మిర్జా అసదుల్లాఖాన్ గాలిబ్ గారి ఉర్దూ గజళ్లకు దాశరథి కృష్ణమాచార్య గారు చేసిన తెలుగు అనువాదం గాలిబ్ గీతాలు . ఒక విథంగా గాలిబ్‍ గారి గజల్‍ల మొట్టమొదటి తెలుగు అనువాద పుస్తకమిది.

పుస్తకముఖచిత్రం

పుస్తకప్రచురణ

మార్చు

దాసరథిగారూ గాలిబ్ గీతాలను తెలుగులో మొదటగా పుస్తకరూపంలో 1961లో అచ్చువేయించారు.1965లో రివైజుడు ఎడిసనును ముద్రించారు. తరువాత పలుముద్రణలు పొందినది. 2002లో ఎమెస్కో బుక్స్ ద్వారా పాఠకులకందించారు. అట్టమీది, లోపలి చిత్రాలను బాపుగారు చిత్రించారు. ముందుమాట (preface)ను అప్పటి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి అధ్యక్షుడు శ్రీ బెజవాడ గోపాలరెడ్ది గారు ఆంగ్లంలో వ్రాసారు. పీఠికను డా. బూర్గుల రామకృష్ణరావు తెలుగులో వ్రాసారు. అవతారికను శ్రీ దేవులపల్లి రామానుజరావు (కార్యదర్శి,ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి) వ్రాశారు.'గాలిబ్ గీతాలు' కవితాపుస్తకాన్ని దాశరథిగారు ప్రఖ్యాత చలనచిత్రనటుడు డా. అక్కినేని నాగేశ్వరరావు గారికి అంకితమిచ్చారు. గాలిబ్ గారి గజల్స్ లోని మేలిముత్యములవంటి వాటిని ఏరి 407 తెలుగు పద్యంలలో రాసాడు. అంతేకాదు కొన్నిపద్యాలకు కవితావివరణ కూడా యిచ్చాడు.

గాలిబ్ గజల్లు-దాశరథి అనువాద పటిమ

మార్చు

ఉర్దూభాషలో 'గజల్' సుప్రసిద్ధమైనది. ఉర్దూకవులలొ అనేకులు ఈపద్ధతినే అనుసరించారు. గాలిబ్ గజల్ రీతిలోనే కాకుండగా ఇతరపద్ధతులలో కూడా కవిత్వం రాసినప్పటికి, గజల్స్లో కబ్బం అల్లుటలో ప్రసిద్ధి చెందాడు. ఇతరులకు మార్గదర్సకుడుగా నిల్చినాడు. గాలిబ్ మానవజీవితమును సమగ్రముగా తన కావ్యదర్పణంన ప్రతిఫలింపజేసాడు. జీవితంను దాని భిన్నకోణములను రమ్యంగా, హృద్యంగా రచించిన మొదటి ఉర్దూకవిగా గాలిబ్ కవి అనవచ్చును. జీవితం, అందులోని విలాసం, విషాదం, తీపిదనం, చేదు, ఒడుదుడుకులను తన కవిత్వంలో ప్రదర్సించాడు గాలిబ్. అట్టి గాలిబ్ ఉర్దూ గజల్స్ ను దాశరథి మిక్కిలి ప్రతిభావంతంగా తెలుగుభాషలోకి అనువదించాడు. అనువాదం చాలా సుభోదకంగా, సరళంగా వున్నది. గాలిబ్ కవనంలోని హైందవేతర వాతావరణంను హైందవ వాతావరణంగా పరివర్తించి, కవితకు తెలుగుదనం అబ్బి, తన ప్రత్యేకత ప్రతిభను చూపించాడు దాశరథి.దాశరథి గాలిబ్ గజల్స్ ను హృదయాంతర్గతంకావించుకొని, అనన్యమైన రీతిలో తెలుగీకరించినాడు. ఉర్దూమూలం నకు సన్నిహతంగా వుండులా అనువాదమొనర్చినాడు. కడురమ్యంగా, రమణీయయుతంగా కొనసాగినదు రచన. గాలిబ్ గజల్లను ఒక్కొక్కదానిని తీసికొని ఆమూలాగ్రంగా దాశరథి అనువాదమొనర్చలేదు. గజల్స్ లోని కొన్నీ'షేర్' లనే అనువాదమొనర్చినాడు. గలిబ్ యొక్క గజల్స్ లోని ఉత్తమ విభాగాలను అనువాదానికి ఎన్నుకకొనుటలో దాశరథి కవితాహృదయం, ఆయన ప్రతిభ తెలుయుచున్నది. దాశరథి అనువాదమొనర్చిన ఈ ఖండకృతులలో గాలిబ్ కవిప్రేమార్ధ్ర హృదయం కంపించుచున్నది. గాలిబ్ ప్రియురాలు నొకమారు ప్రసన్నవదని, మరోమారు పరాణ్ముకురాలు. చంచలమనష్కిని, గాలిబొక్కడే ఆమె ఏకైక ప్రియుడు కాడు. ఆమె మనస్సు చూరగొన్న వారున్నారు. అయిన గాలిబ్ ఈర్ష్యకాని, కోపంకాని చెందలేదు. తన చెలియెడ అంతటి అనురాగమున్నది. నిజంగా గాలిబ్ జీవితం ఒకవిషాదగాథ. గాలిబ్ ప్రేమ స్వార్థరహితమైనది. గాలిబే స్వయంగా" నాకు నిష్కామ కర్మ యెంతయో ప్రియం"అని చెప్పుకున్నాడు.

