1917
1917 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1914 1915 1916 - 1917 - 1918 1919 1920 |
దశాబ్దాలు: | 1890లు 1900లు - 1910లు - 1920లు 1930లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
మార్చుతేదీలు తెలియనివి
మార్చు- బీజింగ్‌లో నిజ ఏసుక్రీస్తు మండలి స్థాపన.
జననాలు
మార్చు- జనవరి 2: కె.ఎం.మాథ్యూ, మలయాళ మనోరమ దినపత్రిక సంపాదకుడు. (మ.2010)
- జనవరి 13: నల్లా రెడ్డి నాయుడు, న్యాయవాది, రాజకీయ నాయకుడు. వీరు మాజీ పార్లమెంటు సభ్యుడు. (మ.1982)
- జనవరి 17: ఎం.జి.రామచంద్రన్, సినిమా నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి. (మ.1987)
- ఫిబ్రవరి 11: తరిమెల నాగిరెడ్డి, కమ్యూనిస్టు నాయకుడు. (మ. 1976)
- మార్చి 5: కాంచనమాల, తొలితరం నటీమణులలో ఒకరు.
- మార్చి 8: నార్ల తాతారావు, విద్యుత్తు రంగ నిపుణుడు. (మ.2007)
- మార్చి 14: కె.వి.మహదేవన్, తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు. (మ.2001)
- మార్చి 16: ఆవుల సాంబశివరావు, న్యాయవాది, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర మొట్టమొదటి లోకాయుక్త, హేతువాది, ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్. (మ.2003)
- మార్చి 19: లాస్లో జాబో, హంగరీకి చెందిన అంతర్జాతీయ చెస్ గ్రాండ్ మాస్టర్ (మ.1998)
- ఏప్రిల్ 3: పొందూరి వెంకట రమణారావు, మైక్రో బయాలజిస్టు. (మ.2005)
- ఏప్రిల్ 12: వినూమన్కడ్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు. (మ.1978)
- ఏప్రిల్ 29: ఆవుల గోపాలకృష్ణమూర్తి ఎ.జి.కె.గా పేరొందిన హేతువాది. రాడికల్ హ్యూమనిస్టు, సమీక్ష పత్రికలు నడిపారు (మ.1966)
- మే 29: జాన్ ఎఫ్ కెనడి, అమెరికా సంయుక్త రాష్ట్రాలకు 35వ అధ్యక్షుడు. (మ.1963)
- జూన్ 16: నముడూరు అప్పలనరసింహం, తెలుగు కవి, పండితుడు, అష్టావధాని. (మ.1986)
- జూన్ 27: ముక్కామల అమరేశ్వరరావు - రంగస్థల నటుడు, దర్శకుడు (మ.1991)
- జూలై 17: దుక్కిపాటి మధుసూదనరావు, తెలుగు సినీ నిర్మాత. (మ.2006)
- ఆగష్టు 25: దేవులపల్లి రామానుజరావు, రచయిత.
- సెప్టెంబర్ 23: అసీమా చటర్జీ, భారతీయ మహిళా రసాయన శాస్త్రవేత్త. (మ.2006)
- అక్టోబర్ 19: ఎస్.ఎస్.శ్రీఖండే, భారతీయ గణిత శాస్త్రవేత్త.
- అక్టోబర్ 27: జోతి వెంకటాచలం కేరళ గవర్నరుగా, తమిళనాడు రాష్ట్ర మంత్రిగా పనిచేసిన రాజకీయ నాయకురాలు. పద్మశ్రీ పురస్కార గ్రహీత.(మ.వివరాలు తెలియవు)
- నవంబరు 8: చిటిమెళ్ళ బృందావనమ్మ, విద్యావేత్త సంఘ సేవకురాలు, చిత్రకారిణి. (మ.2008)
- నవంబరు 9 : పిడతల రంగారెడ్డి, ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకరు, మాజీ శాసనమండలి అధ్యక్షుడు. (మ.1991)
- నవంబర్ 11: కమల్ రణదివె, భారత దేశానికి చెందిన కణ జీవ శాస్త్రవేత్త. భారత మహిళా శాస్త్రవేత్తల సంఘం స్థాపకురాలు. (మ.2001)
- నవంబరు 13: వసంత్‌దాదా పాటిల్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.
- నవంబర్ 19: ఇందిరా గాంధీ, భారత మాజీ ప్రధానమంత్రి. (మ.1984)
- డిసెంబర్ 25: ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ, కవయిత్రి, పరిశోధకురాలు, గృహలక్ష్మి స్వర్ణకంకణ గ్రహీత (మ.1996)
మరణాలు
మార్చు- జూన్ 30: దాదాభాయి నౌరోజీ, భారత జాతీయ నాయకుడు. (జ.1825)