గిడుగు లక్ష్మీకాంతమ్మ

లక్ష్మీశారద జంటకవయిత్రులలో గిడుగు లక్ష్మీకాంతమ్మ ఒకరు. రెండవవారు జొన్నలగడ్డ శారదాంబ.

జీవిత విశేషాలు

మార్చు

గిడుగు లక్ష్మీకాంతమ్మ[1] 1903 , ఫిబ్రవరి 2 రాజమండ్రిలో వక్కలంక వారి యింట జన్మించింది. తండ్రి గవర్రాజు. తల్లి చెల్లాయమ్మ. ఈమె రాజమండ్రి గర్ల్స్ హైస్కూలులో నాలుగవ ఫారం వరకు చదివింది. 1917 అక్టోబరులో ఈమెకు గిడుగు వెంకట రామమూర్తి పంతులుతో వివాహం జరిగింది. ఇతడు ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్‌గా పనిచేశాడు. ఇతని బాబాయి వ్యవహారిక భాషా ఉద్యమ పితామహుడైన గిడుగు వెంకట రామమూర్తి పంతులు. లక్ష్మీకాంతమ్మ భర్త ప్రోత్సాహంతో సంగీత సాహిత్యాలలో ప్రావీణ్యం సంపాదించింది. ఈమెకు పది మంది సంతానము. ఏడుగురు కుమార్తెలు. ముగ్గురు కొడుకులు. ఈమె కవిత్వం వాసే తొలినాళ్లలో ఈమె ఆడపడుచు జొన్నలగడ్డ శారదాంబ తోడయ్యింది. ఇద్దరికీ ఒద్దిక కలిగి 'లక్ష్మీశారదలు' అనే పేరుతో జంటకవయిత్రులుగా కవితలు అల్లినారు. జొన్నలగడ్డ శారదాంబ 1944లో మరణించింది.

రచనలు

మార్చు
  1. లక్ష్మీశారదా గీతములు[2]
  2. లక్ష్మీశారదా శతకములు
  3. లక్ష్మీశారదా సుభాషితములు
  4. కుమారనీతి (శతకము)
  5. తిరుపతి వెంకటేశ్వరశతకము
  6. శతక రామాయణము
  7. ఆరోగ్యసామ్రాజ్యము
  8. పితృస్మృతి
  9. మానసిక సామ్రాజ్యము
  10. లేఖదూత
  11. వరకట్న నిరసనము
  12. రామచంద్ర శతకము
  13. కన్నీరు మొదలైనవి.

వీటిలో కుమారనీతి, మానసిక సామ్రాజ్యము, కన్నీరు అనే రచనలు గిడుగు లక్ష్మీకాంతమ్మ ఒక్కరే వ్రాసింది. మిగిలినవి జొన్నలగడ్డ శారదాంబతో కలిసి జంటగా రచించినవి.

పురస్కారాలు

మార్చు
  • 1951లో గృహలక్ష్మి స్వర్ణకంకణము లభించింది.

మూలాలు

మార్చు
  1. "[[గృహలక్ష్మి]] మాసపత్రిక మార్చి 1951 సంచిక". Archived from the original on 2016-03-05. Retrieved 2014-11-20.
  2. భారత డిజిటల్ లైబ్రరీలో పుస్తక ప్రతి