గీతామెహతా (1943 - 2023 సెప్టెంబరు 16) భారతీయ రచయిత్రి. ఆమె న్యూఢిల్లీలో సుప్రసిద్ధమైన ఒడియా కుటుంబంలో జన్మించింది. ఆమె భారత స్వాతంత్ర్య సమరయోధుడు, ఒరిస్సా పూర్వ ముఖ్యమంత్రి అయిన బిజు పట్నాయక్ కుమార్తె. ఆమె సోదరుడు నవీన్ పట్నాయక్ 2000 సంవత్సరం నుండి ఒరిస్సా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆమె యునైటెడ్ కింగ్ డం లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించారు.[1]

గీతా మెహతా
పుట్టిన తేదీ, స్థలంగీతా పట్నాయక్
1943 (1943)
ఢిల్లీ, బ్రిటిష్ ఇండియా
మరణం (aged 80)
వృత్తిరచయిత, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్, జర్నలిస్ట్, సినిమా దర్శకురాలు
జాతీయతఅమెరికన్
పూర్వవిద్యార్థిగిర్టన్ కాలేజ్, కేంబ్రిడ్జ్
గుర్తింపునిచ్చిన రచనలుకర్మ కోలా (1979)
ఎ రివర్ సూత్రం' (1993)
ఎటర్నల్ గణేశ (2006)
జీవిత భాగస్వామి
(m. 1965; died 2019)
తండ్రిబిజు పట్నాయక్
సంతానం1
బంధువులునవీన్ పట్నాయక్ (తమ్ముడు)
ప్రేమ్ పట్నాయక్ (అన్నయ్య)

ఆమె యు.కె, యురోపియన్, యు.ఎస్ నెట్‌వర్క్ లో 14 టెలివిజన్ డాక్యుమెంటరీలకు నిర్మాత/దర్శకత్వం వహించారు. 1970-71 మధ్య కాలంలో ఆమె యు.ఎస్. టెలివిజన్ నెట్‌వర్క్ అయిన ఎన్.బి.సికు టెలివిజన్ వార్ కరెస్పాండెంట్ గా వ్యవహరించారు. 

ఆమె సోనీ మెహతా ను వివాహమాడారు. ఆయన ఆల్ప్రెడ్ ఎ.నోఫ్ పబ్లిషింగ్ హౌస్ కు అధిపతిగా ఉండేవారు. ఆమె ఆ సంఅథలో పనిచేస్తూ ఒక రచయితగా ఎదిగారు. ఆమె రాసిన పుస్తకాలు 21 భాషలలో అనువాదమయ్యాయి. అవి ఐరోపా, యు.ఎస్, భారతదేశంలో అత్యధికంగా అమ్ముడయ్యాయి. ఆమె రాసిన రచనలలో  ఫిక్షన్ , నాన్ ఫిక్షన్  రచనలు భారతదేశంపై  కేంద్రీకరించబడి ఉండేవి. భారతదేశ  సంస్కృతి, చరిత్ర పై  రచనలు  చేసారు. 

ఆమె తన సమయాన్ని న్యూయార్క్ సిటీ, లండన్, న్యూఢిల్లీలలో గడిపారు.

గీతా మెహతా తన 80వ ఏట 2023 సెప్టెంబరు 16న న్యూఢిల్లీలోని తన ఇంట్లో మరణించింది.[2][3]

రచనలు

మార్చు
  • Karma Cola. Simon and Schuster. 1979.[4]
  • Raj (1989)
  • A River Sutra (1993)
  • Snakes and Ladders: Glimpses of Modern India, London, Secker and Warburg, 1997. ISBN 0-436-20417-7[5]
  • Eternal Ganesha

ఇతర లింకులు

మార్చు

Bio-bibliographical Information

  • "Bold Type Interview: Gita Mehta". Random House.

మూలాలు

మార్చు
  1. "Upfront daughter of the revolution: Gita Mehta". Vogue. April 1997. pp. 114, 120, 124.
  2. "Author Gita Mehta, Naveen Patnaik's Sister, Dies At 80". NDTV.com. Archived from the original on 17 September 2023. Retrieved 17 September 2023.
  3. "Gita Mehta, renowned author and Odisha CM Naveen Patnaik's sister, dies at 80". The Economic Times. 17 September 2023. Retrieved 17 September 2023.
  4. Mehta, Gita (1979). Karma Kola, Marketing the Mystic East. New York: Simon and Schuster. pp. 201. ISBN 0-671-25083-3.
  5. Smith, Wendy, 'Gita Mehta: Making India Accessible'