పప్పు
పప్పు లేదా పప్పు కూర ఆంధ్రులు ఎంతో ఇష్టంగా అన్నంలో కలుపుకొని తినే పదార్థం. తెలుగు వారి భోజనంలో తప్పనిసరిగా ఉండేది పప్పు. పప్పు భారతదేశంలో అన్ని ప్రాంతాల వాళ్ళూ వేర్వేరు రకాలుగా చేస్తారు. వివిధ రకాల పప్పు దినుసులకు ఉడికించి రుచికరమైన కూరగా తింటారు. రుచి కోసం చాలా రకాల మసాలా, కూరగాయలు మొదలైన వాటిని చేర్చి అందరికీ నచ్చే విధంగా తయారుచేస్తారు. ఉత్తర హిందుస్థానంలో పప్పు కూరల్ని రొట్టెలు, చపాతీలతో కలిపి తింటారు.
శనగలు, మినుములు, రాజ్మా, కందులు, పెసర్ల వంటివి తరచుగా తింటూనే ఉంటాం. ఇలాంటి పప్పుల్లో, చిక్కుడుజాతి గింజల్లో పీచు, ప్రోటీన్లు దండిగా ఉంటాయి. అందువల్ల ఇవి త్వరగా కడుపునిండిన భావన కలిగిస్తాయి. వెంటనే ఆకలి కాకుండా చూస్తాయి. నెమ్మదిగా జీర్ణమవుతూ రక్తంలోకి చక్కెర వెంటనే విడుదల కాకుండా చేస్తాయి. అంతేకాదు శరీరానికి బలాన్ని ఇవ్వటంతో పాటు జబ్బులను నివారించుకునే శక్తినీ అందిస్తాయి.
రకరకాల పప్పు దినుసులు
మార్చు- కందిపప్పు
- కాబూలీ శెనగలు : వీటిల్లోని పీచు రక్తంలో చక్కెర మోతాదులు స్థిరంగా ఉండేందుకు తోడ్పడుతుంది. అందువల్ల కాబూలీ శనగలను తరచుగా తీసుకుంటే మధుమేహం ముప్పు తగ్గటానికి తోడ్పడతాయి. ఇవి చెడ్డ కొలెస్ట్రాల్‌ను (ఎల్‌డీఎల్), ట్రైగ్లిజరైడ్లను తగ్గిస్తాయి. ఫలితంగా గుండెజబ్బులూ దూరంగా ఉంటాయి. అయితే వీటిని తక్కువ మోతాదులోనే తీసుకోవాలి. అప్పుడే ఎక్కువ లాభాలు.
- రాజ్మా:విషయగ్రహణ శక్తిని పెంపొదించే ఒమేగా3 కొవ్వు ఆమ్లాలు రాజ్మాలో అధికంగా ఉంటాయి. అలాగే క్యాన్సర్‌ను నివారించే యాంటీఆక్సిడెంట్లూ, అల్త్జెమర్స్ బారినపడకుండా చూసే థైమీన్ కూడా దండిగానే ఉంటాయి.
- ఉలవలు:ఇనుము, క్యాల్షియం, మాలిబ్డినమ్ వంటివి ఉలవల్లో దండిగా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్ గుణాలు గల ఫాలీఫెనాల్స్ కూడా ఎక్కువే. ఇవి క్యాన్సర్ల నివారణకు ఉపయోగపడతాయి. యాంటీబోడీలు, స్వీయరోగనిరోధక చర్యల్లో కనిపించే హీమగ్లుటినిన్ కూడా వీటిల్లో కనిపిస్తుంది. ఉలవలు కొలెస్ట్రాల్, కడుపు ఉబ్బరం తగ్గటానికీ తోడ్పడతాయి.
- సోయాబీన్స్:వీటిల్లో మొత్తం తొమ్మిది అమైనో ఆమ్లాలూ ఉంటాయి. ఇవి కండరాల నిర్మాణానికి బాగా తోడ్పడతాయి. ప్రస్తుతం వీటితో తయారుచేసిన పాలు, టోఫూ వంటివీ అందుబాటులో ఉంటున్నాయి. అయితే సోయాబీన్స్ ఉత్పత్తులను పరిమితంగానే తినాలి.
రకరకాల పప్పుకూరలు
మార్చుఉపయోగాలు
మార్చు- కందులు, పెసర్ల వంటి పప్పులు క్యాన్సర్ల బారినపడకుండా కాపాడతాయి.
- తరచుగా పప్పులు తినే మహిళలకు రొమ్ముక్యాన్సర్ ముప్పు తక్కువగా ఉంటున్నట్టు అధ్యయనాల్లో బయటపడింది.
- ప్రోస్టేట్, మలద్వార క్యాన్సర్ల బారినపడకుండా కాపాడుతున్నట్లూ వెల్లడైంది.
- వీటికి రక్తంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణమూ ఉంది.
