గాయకులు

(గాయని నుండి దారిమార్పు చెందింది)

శ్రోతల కోసం లేదా శ్రోతల ముందు గేయకావ్యాన్ని లయబద్ధంగా ఆలపించే వారిని గాయకులు అంటారు. గాయకులను ఇంగ్లీషులో singers అంటారు.

గాయకులు

గానం చేసే పురుషుడిని గాయకుడు అని, స్త్రీని గాయని అని అంటారు. గానం చేసే కొంత మంది గాయకులను గాన బృందం అంటారు.

గురువు

మార్చు

గానాన్ని అభ్యాసం చేయలనుకునే వ్యక్తి ఒక మంచి గురువును ఎంపిక చేసుకోవడంతో పాటు ఇతర గాయకులు ఇచ్చే మంచి సూక్తులను కూడా అవలంభించాలి.

తెలుగు నేపధ్య గాయకుడు, సంగీత దర్శకుడు అయిన శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు సంగీతాన్ని నేర్చుకోనప్పటికి గొప్ప గాయకుడిగా వాసి కెక్కినారు.

గాయకుల ఆహారం

మార్చు

గాయకులు పుదీనా రసం తాగితే కంఠస్వరం మృధువుగా మధురంగా తయారవుతుంది.

మసాల పదార్థాలు, కారం ఎక్కువున్న పదార్థాలు తక్కువగా తీసుకోవాలి. సమయానికి ఆహారం తీసుకోవాలి.

ధూమపానం, మద్యపానం వల్ల స్వరపేటిక దెబ్బతింటుంది అందువల్ల అవి మానివేయాలి.

శ్రావ్యమైన స్వరానికి నీళ్లు ఎక్కువ తాగాలి. ఫిల్టర్ చేసిన నీరు మాత్రమే తాగాలి. పోషకాలుండే ఆహార పదార్థాలు తీసుకోవాలి.

గాయకులు ఎక్కువ వేడిగా ఉన్న పదార్ధాలను, మరీ చల్లగా ఉన్న పదార్ధాలను తీసుకోకూడదు.

గాయకుల వ్యాయామం

మార్చు

గాయకులు ప్రతిరోజూ కొంత సమయాన్ని వ్యాయామం లేదా యోగాకు కేటాయించాలి.

కొంతమంది గాయకులు తెల్లవారుజామున చల్లని నీటిలో గొంతు వరకు మునిగి తమ గానాన్ని సాధన చేస్తారు.

పిచ్‌ రేంజ్‌

మార్చు

ప్రతి ఒక్కరూ తమ స్వరం పిచ్‌ రేంజ్‌ను తెలుసుకోవాలి. దీన్ని డైనమిక్‌ రేంజ్‌ అంటాం. ఇది తెలుసుకున్న తర్వాత ఈ రేంజ్‌కు మించి పాడటం, మాట్లాడడం చేయకూడదు.

పిచ్‌ రేంజ్‌ తెలుసుకుని పాటలు పాడడం వల్ల స్వరానికి సంబంధించిన సమస్యలు ఉత్పన్నం కావు. దీన్ని తెలుసుకోవడానికి 'వాయిస్‌ సాఫ్ట్‌వేర్‌' ఉపయోగపడుతుంది.

వాయిస్‌ మ్యుటేషన్లు

మార్చు

మగవాళ్లు ఆడపిల్లల గొంతుతో, ఆడవాళ్లు మగవారి గొంతుతో పాడడాన్ని వాయిస్‌ మ్యుటేషన్లు అంటారు.

వాతావరణం

మార్చు

గాయకులు మంచు పడే సమయంలో ఎక్కువగా తిరగరాదు.

బరువైన పనులు

మార్చు

గాయకులు బరువైన పనులు చేయరాదు. మరి ముఖ్యం గానం చేసే ముందు అసలు చేయరాదు.

ఇవి కూడా చూడండి

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=గాయకులు&oldid=3560497" నుండి వెలికితీశారు