పూర్ణిమ (నటి)
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
పూర్ణిమ ఒక సినీ నటి. జంధ్యాల దర్శకత్వంలో 1981 లో వచ్చిన ముద్ద మందారం సినిమాతో సినీరంగంలో ప్రవేశించింది.[1] 1981 నుంచి 1988 మధ్యలో తెలుగు, తమిళ, కన్నడ సినిమాలతో కలిపి సుమారు 50 సినిమాల్లో నటించింది.[2]
పూర్ణిమ | |
---|---|
జననం | |
వృత్తి | నటి |
జీవిత విశేషాలు
మార్చుపూర్ణిమ వాళ్ళది చెన్నైలో స్థిరపడ్డ తెలుగు కుటుంబం.[2] పూర్ణిమకు చిన్నప్పటి నుంచి గాయని కావాలని కోరికగా ఉండేది. హరిశ్చంద్రుడు సినిమాలో పాట కోసం వెళ్ళి అనుకోకుండా అందులో చిన్న వేషం వేసింది. ఆ సినిమాలో మహానటి సావిత్రి కూతురుగా నటించింది. పూర్ణిమ తండ్రికి సినిమా రంగం అంటే ఇష్టం లేదు. కానీ జంధ్యాల తదితరులు తమ సినిమాల్లో అసభ్యతకు తావుండదని ధైర్యం చెప్పి ఆమెను ముద్దమందారం సినిమా కోసం ఒప్పించారు.[1]
21 సంవత్సరాల వయసులో వివాహం చేసుకుంది. పెళ్ళైన తరువాత ఆమె కుటుంబం కొద్ది రోజులు చెన్నైలో తరువాత కొద్దిరోజులు విశాఖపట్నంలో ఉన్నారు. ప్రస్తుతం గుజరాత్ లో ఉంటున్నారు.[2] ఆమె ఏప్రిల్ 2014 లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరింది.[3]
నటించిన సినిమాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 పులగం, చిన్నారాయణ. జంధ్యామారుతం 1 (ప్రథమ ed.). హాసం ప్రచురణలు. p. 13.
- ↑ 2.0 2.1 2.2 సునీత చౌదరి, వై. "She's back". thehindu.com. కస్తూరి అండ్ సన్స్. Retrieved 24 September 2016.
- ↑ Telugunow. "Actress Purnima joins YSRCP in Visakhapatnam 0". telugunow.com. Archived from the original on 7 June 2017. Retrieved 24 September 2016.