బి.వి.పట్టాభిరామ్

బి.వి.పట్టాభిరాం ప్రముఖ హిప్నాటిస్టు[తెలుగు పదము కావాలి], మెజీషియన్ మరియు రచయత. దూరదర్శన్లో మొదటి తెలుగు కార్యక్రమాలలో ఆయన మేజిక్ షోలు ఉండేవి. 1990లలో ఆంధ్రప్రభ సచిత్రవార పత్రికలో బాలలకు బంగారుబాట అనే శీర్షికలో అనేక మంది ప్రపంచ ప్రముఖుల జీవితచరిత్రలు గురించి వ్యాసాలు వ్రాసారు. బాలజ్యోతి అనే బాలల పత్రికలో "మాయావిజ్ఞానం" పేరిట వ్యాసాలు వ్రాసారు.

మానసిక శాస్త్రం, ఫిలాసఫీ గైడెన్స్ కౌన్సలింగ్ మరియు హిప్నోథెరపీలలో అమెరికానుండి పోస్ట్‌గ్రాడ్యుయేట్ పట్టా పుచ్చుకున్న పట్టాభిరాం ఒత్తిడి యాజమాన్యం, ఇంటర్ పర్సనల్ సంబంధాలు, అసర్టివ్ నెస్, సెల్ఫ్ హిప్నాటిజం మొదలైన అంశాలపై భారతదేశములోని అనేక ప్రాంతాలలో, అమెరికా, ఆస్ట్రేలియా, మలేషియా, థాయ్‌లాండ్, సింగపూర్ మరియు అరబ్ దేశాలలో అనేక వర్క్‌షాపులు నిర్వహించాడు.

హిప్నోసిస్ పై ఈయన చేసిన కృషికి గుర్తింపుగా 1983లో ఫ్లోరిడా విశ్వవిద్యాలయం ఈయనకు గౌరవ డాక్టరేటు ప్రధానం చేసింది. నాష్‌విల్ల్ మరియు న్యూ ఆర్లియన్స్ నగర మేయర్లు ఈయనకు గౌరవ పౌరసత్వంకూడా ప్రధానం చేశారు.

మూలములుసవరించు