ఉర్దూ గజలులు రెండుపద్యపాదంలను మాత్రమే కల్గివుండును. దాశరథిగారు కూడా క్లుప్తత చెడకుండా రెండుపాదాలలోని భావాన్ని చాలావరకు రెండుపాదాలలోనే వ్రాసాడు. వివరణ అవసరమైన చోట పద్యపాదాలను నాలుగుపాదాలుగా పెంచిరాసాడు. అనువాదానికి ఆటవెలది, తేటగీతం వాడుకున్నాడు. అవసరమైనచోట ద్విపదను, రగడను ఉపయోగించినాడు.

మచ్చునకు కొన్నిపద్యాలు

మార్చు

     ప్రతిది సులభమ్ముగా సాధ్యపడదులెమ్ము
     నరుడు నరుదౌట యెంతొ దుష్కరము సుమ్ము.

లోకంలో ప్రతిపని సులభంగా నెరవేరదు. దానికై కష్టపడితేనే సాధ్యం. మననడక, మాట, విద్య తదితరాలన్ని కష్టపడే నేర్చుకుంటాం. అలాగే మన నడత (శీలం, గుణం, వ్యక్తిత్వం)కూడా. మనిసిగా పుట్టినంత సరిపోదు. మానవత్వంవున్నవాడే మనిషి. అలాంటి మానవత్వం (ఇతరులయెడ ప్రేమ, దయ, కరుణ, పరోపకార యిత్యాదులు) కలిగి వున్నవాడే నిజమైన నరుడు/మానవుడు. మానవత్వమనది సహజంగా రాదు. నరుడు ఆసద్గుణాలను కష్టమైనప్పటికి, అల్వర్చుకోని మనిషిగా బ్రతకాలి.

     సింధువును జేరి బిందువు సింధువగును
     ధ్యేయమును బట్టి ప్రతిపని దివ్యమగును.

నీటి బిందువన్నది వెళ్ళి మురికికాల్వలో చేరిన అది కలుషితమై మురికినీరవ్వుతుంది. పంటకాలువలో కలిస్తే మొక్కలకు చేరుతుంది. మరి అది సముద్రంలో కలిస్తే, దానితో మమేకమై సముద్రంగా మారుతుంది. వున్నతమైన వ్యక్తులతో కూడితే మనం వున్నతులమవ్వుతాము.

     నడుము బిగియుంచుచుంటివి నన్ను దునుమ,
     నాకు తెలియులే నీకెంత నడుము కలదొ!

ప్రియుడు తనప్రియురాలిని పైకి నిందించునట్లు అన్పించినను, నర్మగర్భంగా ప్రియురాలి దేహసొబగును మెచ్చుకుంటున్నాడు. తనను చంపటానికి కొంగును నడుముకు బిగిస్తున్నది చెలియ. నడుమేలేని చాన కొంగు ఎక్కడబిగించగలదు. కందిరీగవంటి నడుమున్నప్రేయసి అని కవిభావము.

