గుండ అప్పలసూర్యనారాయణ

గుండ అప్పలసూర్యనారాయణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకియ నాయకుడు. ఆయన 1985 నుండి 2004 వరకు శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, రెండు పర్యాయాలు మంత్రిగా పని చేశాడు.[2]

గుండ అప్పలసూర్యనారాయణ
గుండ అప్పలసూర్యనారాయణ


ఎమ్మెల్యే
పదవీ కాలం
1985 - 2004
ముందు తంగి సత్యనారాయణ
తరువాత ధర్మాన ప్రసాదరావు
నియోజకవర్గం శ్రీకాకుళం నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1948 జనవరి 16
శ్రీకాకుళం, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
జీవిత భాగస్వామి గుండ లక్ష్మీదేవి
సంతానం శివ గంగాధర్,[1] విశ్వనాధ్
నివాసం వెలమ వీది , అరసవల్లి , శ్రీకాకుళం పట్టణం
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం మార్చు

గుండ అప్పలసూర్యనారాయణ 1981లో జరిగిన శ్రీకాకుళం మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి కౌన్సిలర్‌గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరి 1985 నుండి 2004 వరకు వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, 1987లో కరువు మంత్రిగా, 1989లో బీసీ, ఎస్సీ, సాంఘిక సంక్షేమ, మహిళా & శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశాడు.[3]

ఎమ్మెల్యేగా పోటీ మార్చు

సంవత్సరం గెలుపొందిన అభ్యర్థి పేరు పార్టీ ప్రత్యర్థి పేరు పార్టీ
2009- 2014 ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్ గుండ అప్పలసూర్యనారాయణ తెలుగుదేశం
2004- 2009 ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్ గుండ అప్పలసూర్యనారాయణ తెలుగుదేశం
1999 - 2004 గుండ అప్పలసూర్యనారాయణ[4] తెలుగుదేశం చల్లా రవికుమార్ కాంగ్రెస్
1994 - 1999 గుండ అప్పలసూర్యనారాయణ తెలుగుదేశం అందవరపు వరహనరసింహం (వరం) కాంగ్రెస్
1989 - 1994 గుండ అప్పలసూర్యనారాయణ తెలుగుదేశం వండాన శేషగిరిరావు కాంగ్రెస్
1985 గుండ అప్పలసూర్యనారాయణ తెలుగుదేశం మైలపిల్లి నరసయ్య కాంగ్రెస్

మూలాలు మార్చు

  1. Eenadu (22 February 2022). "కాలిఫోర్నియా ఎనర్జీ కమిషన్‌ వైస్‌ఛైర్మన్‌గా శివగంగాధర్‌". Archived from the original on 22 February 2022. Retrieved 22 February 2022.
  2. శ్రీకాకుళం రాజకీయ సమాచారము (21 April 2014). "గుండ అప్పలసూర్యనారాయణ". శ్రీకాకుళం రాజకీయ సమాచారము. Archived from the original on 22 February 2022. Retrieved 22 February 2022.
  3. Sakshi (28 March 2019). "ఎగువ సభకు ముగ్గురే ముగ్గురు". Archived from the original on 22 February 2022. Retrieved 22 February 2022.
  4. Sakshi (2 April 2019). "నాగావళి తీరాన.. ఎటువైపో ఓటరన్న..!". Archived from the original on 22 February 2022. Retrieved 22 February 2022. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 29 నవంబరు 2020 suggested (help)