గీత్ సేథి
గీత్ శ్రీరామ్ సేథీ (జననం 1961 ఏప్రిల్ 17) భారతదేశానికి చెందిన ఇంగ్లీష్ బిలియర్డ్స్ ప్రొఫెషనల్ ప్లేయర్.[1] ఆయన 1990లలో చాలా వరకు అన్నీ పోటీలలో ఆధిపత్యం చెలాయించాడు. ఆయన ప్రముఖ ఔత్సాహిక (ఎక్స్-ప్రో) స్నూకర్ ఆటగాడు కూడా. ఆయన ప్రొఫెషనల్-లెవల్‌లో ఐదుసార్లు విజేత, ఔత్సాహిక ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో మూడుసార్లు విజేత, ఇంగ్లీష్ బిలియర్డ్స్‌లో రెండు ప్రపంచ రికార్డులను కైవసం చేసుకకున్నాడు.[2] ఆయన ప్రకాష్ పదుకొణెతో కలిసి దేశంలో క్రీడల ప్రోత్సాహానికి ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్‌ను స్థాపించాడు. దీంతో భారతదేశంలో క్రీడల ప్రోత్సాహానికి పునాది పడింది అని చెప్పవచ్చు.
జననం | ఢిల్లీ, భారతదేశం | 1961 ఏప్రిల్ 17
---|---|
క్రీడా దేశం | భారతదేశం |
2005లో ఆయన సక్సెస్ వర్సెస్ జాయ్(Success vs Joy) అనే ఆత్మకథాత్మక ప్రేరణాత్మక పుస్తకాన్ని రచించాడు. ప్రస్తుతం ఆయన ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ వెంచర్ ద్వారా ఒలింపిక్ క్రీడలకు భారతీయ క్రీడాకారులను తయారుచేస్తున్నాడు.[3]
విద్యాభ్యాసం
మార్చుఅహ్మదాబాద్లోని సెయింట్ జేవియర్స్ హై స్కూల్ లో చదివిన ఆయన సెయింట్ జేవియర్స్ కాలేజ్ నుంచి డిగ్రీ పొందాడు. ఆయన బి.కె స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్, గుజరాత్ విశ్వవిద్యాలయం నుంచి ఎం.బి.ఎ పూర్తి చేసాడు.[4]
వ్యక్తిగత జీవితం
మార్చుగీత్ సేథి అహ్మదాబాద్‌లో భార్య కిరణ్ బీర్ సేథి, ఇద్దరు పిల్లలు రాగ్, జాజ్‌లతో కలిసి నివసిస్తున్నాడు.[4][2] బిలియర్డ్స్ పోటీలతో పాటు ఆయన అహ్మదాబాద్, ముంబైలలో రాగ్ ట్రావెల్స్ అనే ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీని నడుపుతున్నాడు.[4]
గుర్తింపు
మార్చుఆయన భారతదేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న 1992-1993 గ్రహీత. 1986లో ఆయనను భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. ఆయనకు రెండు సార్లు అర్జున అవార్డు (1985, 1992-93)దక్కించుకున్న ఘనత కూడా దక్కింది. 1993లో ఆయన కె.కె. బిర్లా అవార్డు సొంతం చేసుకున్నాడు.[1][5]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Geet Sethi Profile". ILoveIndia.com. pp. "Sport in India" section. Archived from the original on 2 July 2014. Retrieved 30 November 2007.
- ↑ 2.0 2.1 "Geet Sethi crowned World Billiards Champion for the 8th Time!". TNQ.in. TNQ Sponsorship (India) Pvt. Ltd. 2006. Archived from the original on 21 July 2011. Retrieved 30 November 2007.
- ↑ "A strategy for medals – Geet Sethi". The Wall Street Journal. 24 August 2007. Archived from the original on 9 October 2011. Retrieved 15 November 2009.
- ↑ 4.0 4.1 4.2 "Geet Sethi". India's Who is Who. Archived from the original on 4 June 2011. Retrieved 22 April 2008.
- ↑ "Geet Sethi Page". TNQ.in. TNQ Sponsorship (India) Pvt. Ltd. 1998. Archived from the original on 21 July 2011. Retrieved 30 November 2007.