రామగుండం శాసనసభ నియోజకవర్గం
రామగుండం శాసనసభ నియోజకవర్గం,పెద్దపల్లి జిల్లాలో ఉన్న 3 శాసనసభ స్థానాలలో ఒకటి.
రామగుండం లో ఎన్.టి.పి.సి., సింగరేణి కోల, తెలంగాణ పవర్ జెన్ కో కంపెనీలు ఉన్నాయి.ఎన్.టి.పి.సి. థర్మల్ పవర్ ద్యారా 2600 మె.వా. కరెంట్ ను, 10 మె.వా. సౌరవిద్యుత్తు ను ఉత్పత్తి చేస్తుంది.రామగుండం పవర్ హౌజ్ థర్మల్ ద్వారా 60 మె.వా. కరెంట్ ను ఉత్పత్తి చేస్తుంది.
నియోజకవర్గంలోని మండలాలుసవరించు
ఇప్పటి వరకు ఎన్నికైన శాసన సభ్యులుసవరించు
సం. | ఎ.సి.సం. | నియోజకవర్గ పేరు | రకం | విజేత పేరు | లింగం | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి | లింగం | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
2018 | 23 | రామగుండం | జనరల్ | కోరుకంటి చందర్ | పు | అల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ | 60,444 | సోమారపు సత్యనారాయణ | పు | తెలంగాణ రాష్ట్ర సమితి | 34,354 |
2014 | 23 | రామగుండం | జనరల్ | సోమారపు సత్యనారాయణ | పు | TRS | 35789 | కోరుకంటి చందర్ | పు | అల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ | 33494 |
2009 | 23 | రామగుండం | జనరల్ | సోమారపు సత్యనారాయణ | పు | స్వతంత్ర | 32479 | కౌశిక హరినాథ్ | పు | ప్రజారాజ్యం | 30259 |
2009 ఎన్నికలుసవరించు
2009 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి మహాకూటమి తరఫున పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ నుంచి మాలమ్ మల్లెషమ్ పోటీచేయగా, కాంగ్రెస్ పార్టీ తరఫున బాబర్ సలీంపాషా, భారతీయ జనతా పార్టీ నుండి బి.వనిత, ప్రజారాజ్యం పార్టీ తరఫున కౌశిక్ హరి, లోక్‌సత్తా పార్టీ తరఫున టి.అనిల్ కుమార్ పోటీచేశారు.[1]
2014 ఎన్నికలుసవరించు
2014 ఎన్నికలలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి సోమారపు సత్యనారాయణ గారు గెలుపొందడం జరిగింది.
2018 ఎన్నికలుసవరించు
2018 తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ టిక్కెట్ పై పోటీచేసిన కోరుకంటి చందర్ తన సమీప అభ్యర్థి సోమారపు సత్యనారాయణ పై 26,090 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 1,35,678 ఓట్లు పోలవగా కోరుకంటి చందర్ కు 60,444 ఓట్లు, టీఆర్ఎస్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణ కు 34,354 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి మక్కాన్‌సింగ్ ఠాకూర్‌కు 26,614 ఓట్లు పోలయ్యాయి.
ఇవి కూడా చూడండిసవరించు
- రామగుండం 2009 ఎన్నికలలొ భాగంగా స్వతంత్ర అభ్యర్థిగా సోమారపు సత్యనారాయణ గారు గెలుపొందడం జరిగింది.
- రామగుండం 2014 ఎన్నికలలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి సోమారపు సత్యనారాయణ గారు గెలుపొందడం జరిగింది.
- రామగుండం 2018 తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో భాగంగా ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ టిక్కెట్ పై పోటీచేసిన కోరుకంటి చందర్ గెలుపొందడం జరిగింది.
ఇవి కూడా చూడండిసవరించు
మూలాలుసవరించు
- ↑ సాక్షి దినపత్రిక, తేది 09-04-2009