గుండమ్మగారి కృష్ణులు

గుండమ్మగారి కృష్ణులు 1987లో విడుదలైన తెలుగు చలనచిత్రం. రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, రజని,శుభలేఖ సుధాకర్, పూర్ణిమ నటించగా,[1] కె. చక్రవర్తి సంగీతం అందించారు [2][3] ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్‌గా రికార్డ్ చేయబడింది.[4]

గుండమ్మగారి కృష్ణులు
(1987 తెలుగు సినిమా)
దర్శకత్వం రేలంగి నరసింహారావు
తారాగణం రాజేంద్ర ప్రసాద్, రజని, శుభలేఖ సుధాకర్, పూర్ణిమ
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ రాజాలక్ష్మీ ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

కథసవరించు

గుండమ్మ (నిర్మలమ్మ) ధైర్యంగా, ముక్కుసూటిగా ఉండే వృద్ధురాలు. పెద్దా గోపాల కృష్ణ / పెద్దోడు (రాజేంద్ర ప్రసాద్) & చిన్న గోపాల కృష్ణ / చిన్నోడు (సుభలేఖ సుధాకర్) ఆమె మనుమళ్ళు. గుండమ్మ ఇద్దరికీ పెళ్ళి చెయ్యాలని చూస్తుంది. కాని పెద్దోడు అంగీకరించడు. అతను ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటాడు. వధువు, వరుడి తండ్రికి సన్నిహితుడైన గంగాధరం (సుత్తి వీరభద్రరావు) కుమార్తె సరోజ (రజని) యే. తెలియకుండానే సరోజా పెద్దోడి కార్యాలయంలో చేరుతుంది. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడటం ప్రారంభిస్తారు. ఇంతలో, చిన్నోడు తన అమ్మమ్మ చూసిన లక్ష్మి (పూర్ణిమ) అనే గ్రామీణ అమ్మాయిను చూట్టానికి పెళ్ళిచూపులకు వెళ్తాడు. మొదటి చూపులోనే, అతను ఆమెను ఇష్టపడతాడు, ఆమె కూడా అతన్ని ఇష్టపడుతుంది. చివరికి, పెద్దోడితో సంబంధం ఖరారు చేయడానికి గంగాధరం అతడి వద్దకు వెళతాడు. కాని పెద్దోడు అతన్ని అవమానించి బయటకు పంపిస్తాడు. కోపంతో, సరోజ వారి ఇంటికి వెళ్ళి, పొరపాటున, చిన్నోడిని కొడుతుంది. ఆ తరువాత, సరోజ నిజం తెలుసుకుని పెద్దోడును ద్వేషించడం మొదలుపెడుతుంది. వారిద్దరూ గన్ పాపారావు (కోట శ్రీనివాసరావు) అనే వ్యక్తి చేతుల్లో పడతారు. అతడి లక్ష్యం ప్రేమికులకు సహాయం చేయడమే. అతను వారిని ప్రేమికులుగా భావించి, బలవంతంగా వారిని తనతో పాటు తీసుకువెళతాడు. వారిలో ప్రేమ తిరిగి పుంజుకున్నప్పుడు ఏదో ఒకవిధంగా అతని నుండి తప్పించుకుంటారు.

అనేక అడ్డంకులను అపార్థాలనూ తప్పించుకుని ఈ రెండు జంటలూ పెళ్ళిళ్ళు చేసుకోవడమే సినిమా కథ.

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

మూలాలుసవరించు