గాలివాన అదే పేరుతో పలు ప్రదర్శనలు ఇవ్వబడి ప్రేక్షకుల మెప్పు పొందిన నాటకం ఆధారంగా నిర్మించబడిన తెలుగు సినిమా.

గాలివాన
(1979 తెలుగు సినిమా)
దర్శకత్వం ఆదిరాజు ఆనంద మోహన్
తారాగణం నూతన్ ప్రసాద్ ,
బోసుబాబు
సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు
నిర్మాణ సంస్థ సురేంద్ర ఆర్ట్స్
భాష తెలుగు

కథ మార్చు

ఒక గ్రామంలో భూషణం అనే ప్రెసిడెంట్, మంచికి మారుపేరైన రామయ్య అనే రైతు ఈ రెండు కుటుంబాల మధ్య వియ్యమందుకొని సుఖంగా సాగిపోగలమని అనుకొంటుండగా ఎన్నికలు దగ్గర పడతాయి. ప్రెసిడెంట్ ఘోరాలకు విసిగెత్తిన కొందరు పెద్దలు రామయ్య కొడుకు శ్రీధర్‌ను భూషణంపై పోటీకి పెట్టారు. ఫలితంగా రెండు కుటుంబాల మధ్య వైరం ప్రారంభమౌతుంది. భూషణం కుమార్తె సుందరి, శ్రీధర్ ప్రేమించుకుంటారు. ఇది తెలియని శ్రీధర్ తమ్ముడు బాబీ సుందరి మీద మనసు పడతాడు. ఆ ఊళ్లో టీచర్‌గా ఉన్న లక్ష్మి బాబీని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. తన పదవి కోసం భూషణం తన కూతురు సుందరిని బాబీకి ఎరగా పెట్టి అన్నదమ్ముల మధ్య వైరాన్ని, కుటుంబంలో చీలికను తెస్తాడు[1].

నటీనటులు మార్చు

  • బోసుబాబు - శ్రీధర్
  • విజయకృష్ణ - బాబీ
  • నారాయణ - రామయ్య
  • సత్యచిత్ర - సుందరి
  • హనుమంతరావు - భూషణం
  • శ్రీసుధ - లక్ష్మి
  • విజయగౌరి - సరస్వతి, భూషణం భార్య

సాంకేతిక వర్గం మార్చు

  • చిత్రానువాదం, దర్శకత్వం: ఆదిరాజు ఆనందమోహన్
  • కథ: ఆర్.వి.ఎస్.రామస్వామి
  • పాటలు: కోపల్లె శివరాం
  • సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
  • నిర్మాత: డి.హనుమాండ్లు

పాటలు మార్చు

  1. గలగల మని నవ్వకే సొగసు కరిగి పోతుంది చిలిపి కళ్ళు మూయకే - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
  2. చేతులారా చేసుకున్నావు - మాధవపెద్ది, లలితా రాణి, నరసింహమూర్తి, పి.సుశీల
  3. నింగి నేల చేరువైతే జీవితాన పూలవాన మనసు విరిగి దూరమైతే - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  4. వస్తావని అందగాడా విన్నానురో సందెకాడ బస్తీవంకాయ కూరచేసి - ఎస్.జానకి

మూలాలు మార్చు

  1. పి.ఎన్. (15 December 1979). "చిత్రసమీక్ష గాలివాన". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 66, సంచిక 253. Retrieved 3 January 2018.[permanent dead link]

బయటి లింకులు మార్చు