గాలిపటములతో ఆడుకొనే ఆటను గాలిపటం ఆట అంటారు. గాలి పటముల ఆట ఆడువారు గాలిలో గాలిపటములను ఎగుర వేయుచూ ఒకరితో ఒకరు పోటీ పడుటను గాలిపటముల పోటీ అంటారు. గాలిపటాలను వినోదం కోసం పైకి ఎగుర వేస్తూ అవి కింద పడకుండా నియంత్రిస్తూ ఇతర గాలి పటాల నుంచి ఎదురయ్యే చిక్కుల నుంచి తమ గాలిపటాన్ని రక్షిస్తుంటారు. గాలి పటాల పోటీని ఒక పోటీగానే కాక ఒక పండుగగా జరుపుకుంటున్నారు. భారతదేశంలో గాలిపటాలు ఎగురవేయడానికి అనువుగా గాలి వీచే సంక్రాంతి పండుగ రోజున లేదా కొన్ని రోజుల పాటు గాలి పటాల పండుగను జరుపుకుంటారు.

ప్రిజం డిజైన్స్‌చే తయారు చేయబడిన రెండు డ్యూయల్ లైన్ స్పోర్ట్ కైట్‌లు ఫార్మేషన్‌లో ఎగురుతున్నాయి.
గాలిపటముల ఆటకు సిద్ధం చేసుకున్న త్రివర్ణ పతాకం రంగులలో ఉన్న పతంగులు
సంక్రాంతి రోజున గాలిపటాలు ఎగురవేస్తున్న పిల్లలు

గాలిపటాల పోటీలో పాల్గొనే వారికి గాలిపటముల పోటీ నిర్వాహకులు కొన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు విజేతలకు బహుమతులను అందించి ప్రోత్సహిస్తున్నారు.

విజేత ఎంపిక

మార్చు

గాలిపటం ఆకారంను బట్టి, రంగులను బట్టి, ఎగిరే ఎత్తును బట్టి, దూరాన్ని బట్టి, బరువులను బట్టి, పరిమాణాన్ని బట్టి, మోయగలిగిన బరువును బట్టి, గాలి పటానికి వాడిన సూత్రాన్ని బట్టి, ఒకే దారానికి కట్టిన గాలిపటముల సంఖ్యను బట్టి, గాలి పటానికి ఉపయోగించిన దారాన్ని బట్టి విజేతలను ఎంపిక చేస్తారు.

ఇవి కూడా చూడండి

మార్చు

బయటి లింకులు

మార్చు