గాడ్
గాడ్ 2023లో విడుదలైన తెలుగు సినిమా. తమిళంలో ‘ఇరైవన్’ పేరుతి విజయవంతమైన ఈ సినిమాను తెలుగులో 'గాడ్' పేరుతో ప్యాషన్ స్టూడియోస్ బ్యానర్‌పై సుధన్ సుందరం, జి. జయరాం, సీహెచ్ సతీష్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు ఐ. అహ్మద్ దర్శకత్వం వహించాడు. జయం రవి, నయనతార, రాహుల్ బోస్, ఆశిష్ విద్యార్థి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను అక్టోబరు 13న విడుదల చేశారు.[2][3]
గాడ్ | |
---|---|
దర్శకత్వం | ఐ. అహ్మద్ |
రచన | ఐ. అహ్మద్ |
నిర్మాత | సుధన్ సుందరం, జి. జయరాం, సీహెచ్ సతీష్ కుమార్ |
తారాగణం | |
ఛాయాగ్రహణం | హరి కె వేదాంతం |
కూర్పు | జె.వి.మణికంఠ బాలాజీ |
సంగీతం | యువన్ శంకర్ రాజా |
నిర్మాణ సంస్థ | ప్యాషన్ స్టూడియోస్ |
విడుదల తేదీ | 13 అక్టోబరు 2023 |
సినిమా నిడివి | 152 నిముషాలు [1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చుకథ
మార్చుసైకో కిల్లర్ బ్రహ్మ అలియాస్ గాడ్ (రాహుల్ బోస్) అతి కిరాతకంగా అమ్మాయిలను అపహరించి వాళ్ళను హత్య చేస్తుంతాడు. పోలీస్ అసిస్టెంట్ కమీషనర్ అర్జున్ (జయం రవి) బ్రహ్మను (రాహుల్ బోస్) పట్టుకునే బాధ్యతను చేపడతాడు. బ్రహ్మను అరెస్ట్ చేసే ప్రయత్నంలో అర్జున్ ప్రాణ స్నేహితుడు ఆండ్రూ (నరైన్) చనిపోతాడు. ఆ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అర్జున్ తప్పుకొని ఆండ్రూ కుటుంబానికి తాను అండగా నిలవాలని భావించి ఆండ్రూ చెల్లెలు ప్రియతో (నయతార) కలిసి కాఫీషాప్ ఓపెన్ చేస్తాడు. పోలీస్ కస్టడీలో ఉన్న కిల్లర్ బ్రహ్మ ఆసుపత్రి నుంచి తప్పించుకొని మళ్లీ వరుసగా అమ్మాయిలను కిడ్నాప్ చేసి హత్యలు చేస్తుంటాడు. ఈ క్రమంలో ప్లోలీసులు బ్రహ్మాని పట్టుకుని చంపేస్తారు. బ్రహ్మ చనిపోయినా సిటీలో అమ్మాయిలు హత్యలు ఆగవు. కొత్తగా జరిగే హత్యలకు కారకులు ఎవరు? వారిని అర్జున్ ఎలా పట్టుకున్నాడు ? తరువాత ఏమి జరిగింది అనేదే మిగతా సినిమా కథ.[5]
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: ప్యాషన్ స్టూడియోస్
- నిర్మాత: సుధన్ సుందరం, జి. జయరాం, సీహెచ్ సతీష్ కుమార్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఐ. అహ్మద్
- సంగీతం: యువన్ శంకర్ రాజా
- సినిమాటోగ్రఫీ: హరి కె వేదాంతం
- ఎడిటర్: జె.వి.మణికంఠ బాలాజీ
మూలాలు
మార్చు- ↑ "Iraivan". British Board of Film Classification (in ఇంగ్లీష్). Archived from the original on 30 September 2023. Retrieved 29 September 2023.
- ↑ Andhrajyothy (11 October 2023). "జయం రవి, నయనతారల క్రైమ్ థ్రిల్లర్ రెడీ టు రిలీజ్ | Nayanthara and Jayam Ravi Starring God Movie Ready to Release KBK". Archived from the original on 14 October 2023. Retrieved 14 October 2023.
- ↑ Eenadu (27 October 2023). "ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే చిత్రాలు/సిరీస్‌లివే". Archived from the original on 27 October 2023. Retrieved 27 October 2023.
- ↑ Andhrajyothy (12 October 2023). "నయనతార గాడ్". Archived from the original on 14 October 2023. Retrieved 14 October 2023.
- ↑ Eenadu (13 October 2023). "రివ్యూ: 'గాడ్'.. క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా?". Archived from the original on 14 October 2023. Retrieved 14 October 2023.