గానకళ

తెలుగు పత్రిక

గానకళ సంగీత కళకు అంకితమైన తెలుగులో వెలువడుతున్న ఏకైక పత్రిక. ఇది 1962 సంవత్సరంలో కాకినాడలో ప్రారంభమై నాలుగు దశాబ్దాలుగా నిరంతరాయంగా వెలువడుతున్నది. దీని వ్యవస్థాపకులు, సంపాదకులు మునుగంటి శ్రీరామమూర్తి.

గానకళ

రాష్ట్రంలో జరిగే సంగీత సభల గురించి, కళాకారులకు జరిగే సత్కారాల గురించి ఫొటోలతో వార్తలు ప్రచురిస్తారు. సంగీత శాస్త్రానికి సంబంధించిన విలువైన వ్యాసాలు ఈ పత్రికలో లభిస్తాయి.

వ్యవస్థాపకుల గురుపరంపర

మార్చు

గానకళ గురుపరంపర త్యాగరాజ స్వామి నుంచి ప్రారంభమైనది. ఆయన శిష్యుడు పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్. ఆయన శిష్యుడు కృష్ణయ్యర్ తమిళుడైనా ఉద్యోగరీత్యా కాకినాడ వచ్చారు. కాకినాడ వాస్తవ్యులైన మునుగంటి వెంకట శ్రీరాములు పంతులు కృష్ణయ్యర్ శిష్యులైనారు. శ్రీరాములు పంతులు సంగీతాభిమాని. ఆయన కాకినాడలో ఒక ఉచిత సంగీత పాఠశాలను 1894లో ప్రారంభించారు. దానికోసం కొంత స్థలం, ఒక భవనం ఇచ్చారు. శతాబ్ది కాలంగా ఆ పాఠశాల నడుస్తున్నది. వెంకట శ్రీరాములు పంతులు కుమారుడు మునుగంటి వెంకటరావు పంతులు సంగీత విద్వాంశులు. బాల మురళీకృష్ణ గురువు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు ఇతనికి "గాయక సామ్రాట్" బిరుదు ప్రదానం చేశారు. వెంకటరావు పంతులు కుమారుడు గానకళ సంపాదకులు శ్రీరామమూర్తి.

మూలాలు

మార్చు
  • ఆంధ్రజాతి అక్షర సంపద తెలుగు పత్రికలు, పొత్తూరి వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ, హైదరాబాదు, 2004.
"https://te.wikipedia.org/w/index.php?title=గానకళ&oldid=2989979" నుండి వెలికితీశారు