గార్ల మండలం

తెలంగాణ, మహబూబాబాదు జిల్లా లోని మండలం

గార్ల మండలం, తెలంగాణ రాష్ట్రం, మహబూబాబాదు జిల్లాకు చెందిన మండలం.[1] 2016లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఖమ్మం జిల్లాలో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం మహబూబాబాదు రెవిన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది కొత్తగూడెం డివిజనులో ఉండేది. ఈ మండలంలో 11 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం. మండల కేంద్రం గార్ల.

గార్ల
—  మండలం  —
తెలంగాణ పటంలో మహబూబాబాదు జిల్లా, గార్ల స్థానాలు
తెలంగాణ పటంలో మహబూబాబాదు జిల్లా, గార్ల స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°30′35″N 80°09′34″E / 17.509832°N 80.159569°E / 17.509832; 80.159569
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబాబాదు జిల్లా
మండల కేంద్రం గార్ల
గ్రామాలు 10
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 131 km² (50.6 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 36,998
 - పురుషులు 18,122
 - స్త్రీలు 18,876
అక్షరాస్యత (2011)
 - మొత్తం 48.16%
 - పురుషులు 59.37%
 - స్త్రీలు 36.75%
పిన్‌కోడ్ 507210

మండల జనాభాసవరించు

 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త ఖమ్మం జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మొత్తం మండల  జనాభా 36,998, పురుషులు 18,122, స్త్రీలు 18,876

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 131 చ.కి.మీ. కాగా, జనాభా 36,998. జనాభాలో పురుషులు 18,122 కాగా, స్త్రీల సంఖ్య 18,876. మండలంలో 10,015 గృహాలున్నాయి.[3]

ఖమ్మం జిల్లా నుండి మహబూబాబాద్ జిల్లాకు మార్పుసవరించు

లోగడ గార్ల మండలం ఖమ్మం జిల్లా, కొత్తగూడెం రెవిన్యూ డివిజను పరిధిలో ఉంది. 2014లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవిన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా గార్ల మండలాన్ని వరంగల్ జిల్లా పరిధిలో కొత్తగా ఏర్పడిన మహబూబాబాద్ జిల్లా పరిధిలోకి ఈ (గార్ల) మండలాన్ని చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మండలం లోని గ్రామాలుసవరించు

రెవెన్యూ గ్రామాలుసవరించు

 1. ముల్కనూర్
 2. మద్ది వంచ
 3. చంద్రగిరి
 4. రాంపురం
 5. బుద్ధారం
 6. గార్ల
 7. సెరిపురం
 8. గోపాలపురం
 9. పోచారం
 10. పుల్లూరు

గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు.

దేవాలయాలుసవరించు

ఈ మండలంలోని పిణిరెడ్డిగూడెంలో కొలువుదీరిన కొండలమ్మ ఆలయం ఎంతో ప్రాచీనమైంది. కాకతీయ ప్రతాపరుద్రుని కాలంలో ఈ దేవాలయాన్ని నిర్మించారు. కాకతీయుల కళా వైభవానికి ఇది ప్రతీక. ఈ ఆలయంలో ఉగాదిని పురస్కరరించుకుని ఏటా నాలుగు రోజుల పాటు కొండలమ్మ జాతర నిర్వహిస్తారు. గారమ్మ, కొండలమ్మ, భయమ్మ ముగ్గురు అక్కా చెల్లెల్లు.[4] వారే పాముల రూపంలో ప్రత్యక్షమవుతుంటారని ఇక్కడి భక్తుల విశ్వాసం.[5]

మూలాలుసవరించు

 1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 235 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
 2. "మహబూబాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
 3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
 4. "భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు". EENADU. Retrieved 2022-04-03.
 5. "కొండలమ్మ జాతరలో పాముల దర్శనం.. ప్రతీ ఏడూ ఇలాగే." www.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2022-04-03. Retrieved 2022-04-03.

బయటి లింకులుసవరించు