వండే విధానము
మార్చుపప్పుని వివిధమైన పాత్రలలో వండుతారు, పప్పు వండే విధానాన్ని బట్టి రుచిలో తేడా ఉంటుంది. పూర్వం రాచిప్ప (రాతితో చేసిన చిప్ప) లలో పప్పును వండి తినేవారు, ప్రస్తుతం ఎక్కువగా ఉడకడానికని కుక్కర్ లో వండుతున్నారు. సాధారంగా ఉడికిన పప్పుని కవ్వం గానీ, లేక గట్టి గరిటెను గానీ ఉపయోగించి చిదుముతారు దాని వల్ల రుచి ద్విగుణీకృతమవుతుంది.
ప్రాంతాన్ని బట్టి తేడాలు
మార్చు- గుజరాతీ పప్పు : పలుచగా ఉంటుంది, కొంచెం పంచదార వెయ్యడం వల్ల తియ్యగా ఉంటుంది
- అస్సామీ పప్పు: కారం వెయ్యరు, కాయగూరలు వేయ్యరు (ఉత్త పప్పు అనుకోవచ్చు కానీ పలుచగా ఉంటుంది), ఒక్క మెంతులతో పోపు పెడతారు. అన్ని రకాల పప్పు చేస్తారు. మినపప్పు కూడా పప్పు చేస్తారు.
- బెంగాలి పప్పు: పచ్ ఫోరన్ (అయుదు దినుసులతో) పోపు పెడతారు (ఆ అయిదు: 1. జీల కర్ర 2. మెంతులు 3. శోంపు 4.కాలాజీర (?)5. తెల్ల ఆవాలు) కొంచెం తియ్యగా కూడా (పంచాదార కలిపి) చేస్తారు.
- ఉత్తర భారతంలో పప్పు: చాలా రకాలు ఉన్నాయి, దాల్ మఖనీ, మసాలా పప్పు, మొదలైనవి.
భారతీయ పప్పు ప్రపంచ వంటకాల్లోనే ఉత్తమం
మార్చుభిన్న దేశాల్లో విభిన్న రుచులు చవిచూసిన ఓ బ్రిటన్ రచయిత భారతీయ పప్పుకు సాటి మరే వంటకం లేదంటున్నారు. తన అభిమాన వంటకమైన పప్పును 'లైఫ్ సేవింగ్ డిష్ '(ఎల్ఎస్‌డీ) గా రచయిత సిమోన్ మజుందార్ అభివర్ణిస్తున్నారు. 30 దేశాల్లోని శాకాహార, మాంసాహార వంటకాల్లో ఉత్తమమైన వాటి కోసం అన్వేషించారు. చివరకు భారతీయ పప్పు అత్యుత్తమ వంటకమని తేల్చేశారు. (ఈనాడు19.10.2009)
పప్పుపై సామెతలు జాతీయాలు
మార్చు- పప్పులో కాలెయ్యటం
- పప్పులు ఉడకవు
- సుద్దపప్పులాగా
- పప్పుకూటికి ముందు వెట్టిమూటకు వెనక ఉంటాడు
- అప్పుచేసి పప్పుకూడు
పప్పుమీద పద్యాలు,పాటలు
మార్చు- ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య
ఉండ్రాళ్ళ మీదికీ దండు పంపు
కమ్మని నెయ్యయ్య కడు ముద్ద పప్పయ్య
బొజ్జ నిండా తినుము పొరలుకొనుచు
- పొందూర నొక విప్రుని
విందుకు రాబిలిచి
ఎందెందు ఇష్టమనగా
పప్పందే ఇష్టమని బాపడుబలికెన్
పప్పుకూరలపై వెబ్ సమాచారం
మార్చు- http://www.telugudanam.co.in/vanitala_koesam/vamTalu/vamTalu_page022.htm
- http://nalabhima.blogspot.com/2009/04/blog-post_27.html
- http://telugu.webdunia.com/miscellaneous/cookery/indian/0901/02/1090102057_1.htm
- http://chinthu.wordpress.com/2007/02/21/%E0%B0%B0%E0%B0%BE%E0%B0%97%E0%B0%BF-%E0%B0%AE%E0%B1%81%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A6-%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B2%E0%B0%95%E0%B1%82%E0%B0%B0-%E0%B0%AA%E0%B0%AA%E0%B1%8D%E0%B0%AA%E0%B1%81/
- http://vanta.in/2009/09/05/mudda-pappu/[permanent dead link]
- https://web.archive.org/web/20110106174733/http://shadruchulu.com/telugu/?p=186
- https://web.archive.org/web/20100104100202/http://telugunow.com/index.php/favourite-dishes-cook-easy/2471-chanadal-chicken-curry.html
- http://www.indobase.com/recipes/search.php?keyword=dal&submit=Find+It Archived 2021-10-28 at the Wayback Machine!