గుజ్జన గూళ్ళు

ఇది కేవలం సంసారపు శిక్షణ ఇచ్చే ఆట. బువ్వాలాట అని కూడా పిలువబడే ఈ ఆటను పూర్వం ఉమ్మడి కుటుంబాల్లో చిన్న పిల్లలు ఆడుకునేవారు. ఈ ఆటలో పిల్లలు ఎందరైనా పాల్గొనవచ్చును. పిల్లలు తమ పెద్దలనడిగి బియ్యము, పప్పులు, మరమరాలు, బెల్లం, పంచదార తెచ్చుకొని తాము ఆడుకొని లక్కపిడతల్లో (చెక్కతో చేయబడిన చిన్న వంట సామాగ్రి) పోసి వాటిని పొయ్యి మీద పెట్టినట్లు, దించినట్లు నటిస్తూ కొంతసేపటికి అందరూ కలిసి తింటారు. ఈ ఆట ఆడినప్పుడు బొమ్మల పెళ్ళి చేసి రెండు జట్లుగా చీలి వియ్యాలవారికి విందు పెట్టుటకై గుజ్జన గూళ్ళు పెట్టుదురు. బాగుగా పండిన చింతకాయలను తెచ్చి నేర్పుతో దానిలోని గుజ్జును గుల్ల చెడకుండా వుండునట్లు పూర్తిగా తీసివేసి, ఆ గుల్లలో బియ్యము పోసి, దానిని మండుచున్న పొయ్యిలోని కుమ్ములోని పెట్టి అవి ఉడికిన తరువాత ఆ పిల్లలు 'గుజ్జన గూళ్ళు' అని వేడుకగా తిందురు. ఈ గుజ్జన గూళ్ళు ఆటను రుక్మిణి, గరిక ఆడినట్లు భాగవతంలోను, మనుచరిత్రలోను వ్రాయబడియున్నది. [1]

లక్కపిడతలు

నేటి పరిస్థితిసవరించు

 
ఆధునిక కిచెన్ సెట్

ఆధునిక విద్య, ఆధునిక ఆటలు, ఉమ్మడి కుటుంబాల విచ్చిన్నం వల్ల ఈ ఆట నేడు దాదాపు పూర్తిగా అంతరించిపోయనది. భారతీయ సంప్రదాయాన్ని, కుటుంబ వ్యవస్థను ప్రతిబంబించే ఈ ఆటను పాశ్చాత్య విష సంస్కృతి ప్రభావానికి గురైన నేటి పిల్లలకు తల్లిదండ్రులు తెలిపరచవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రఖ్యాత రచయిత గాజుల సత్యనారాయణ గారు తన పెద్దబాల శిక్ష పుస్తకంలో గుజ్జన గూళ్ళు గురించి చక్కగా వివరించారు. ఇప్పటికీ బువ్వాలట సామానాన్ని విశాఖపట్నం జిల్లా ఏటికొప్పక గ్రామం వారు తయారుచేస్తారు. బువ్వాలట సామానం నగరాల్లో జరిగే హస్త కళా ప్రదర్శనల్లో అమ్మబడుతుంటాయి.

మూలాలుసవరించు

  1. పెద్దబాల శిక్ష - గాజుల సత్యనారాయణ, వనజ ఆప్ సెట్ ప్రింటర్స్, విజయవాడ