గుంటుపల్లి గోపాలకృష్ణకవి

తెలుగు కవి

గుంటుపల్లి గోపాలకృష్ణకవి ప్రబంధ కవులలో ఒకడు.

జీవిత విశేషాలు

మార్చు

అతను నందవరీక బ్రాహ్మణుడు. నివాసస్థలము గుంటూరు మండలం నందలి నర్సారావుపేట తాలూకాలోని చెన్నుపల్లి గ్రామం. ఇప్పుడీ గ్రామం ప్రకాశం జిల్లాలో ఉన్నది. వీరిది వసిష్ఠ గోత్రము. తండ్రి కోటిలింగము. తల్లి అనంతలక్ష్మమ్మ. సోమ మంత్రికిని వేంకమాంబకును పౌత్రుడు[1].

రచనలు

మార్చు

ఈకవి రచించిన గ్రంథములు

  1. బుధజనహృదయాహ్లాదము.(ప్రబంధము)
  2. చమత్కార నిదానము.[2] (ఏకాశ్వాసము) (ముద్రణ: 1910)
  3. పార్వతీ పరిణయము. (నాటకము)
  4. వై శాఖమహాత్మ్యము, ( భాషాంతరీకరణము)
  5. శివరామశతకము.
  6. మరకతలింగశతకము.

ఈతఁడు దాదాపుగ నఱువదేండ్లకాలము జీవించి క్రీ. శ.1917 సంవత్సర ప్రారంభమునఁ వీరు దివంగతులైనట్లు తెలియుచున్నది.

మూలాలు

మార్చు
  1. "పుట:Aandhrapatrika-Padunokandava.pdf/117 - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2020-05-25.[permanent dead link]
  2. https://ia802902.us.archive.org/32/items/saradaniketanamlibrarygunturbooksset1/Chamatkara%20Nidanamu_Guntupalli%20Gopalakrishna_1910_030%20P_Sarada%20Niketanam%20Guntur%202014.pdf[permanent dead link]