ఆటవెలది
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
పద్య విశేషాలు |
---|
వృత్తాలు |
ఉత్పలమాల, చంపకమాల |
మత్తేభం, శార్దూలం |
తరళం, తరలము |
తరలి, మాలిని |
మత్తకోకిల |
స్రగ్ధర, మహాస్రగ్ధర |
ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము |
లయగ్రాహి, లయవిభాతి |
జాతులు |
కందం, ద్విపద |
తరువోజ |
అక్కరలు |
ఉప జాతులు |
తేటగీతి |
ఆటవెలది |
సీసము |
ఆటవెలది తెలుగు ఛందస్సులో ఒకానొక జాతి పద్యరీతి.
లక్షణములు
మార్చు- సూత్రము:
ఆ. ఇనగణ త్రయంబు నింద్ర ద్వయంబును
హంస పంచకంబు ఆటవెలది.
- ఇందు నాలుగు పాదములుంటాయి.
- 1, 3 పాదాలు మొదట 3 సూర్య గణాలు తరువాత 2 ఇంద్ర గణాలు కలిగి ఉంటాయి.
2,4 పాదాలు 5 సూర్య గణాలు ఉంటాయి. - ప్రతి పాదములొ నాల్గవ గణం మొదటి అక్షరం యతి
- ప్రాసయతి చెల్లును
- ప్రాస నియమం లేదు. ప్రాసయతి చెల్లును.
ఉదాహరణలు
- 'విశ్వదాభిరామ వినుర వేమ' అనే మకుటంతో ఆంధ్రులకు చిరపరిచితములైన వేమన పద్యాలన్నీ ఆటవెలదులే.
ఉదా:
ఉప్పుకప్పురంబు ఒక్కపోలికనుండు,
చూడచూడ రుచుల జాడవేరు,
పురుషులందు పుణ్యపురుషులు వేరయా
విశ్వదాభిరామ వినుర వేమ.
అనువుగానిచోట అధికులమనరాదు
కొంచెముండుటెల్ల కొదువగాదు
కొండ అద్దమందు కొంచెమై యుండదా
విశ్వదాభిరామ వినురవేమ.
- ఇతరాలు
రామహేశు నాదు నవ్యక్తు నధ్యాత్మ
యోగగమ్ము బూర్ణు నున్న తాత్ము
బ్రహ్మ మైన వాని బరుని నతీంద్రియు
నీశు స్థూలు సూక్ష్ము నే భజింతు.
నెఱి నసత్య మనెడి నీడతో వెలుగుచు
నుండు నెక్కటికి మహోత్తరునకు
నిఖిల కారణునకు, నిష్కారణునకు న
మస్కరింతు నన్ను మనుచు కొఱకు.