గుడు గుడు గుంజం 2010 లో వచ్చిన హాస్య చిత్రం. శ్రీ చిత్ర పతాకంపై వి రవి కుమార్ రెడ్డి నిర్మించాడు.[1] వీరు కే దర్శకత్వం వహించాడు.[2] రాజేంద్ర ప్రసాద్, సితార, కస్తూరి, పార్థు, చాహత్, ఆర్తి ప్రధాన పాత్రధారులు [3] సంగీతం కూడా వీరు కే అందించాడు.[4][5] ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అపజయం పొందింది.[6][7][8]

గుడి గుడి గుంజం
(2010 తెలుగు సినిమా)
తారాగణం ఆర్తి అగర్వాల్, బ్రహ్మానందం, పార్థు
భాష తెలుగు

కథసవరించు

గోపాలం (రాజేంద్ర ప్రసాద్) ఒక ప్రసిద్ధ క్రిమినల్ లాయర్, కానీ అతను భార్య చాటు భర్త. అతని భార్య సీత (సీతారా). వారి కుమారుడు పార్థు (పార్థు) ను గారాబం చేస్తారు. అతడు నిర్లక్ష్యంగా తయారయ్యాడు. పార్థు కాలేజీలో ఒక అమ్మాయిని (ఆర్తీ పూరి) ముద్దు పెట్టుకున్నప్పుడు కథ మలుపు తిరిగుతుంది. బాలిక తల్లి (తెలంగాణ శకుంతల) కోపంతో ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేస్తుంది.. పార్థు బ్యాంకాక్‌కు పారిపోయి అక్కడే మరో అమ్మాయి మీనాక్షి (చాహత్) తో ప్రేమలో పడతాడు. గోపాలం, సీత పెళ్ళికి సరేనంటారు. అంతా సిద్ధమౌతుంది. ఇక్కడ ఆమె మీనాక్షి అత్త మల్లిశ్వరి (కస్తూరి) ను కలుస్తుంది, పార్థు, మీనాక్షి ల పెళ్ళి జరగాలంటే సీత తన భర్త గోపాలాన్ని మల్లీశ్వరి పెళ్ళి చేసుకోవడానికి సీత ఒప్పుకోవాలనే షరతు పెడుతుంది. ఈ పెళ్ళి అవుతుందా? ఆ పెళ్ళి జరుగుతుందా? .

తారాగణంసవరించు

పాటలుసవరించు

సంఖ్య. పాటగాయనీ గాయకులు నిడివి
1. "మహి మహి"  రవివర్మ, ప్రణవి 4:07
2. "నిన్నిలా ఎప్పుడూ"  రఘు, సునిత 4:34
3. "రాయే రాయే"  రవివర్మ 3:40
4. "దోర వయసు చిన్నది"  రఘు, పద్మలత 3:31
5. "ప్రేమించారా"  రఘు, ప్రణవి 3:55
6. "జిగిబిగి చముకుల"  విశ్వ, మంజు 3:13
మొత్తం నిడివి:
23:00

మూలాలుసవరించు

  1. Gudu Gudu Gunjam (Banner). Bharat Movies.com.
  2. Gudu Gudu Gunjam (Direction). Indiaglitz.
  3. Gudu Gudu Gunjam (Cast & Crew). gomolo.com.
  4. Gudu Gudu Gunjam (Music). 123 telugu.com.
  5. Gudu Gudu Gunjam (Remarks). fullhyd.com.
  6. Gudu Gudu Gunjam (Movie View). Filmibeat.
  7. Gudu Gudu Gunjam (Running). Now Running.com.
  8. Gudu Gudu Gunjam (Review). The Cine Bay.