     అన్ని రోగములకు నౌషధం బుండియు
     ప్రణయ రోగమునకు కనము మందు

ఈలోకంలో అన్నిరకాల జబ్బులకు ఔషధాలున్నాయి. కొత్తకొత్త జబ్బులకు కొత్తరకం మందులను పరిశోధించి కనుగొంటున్నారు. అయితే అనాదికాలం నుండి నేటి వరకు, అదేమి విచిత్రమో? ఇంతవరకు ఎవ్వరు కూడా ప్రేమరోగానికి ఎలాంటి నివారణఓషధును కనిపెట్టలేకపోయారు. అనగా ప్రణయపవిరహంలో నున్నవాడికి ప్రియురాలి ప్రేమొక్కటే మందు.

     ఏల నన్ను మరచె నెరుగబోయితి, నామె
     వలపుచూపు చూచె భస్మమైతి

ఎందుకో?ఎమో?!ఈ మధ్యకాలంలో గాలిబ్ ప్రియురాలు గాలిబ్‍ను అంతగా సరకు చెయ్యడంలేదు. మరచినట్లు నటిస్తున్నది.ఎందుకలా?. కోపంతో, బాధతో అడుగబొయ్యిన గాలిబ్ ప్రేయసిచూసిన వలపు చూపునకు భస్మమైయ్యాడు. అంతేకదా? కలకంఠి కొనచూపుకు లొంగని పురుషపుంగువులున్నారే ఇలలో?.రెండువాక్యాలలో ఇంతుల,పుబంతుల వాలుచూపులెంత సమ్మోనకారమో తెలియచెప్పాడు.

     నాదు గుండెగాయము కుట్టు సూదికంట
     ఆశ్రుజలధార దారమై అవతరించె

ఆమెను అతను ఎంతగానో మోహిస్తున్నాడు. కాని ప్రియురాలేమో అతనినిక్కమైన ప్రేమను తిరస్కరించి అతనిగుండెకు గాయాలు చేసింది. అతని గుండెగాయన్ని కుట్టు సూది అతని హృదయావేదనను కని కార్చిన కన్నిరే దారంగా మారింది. నిర్జీవమైన సూదుకంట కన్నీరొలకింది-కాని ప్రేయసిమనస్సు కరగలేదు. ఎంత కఠినహృది ప్రేయసి.

     మృత్యు వేతెంచినపుడామె లేఖవచ్చె,
     చదువకయె వక్షమున నుంచి చచ్చినాను.

పాపం?అతను ఆమెను మనసారా వలచాడు.కాని ప్రియురాలేమో అతనిప్రేమను కఠినంగా తిరస్కరించింది.కాని అతడు సర్వసంవదలి ఆమె ప్రేమకై, అమె అంగీకారానికై జీవితాంతం అమెగురించిన మధురభావనలతో ఎదురుచూస్తూనే వున్నాడు. ఎట్టికేలకు ప్రేయసి మనస్సుకరిగి, అంగీకారంతెల్పుతు లేఖ పంపినది. లేఖ చేతికందినది. కాని చదవకయే కనుమూసినాడు. ఏ ప్రియురాలు ప్రేమకై చకోరపక్షిలా ఎదురుచూసాడో, ఆ ప్రేయసి తనప్రేమ నంగీకరించిందన్ననిజం తెలియకుండనే మరణించాడు. ఎంతటి దురదృష్టవంతుడు?శరత్‍బాబు దేవదాసు గుర్తుకొస్తున్నాదు.

     అన్ని బంధాల విదలించినట్టి యెడద
     కురుల ఉరులందునన్ చిక్కుకొనెను,చెలియ!

జీవితంలోని అన్నిబంధాలనుండి విముక్తుడయ్యాడు.అదేమి విచిత్రమో! ప్రియురాలి వలపుగాలంలో చిక్కుకున్నాడు. వురుల(వుచ్చుల)వంటి ప్రియురాలికురులలో ప్రియుడిమనస్సు చిక్కుకుపోయి, బంధి అయ్యాడట!. కాంతకనకాలకు లొంగనివాడెవ్వడు ఇలలో.

     లోకమందు సుఖము శోకమ్ము కలవండ్రు
     శోకమనసె ఇచ్చె నాకు బ్రహ్మ

జగతిలో మనష్యులకు సుఖదుఃఖాలు సహజం. కొన్నిదినాలు కష్టాలనుభవించినను, పిమ్మట సుఖలను,భోగాలను పొందటం సహజం, అనివార్యం. పాపం? గాలిబుకు మాత్రం నుదుట అన్నిదుఃఖాలనే, కష్టాలనే రాసాడు ఆ బ్రహ్మ.

