ఇంద్రజాలం

(గారడీ విద్యలు నుండి దారిమార్పు చెందింది)

ఇంద్రజాలం ఒక విధమైన కళారూపం. భారతదేశం "ఇంద్రజాల భూమి" (Land of Magic) అని ప్రసిద్ధిచెందింది. ఇక్కడ వీధులలోను, వేదికల మీదా ఇంద్రజాల ప్రదర్శనలు జరుగుతాయి. ఇంద్రజాలం గురించి హిందూ పురాణాలైన వేదాలు, ఉపనిషత్తులలో ప్రస్తావించబడింది.

ఇంద్రజాలంలో భాగంగా చేసిన దృశ్యచిత్రం
ఇంద్రజాల వీడియో

ఇంద్రజాలం హిందువుల దేవరాజైన ఇంద్రుడు (Indra), జాలం (Net) అనే రెండు పదాల కలయిక వలన ఏర్పడింది. భారతీయ సాంప్రదాయ ఇంద్రజాలంలో భారతీయ తాడు, భారతీయ తట్ట, పచ్చ మామిడి మర్మం, కప్పులు, బంతి, ఎగిరే మనిషి, అలా కొన్ని పేరుపొందాయి

ప్రసిద్ధ ఇంద్రజాల విద్యలు

మార్చు

కొన్ని ముఖ్యమైన విద్యలు క్రింద ఇవ్వబడినవి.[1]

  • నీటి మీద నడవడం
  • తాళం వేసిన పెట్టెలోనుండి బయటకు రావడం
  • చేతులు కాళ్ళు తాడుతో కట్టించుకొని మూతి కట్టిన సంచిలో కూర్చొని నీటిలోకికి విసరివేయబడ్డ సంచిలోనుండి బయటకు రావడం
  • పావురాలు మాయం చేయడం
  • ఒకే రంగు గుడ్డ నుండి రకరకాల రంగుల గుడ్డలు తీయడం
  • మాయంచేసిన నాణెములను ప్రేక్షకుల జేబుల నుండి తీయడం

ఇండియన్ రోప్ ట్రిక్

మార్చు

ఓ వ్యక్తి నాదస్వరం ఊదుతూ ఉంటే చుట్టగా చుట్టిన తాడు పాములాగా పైపైకి లేస్తుంది. ఆ తరువాత ఆ వ్యక్తి దానిని పట్టుకుని పైకి ఎగబ్రాకుతాడు. ఈ విద్య గురించి నూటయాబై సంవత్సరాల క్రితం ఒక ఆంగ్లేయుడు భారత దేశంలో ఒక ఇంద్రజాల ప్రద్రర్శనను చూసి మెచ్చుకుని ఆనాడే పత్రికలలో వ్రాశాడట. ఆ ఇంద్రజాలంలో ఒకడు త్రాడు నొక దానిని పైకి నిలువుగా విసిరి గాలిలో నిలబెట్టి దాని పైకి ఎగబ్రాకి మాయమైనాడట. తరువాత అతని అంగాలన్నీ ఖండాలుగా క్రింద పడిపోయాననీ మరి కొంత సేపటికి యథా ప్రకారంగా వాడు త్రాటిమీద నుండి గబగబా దిగి వచ్చాడని వ్రాశాడు. ఇలాంటి కథనే "కొరివి గోపరాజు" సింహాసన ద్వాత్రింశికలో వివరించాడు.[2]

సుప్రసిద్ధ ఇంద్రజాలకులు

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. ఉషా, పద్మశ్రీ (1993).   మహేంద్రజాలం. జనప్రియ పబ్లికేషన్స్. వికీసోర్స్. 
  2. "  గమ్మత్తుల గారడీ విద్యలు".   తెలుగువారి జానపద కళారూపాలు. తెలుగు విశ్వవిద్యాలయం. వికీసోర్స్. 1992. 

ఉపయుక్త గ్రంథ సూచి

మార్చు
 
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు: