గుజ్జుల రామకృష్ణారెడ్డి

గుజ్జుల రామకృష్ణారెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1999లో పెద్దపల్లి నియోజకవర్గం శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించాడు.[1][2]

గుజ్జుల రామకృష్ణారెడ్డి

ఎమ్మెల్యే
పదవీ కాలం
1999 – 2004
ముందు బిరుదు రాజమల్లు
తరువాత గీట్ల ముకుందారెడ్డి
నియోజకవర్గం పెద్దపల్లి నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1961
పెద్దపల్లి జిల్లా, తెలంగాణ రాష్ట్రం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు గోవింద రెడ్డి
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం మార్చు

గుజ్జుల రామకృష్ణారెడ్డి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి ఆరుసార్లు పార్టీకి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు. ఆయన 1999లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పెద్దపల్లి నియోజకవర్గం నుండి టీడీపీ మిత్ర పక్షాల అభ్యర్థిగా బీజేపీ తరపున పోటీ చేసి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి గీట్ల ముకుందారెడ్డి పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.

గుజ్జుల రామకృష్ణారెడ్డి 2004, 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన తెలంగాణ  ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ తరపున రామగుండం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయి, ఐదోసారి 2018లో పెద్దపల్లి నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.[3]

మూలాలు మార్చు

  1. Sakshi (8 November 2018). "పెద్దపల్లి పెద్దన్నలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
  2. Sakshi (14 November 2018). "పాత ప్రత్యర్థుల..కొత్త పోరు." Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
  3. Sakshi (3 December 2018). "లేదు అలుపు.. వరుస గెలుపు..!". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.