్టి పురుగు గాయములను మాంపునది కావున అరుంధతి. ప్రమాదకరమైన గాయముతో బాధనుందుచున్న మానవుని నయము చేయమని ప్రార్ధింపబడుచున్నది.

లక్కను, పాలను కలిపి కాగబెట్టి రోగార్తున కీయవలెనని కౌశికసూత్రము చెప్పుచున్నది. రక్తక్షీణము గలవారికీ రీతిగా రక్తమువంటి ద్రవము నిచ్చుటతో శక్త్యుత్సాహము చేకూరగలవని అభిప్రాయము.

జీవిత చక్రం

మార్చు

మగ లక్క కీటకం 1.2 - 1.5 మి.మీ. పొడవుంటుంది. ఇవి గాలిలో స్వేచ్ఛగా ఎగురుతూ మొక్కల స్రావాలమీద బతుకుతాయి. ఇవి మూడు జతల కాళ్ళను, ఒక జత పల్చని రెక్కలను, గుచ్చి పీల్చుకొనే ముఖ భాగాలను కలిగి ఉంటాయి. దీనిలో తల, వక్షం, ఉదరం, ఒక జత కండ్లు, ఒక జత స్పర్శ శృంగాలు కనిపిస్తాయి. ఇవి చాలా స్వల్పకాలం జీవించి, సంపర్కానంతరం చనిపోతాయి.

లక్కతో నిర్మించిన గదిలో ఆడ లక్క కీటకం నివసిస్తుంది. ఈ కీటకం అధో చర్మీయ గ్రంథులనుంచి లక్క అనే గుగ్గిలం వంటి పదార్థం ఉత్పత్తి అవుతుంది. ఈ లక్కా గృహ నివాసం వల్ల కీటకానికి శత్రువుల బారి నుంచి రక్షణ లభిస్తుంది. సంపర్కం జరిగాక ఆడ కీటకం వందల కొద్ది అండాలను గదిలో పెడుతుంది. అండాల నూచి సరూప శాబకాలు ఏర్పడతాయి. వీటికి రెక్కలు ఉండవు. ఇవి మొక్కలకు చెందిన రసాల మీద జీవిస్తాయి. ఒక్కొక్క సరూప శాబకం తన చర్మంలో ఉన్న గ్రంథుల నుంచి ఒక లక్క కవచాన్ని స్రవిస్తూ ఉంటుంది. ఇలా శాబకాలు తయారుచేసిన కవచాలన్నీ ఒక 'లక్కా గృహం'గా ఏర్పడుతుంది. దీనిలో సరూప శాబకాలు స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. వీటిలో కొన్ని మగ కీటకాలుగా పెరిగి ఎగిరి పోతాయి. మిగిలినవి ఆడ కీటకాలుగా మారి లోపలే ఉంటూ లక్కను స్రవిస్తూ కొత్త గృహాలను తయారు చేసి వాటిలో అండాలను పెట్టడం ఆరంబిస్తాయి. 6 నుంచి 8 వారాలు గడిచాక సరూప శాబకాలు మూడు సార్లు నిర్మోచనం జరుపుకొని రూప విక్రియ చెందుతాయి.

ఉపయోగాలు

మార్చు
  • లక్క కీటాకాలు ఉన్న కొమ్మలను విరిచి, వాటికున్న లక్కను గీకి తీస్తారు. ఈ విధంగా లభించిన ముడి లక్కను 'స్టిక్ లాక్' (Sticklac) అంటారు. ఈ ముడిలక్కను కరిగించి శుద్ధిచేసి బిళ్ళలుగాను, కడ్డీలుగాను అచ్చులు పోస్తారు. శుద్ధి చేసిన ఈ లక్కను 'షెల్లాక్' (Shellac) అంటారు.
  • Sealing Wax
  • Polish for furniture
  • బంగారు వెండి వస్తువులలో నింపుటకు (Filler) గా ఉపయోగపడుచున్నది.
"https://te.wikipedia.org/w/index.php?title=లక్క&oldid=3501004" నుండి వెలికితీశారు