గిరిజన సంక్షేమ శాఖ

ఆంధ్ర ప్రదేశ్ లోని గిరిజన సంక్షేమ శాఖ 1966 నవంబరు 16న ఏర్పడింది. అంతకు ముందు ఈ శాఖ సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో వుండేది. గిరిజన సంక్షేమ శాఖ గిరిజన రక్షణ చట్టాల అమలుకు కోసం విధానాల రూపకల్పన చేయడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడం రాష్ట్రంలోని రాష్ట్రంలోని షెడ్యూల్డ్ తెగల మొత్తం సామాజిక-ఆర్థిక అభివృద్ధికి కట్టుబడి ఉంది. 2011 జనాభా గణాంకాల ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 27.39 లక్షల గిరిజన జనాభా కలిగి ఉంది. ఇది రాష్ట్రం మొత్తం జనాభాలో 5.53 శాతం. గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్ర స్థాయిలో గిరిజన సహకార సంస్ధ (జిసిసి),గిరిజన సాంస్కృతిక, పరిశోధన, శిక్షణ మిషన్ (టిసిఆర్&టిఎం) వంటి సంస్థలు, గిరిజన ఉప ప్రణాళిక, నిర్దేశిత ప్రాంతాల్లోని సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థల ద్వారా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది.

మూలాలు

మార్చు

1. [1] Archived 2023-03-28 at the Wayback Machineగిరిజన సంక్షేమ శాఖ అధికారిక వెబ్ సైట్

2. [2] గిరిజన ఉప ప్రణాళిక వెబ్ సైట్