     కత్తి చేతలేక కదనమ్ము జరిపెడి
     ఇంతి కెవ్వ దనువు లీయకుండు?

యుద్ధం చేయువారు, రెండువైపులవారు ఆయుధాలను చేతధరించి సమరంచేస్తారు, పోరాటం సల్పుతారు. ఇక్కడేమో కదనం రమణీమణితో. చేస్తున్నది ప్రేమయుద్ధం. పూబోణిచేతిలో ఎటువంటి ఆయుధం చేతపట్టక, తన రమణియసౌందర్యంతో, వలపుచూపులతో హృదయాన్ని తూట్లుపొడుస్తుంటె, తనువులర్పించని వారుంటారా జగతిలో ?

     ఈ జగత్తు స్వభావమ్ము హీనమౌర!
     మంచిచేసిన వానిని ముంచునౌర!

రానురాను ప్రపంచము లో మనస్సుల మధ్య విలువలు నిస్సిగ్గుగా వలువలు విప్పుకుంటున్నాయి, నగ్నంగా నర్తిస్తున్నాయి. ఒక్కప్పుడు అందరి కోసం ఒక్కడు-ఇప్పుడు నాకోసం అందరు. ఒకప్పుడు పక్కవాడికి మనమేమైన సహయపడగలమా? అని తోటి వాడు ఆలోచించేవాడు. మరినేడు మీ ఇంటికొస్తే ఏమిస్తావు! మా ఇంటికొస్తే ఏమితెస్తావూ!. అపకారికి ఉపకారం చేయమన్నారు నాడు - నీకు ఉపకారం చేసినవాడికే ద్రోహం చెయ్యడం నేటి నీతి.

     వేరులో నుండి కొమ్మలు వెలసినట్లు
     అన్ని శబ్ధాలు నిశ్శబ్దమందె పుట్టె

చెట్టు కాండం, కొమ్మలు, ఆకులు పెరగాలంటె దాని వేరే ములాధారం. అలాగే శబ్ధంకూడా నిశ్సబ్దం నుండె ఆవిర్భవించింది. ప్రణవనాదం (ఓం కారం) పుట్టుకకు ముందు విశ్వమంత నిశ్శబ్దమే రాజ్యమేలింది. బిగ్‍బ్యాంగ్ సిద్ధాంతం కూడా అదే చెప్పుతున్నది.

     తారలెల్ల పగలు పరదాల దాగె
     రాత్రివేళ నవి దిగంబరమ్ములయ్యె.

ఈ పద్యంలో ద్వందార్థాలు గోచరిస్తాయి పాఠకునికి. నక్షత్రాలు ఆకాశంలో ఎప్పడూ వుంటాయి. అయితే పగలు సూర్యకాంతి గగనమంతా పరచుకున్నందున, దాని ప్రకాశంలో చుక్కలు పగలు కంటికి ఆనవు. రాత్రివేళ గగనమంతా నిండుకొని కనులవిందు చేస్తాయి. పగటిపూట సూర్యాకాంతిని ఆకాశాన్నికప్పిన పరదాగా భావించాలి. మరోఅర్థంలో అంతపురంలోని గోషాస్త్రీలు బురకాలుధరించి పరులకు, పురుషులకు కన్పించరు. రాత్రివేళ సంగమవేళ దిగంబరులవుతారు ప్రియునితో కూడుటకై.

     వలపు లేనాటికి నిష్పలము కావు,
     కాయ గాయని వృక్షమ్ము కాదు వలపు.

కాయలుకాసి పండ్లనివ్వనిచెట్లు ఎలావ్యర్థమో, అలాగే ప్రేమించని హృదయంకూడా వ్యర్దమేనంటున్నాడు గాలిబు.

     జ్వాలయే దీపమునకు సర్వస్వమట్లు
     ప్రణయమే జీవనమునకు సర్వస్వమయ్యె.

దీపం నిరంతరం వెలుగుటకు జ్యాల (మంట) ఎంత అవసరమో. జీవితానికి ప్రేమ అంతటిఅవసరం. ప్రేమే జీవితం. ప్రేమైకజీవితమే రమ్యం, ధన్యం, పరిపూర్ణం.

మూలాలు

మార్చు