గార్గి మొహంతి ఒడియా సినిమా, టెలివిజన్ నటి. ఆమె ఒడిస్సీ నర్తకి కూడా. రెండున్నరేళ్ల వయసు నుంచి ఒడిస్సీ నృత్యంలో ఆమె శిక్షణ పొందింది. [1] ఆమె మొదట ఒడియా ఆల్బమ్‌తో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. ఒడియా సినిమాలో ఆమె 2005లో అడుగుపెట్టింది. ఆమె నటించిన మొదటి చిత్రం హర్ పట్నాయక్ దర్శకత్వం వహించిన అర్జున్. ఒడియా దొరదర్శన్‌లో కూడా ఆమె పనిచేసింది. మొదట, ఆమె డిడి ఒడియా సీరియల్ కహెలే తో కుల్ కుటుంబకు లాజ్‌లో నటించింది.

గార్గి మొహంతి
జననం
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2005-ప్రస్తుతం
జీవిత భాగస్వామిరవీంద్ర నాథ్ పాధి
తల్లిదండ్రులుఅమిర్యా మొహంతి
పురస్కారాలుస్టేట్ ఫిల్మ్ అవార్డు

కెరీర్

మార్చు

గార్గీ మొహంతి చాలా చిన్న వయస్సు నుండి ఒడిస్సీ నృత్యం నేర్చుకుంది.[1] దీంతో, ఆమె ప్రతిభావంతురాలైన ఒడిస్సీ డ్యాన్సర్ గా గుర్తింపు తెచ్చుకుంది. దర్శకుడు హరీష్ మొహంతి భజన్ ఆల్బమ్ కోసం గార్గిని ఎన్నుకున్నాడు. దీని విజయంతో మరికొన్ని ఆల్బమ్‌లలో ఆమెను హరీష్ తీసుకున్నాడు. ఆమె డిడి ఒడియాలో ప్రసారమైన కహెలే తో కుల్ కుటుంబకు లాజ్‌ అనే సీరియల్‌లో తన నటనను ప్రారంభించింది. [1]

సిరీస్ ప్రీమియర్ ప్రదర్శించిన కొద్ది రోజులకే, దర్శకుడు హర్ పట్నాయక్ గార్గిని అర్జున్ చిత్రంలో అవకాశమిచ్చాడు.[2] ఈ చిత్రంలో గార్గి సహనటుడు పరిభ్ మొహంతి దీని తర్వాత, గార్గి మళ్లీ సీరియల్స్‌లో నటించడం ప్రారంభించింది. ఈటీవీ ఒడియాలో ప్రసారమైన గాయత్రి సీరియల్‌లో గార్గి నటించింది.[1]

తరువాత ఆమె తరంగ్ టీవీలో ప్రసారమైన తోపాయ్ సింధూర్ అనే ధారావాహికంలో కనిపించింది. ఆ తర్వాత ఆమె మళ్లీ క్వీన్ అనే ధారావాహికంలో అత్తగా నటించింది.[2] ఆమె మాటిర్ బంధన్ చిత్రంలో నటించింది, కానీ ఇది విడుదలకు నోచుకోలేదు.[1] హిందీ ఆల్బమ్ అయిన ఆంఖోన్ తుజ్ ఖో దేఖా లో కూడా గార్గి కనిపించింది.[1]

2012లో ఆమె నటించిన మరో చిత్రం హే సఖా విడుదలైంది.[3] [4] ఈ చిత్రం కృష్ణుడు, అతని స్నేహితుడు సుదామ చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రంలో గార్గి సుదాముని భార్య సుమతి పాత్రను పోషించింది.[5]

2016లో, ఆమె నటించిన కరంతిధార విడుదలైంది. ఈ చిత్రంలో గార్గితో పాటు సమ్రేష్ రౌతరాయ్, పుష్ప పాండా తదితరులు నటించారు. మహిళా సాధికారత ఈ సినిమా ప్రధాన సందేశం.[6] ఈ చిత్రంలో తన నటనకు గార్గి 26వ రాష్ట్ర ఒడియా ఫిల్మ్ అవార్డ్స్‌లో ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. 2016లో గార్గి స్పందన అనే డాక్యుమెంటరీ చిత్రంలో కూడా నటించింది.[7]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "Sapanara Pathe Pathe: Actress Gargi Mohanty". କନ‌କ ଟିଭି. 11 December 2011. Retrieved 10 March 2017.
  2. 2.0 2.1 "Gargi Mohanty- Odia Actress". E News ଓଡ଼ିଆ. 21 October 2016. Retrieved 10 March 2017.
  3. "ଶ୍ରୀକୃଷ୍ଣ ଏବଂ ସୁଦାମାଙ୍କ ଉପରେ ତିଆରି ହୋଇଛି ଓଡ଼ିଆ ଛବି, ପୌରାଣିକ ଆଉ ସାମାଜିକ ବି | Sambad". Sambad (in ଓଡ଼ିଆ). ଓଡ଼ିଶା. 2 September 2018. Archived from the original on 3 September 2018. Retrieved 2 September 2018.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  4. http://odishasuntimes.com/2015/01/13/odishas-veteran-actor-director-hara-patnaik-no/
  5. "Oriya Films 2012 – Oriya Movies 2012 Details Starcast". IncredibleOrissa. 13 January 2012. Retrieved 10 March 2017.
  6. "ଓଲିଉଡ଼୍ ଅଫ୍ ବିଟ୍". ପ୍ରମେୟ. 8 January 2017. Archived from the original on 7 March 2017. Retrieved 1 March 2017.
  7. "Kathare Kathare - Anu Chowdhury and Gargi Mohanty - Etv News Odia". E TV News Odia. 10 September 2016. Retrieved 10 March 2017.