గిద్దలూరు నగరపంచాయితీ

గిద్దలూరు నగరపంచాయితీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లాజిల్లాకు చెందిన నగరపంచాయితీ.ఈ నగర పంచాయతీ ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గం లోని, గిద్దలూరు శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందినది.

గిద్దలూరు నగర పంచాయితీ
గిద్దలూరు
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం

చరిత్ర మార్చు

గిద్దలూరు నగర పంచాయితీ ప్రకాశం జిల్లాకు చెందినది.నగర పంచాయితీ విస్తీర్ణం 31.39 చ.కి.మీ. ఈ నగర పంచాయతీ 20 [1] వార్డులలో ఏర్పాటు చేశారు.దీని కోసం ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి.[2] 1930వ దశకములో కామ్మియెడ్, బర్కెట్ట్ అను ఇద్దరు పురావస్తు శాస్త్రజ్ఞులు గిద్దలూరు పరిసరాల్లో పాత రాతియుగము (అప్పర్ పేలియోలిథిక్) నాటి మానవుడు నివసించిన ఆధారాలు కనుగొన్నారు.[3] ఇక్కడ మధ్య రాతియుగము నాటి చిన్న రాతి పనిముట్ల పరిశ్రమలు బయల్పడ్డాయి.[4][5]

భౌగోళికం మార్చు

గిద్దలూరు నగరపంచాయితీ 15°22′35″N 78°55′30″E / 15.3764°N 78.9251°E / 15.3764; 78.9251అక్షాంశాలు రేఖాంశాల మధ్య ఉంది.[6][7][8] సముద్ర మట్టానికి 253 మీ ఎత్తులో ఉంది.

జనాభా గణాంకాలు మార్చు

ఈ పురపాలక సంఘంలో 2011 జనాభా లెక్కల ప్రకారం గిద్దలూరు మొత్తం జనాభా 35,150. ఇందులో పురుషులు 17,728 కాగా మహిళలు 17,422 మంది ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా జనాభాలో 9.8% ఉన్నారు.గిద్దలూరు అక్షరాస్యత 79.71%, ఇది రాష్ట్ర సగటు 67.02%కంటే ఎక్కువ.[9][10]

పౌర పరిపాలన మార్చు

ఈ నగర పంచాయతి కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. నగర పంచాయతీ పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 20 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.

మూలాలు మార్చు

  1. "About Giddalur Nagarapanchayat | Commissioner and Director of Municipal Administration". cdma.ap.gov.in. Retrieved 2021-10-16.
  2. "Public services/amenities". Commissioner & Director of Municipal Administration. Municipal Administration & Urban Development Department, Govt. of Andhra Pradesh. Archived from the original on 7 జూలై 2012. Retrieved 16 అక్టోబరు 2021.
  3. Indian Anthropologist: Journal of the Indian Anthropological Association By Indian Anthropological Association v.11 (1981) పేజీ.21 [1]
  4. An Encyclopaedia of Indian Archaeology By Amalananda Ghosh పేజీ.149
  5. Indian History (21st Edition, 2005) Allied Publishers ISBN 8177647660 పేజీ.A-9 [2]
  6. "Prakasam District Mandals" (PDF). Census of India. pp. 146, 176. Retrieved 19 June 2015.
  7. "Maps, Weather, and Airports for Giddaluru, India". www.fallingrain.com. Retrieved 27 April 2019.
  8. India, The Hans (2017-04-21). "Wild animals losing lives while searching for water, food". www.thehansindia.com. Retrieved 2019-04-27.
  9. "Giddalur Census 2011".
  10. "Giddalur Census 2011".

వెలుపలి లంకెలు మార్చు