ఆర్తీ అగర్వాల్

(ఆర్తి అగర్వాల్ నుండి దారిమార్పు చెందింది)

ఆర్తీ అగర్వాల్ (మార్చి 5, 1984 - జూన్ 6, 2015) [1] తెలుగు సినిమా నటీమణి.

ఆర్తీ అగర్వాల్
AARTHI AGARWAL.jpg
జననం(1984-03-05)1984 మార్చి 5
అమెరికాలోని అట్లాంటిక్ సిటీ న్యూజెర్సీ
మరణం2015 జూన్ 6(2015-06-06) (వయసు 31)
అమెరికాలోని అట్లాంటిక్ సిటీ న్యూజెర్సీ[1]
గుర్తించదగిన సేవలు
నందిని నువ్వు నాకు నచ్చావ్
జీవిత భాగస్వామిఉజ్వల్‌ నికమ్ (నవంబర్ 12, 2007),

జననంసవరించు

అమెరికాలో స్థిర పడిన ఒక గుజరాతీ కుటుంబములో న్యూజెర్సీలో జన్మించింది. తల్లిదండ్రులు వీమా అగర్వాల్, కౌశిక్ అగర్వాల్. కౌశిక్ అగర్వాల్‌ ఆమెరికాలో స్థిరపడిన వ్యాపారవేత్త. ఆర్తీకి 14 ఏళ్ల వయసున్నప్పుడే న్యూజెర్సీకి వెళ్లి సెటిల్ అయ్యారు.

సినీరంగ ప్రవేశంసవరించు

14 సంవత్సరాల వయసులో మొదట మోడలింగ్‌రంగంలోకి ప్రవేశించింది. ఫిలడెల్ఫియా లోని ఓ స్టేజ్‌ షోలో డాన్స్ చేయడానికి హీరో సునీల్‌శెట్టి ఆమెను ఆహ్వానించారు. ఆ కార్యక్రమానికి బిగ్‌ బీ అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో ఆర్తీ అగర్వాల్‌ డాన్స్ చూసి ముచ్చటపడిన బిగ్‌ బీ, ఆమెను బాలీవుడ్‌లో యాక్ట్ చేయడానికి ప్రోత్సహించారు. తను భవిష్యత్‌లో మంచి నటి అవగలదని, ఆర్తీ తండ్రిని ఒప్పించారు. అలా ఆర్తీ ముంబాయ్ కి వచ్చి, నట శిక్షణాలయంలో చేరింది. 2001వ సంవత్సరంలో బాలీవుడ్‌లో పాగల్‌పాన్‌ సినిమాలో అవకాశం ఇప్పించారు. ఈ సినిమాలో ఆర్తీ అద్భుతంగా నటించి, అందరి మెప్పు పొందింది.

తెలుగు సినిమాల్లోకిసవరించు

ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు నిర్మించిన నువ్వు నాకు నచ్చావ్ చిత్రం ద్వారా తెలుగు సినీరంగానికి కథానాయికగా పరిచయమయింది. ఈ చిత్రంలో కథానాయకుడు వెంకటేష్. ఆ సినిమా ఘన విజయం సాధించి ఆమెకి తెలుగులో మంచి గుర్తింపు తెచ్చింది. తెలుగు సినీరంగంలో 2000 దశకంలో అగ్ర కథానాయకులుగా భావించబడిన చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున ల సరసన నటిండమ కాక యువతరం కథానాయకులైన మహేష్ బాబు, జూనియర్ ఎన్టీయార్, ప్రభాస్, రవితేజ,ఉదయ్ కిరణ్, తరుణ్ లతో నటించిన ఘనత ఆర్తీకి దక్కింది. బి.గోపాల్ దర్శకత్వంలో వరుసగా నాలుగు సినిమాలలో నటించింది (చివరిది అతిథి పాత్ర). వెంకటేష్ సరసన నటించిన మూడు చిత్రాలు నువ్వు నాకు నచ్చావ్, వసంతం, సంక్రాంతి ఘనవిజయం సాధించాయి.

చిరంజీవితో ఆమె నటించిన ఇంద్ర చిత్రం ఆర్తిని అగ్రతారగా నిలబెట్టింది. ప్రిన్స్ మహేష్‌తో బాబీ.. బాలయ్యతో పల్నాటి బ్రహ్మ నాయుడు.. విక్టరీ వెంకటేష్‌తో వసంతం.. రవితేజతో వీడే.. నాగార్జునతో నేనున్నాను.. ప్రభాస్‌తో అడవిరాముడు.. జూనియర్ ఎన్టీఆర్‌తో నరసింహుడు.. సునీల్‌తో అందాలరాముడు, రాజశేఖర్తో గోరింటాకు, వేణుతో దీపావళి, జెంటిల్‌మెన్‌ తదితర చిత్రాలు ఆమెను తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ చేశాయి.

తెలుగులో సుమారు 50కి పైగా సినిమాల్లో నటించింది.

ఇతర భాష సినిమాలుసవరించు

తమిళనాట కూడా ఆర్తీ తెరంగ్రేటం చేసి, బంబ్రా కన్నాలై చిత్రంతో తమిళ అభిమానులను సంపాదించుకుంది. అలరించింది. ఇలా తెలుగు, హిందీ, తమిళం చిత్రాల్లో నటించి అలరించింది.

వ్యక్తిగత జీవితముసవరించు

2005, మార్చి 23న క్లీనింగ్ కెమికల్ త్రాగి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో యువహీరో తరుణ్‌తో సంబంధం ఉన్నట్టుగా వస్తున్న వదంతులతో విసిగి ఆ పనిచేసినట్టు ఆర్తీ చెప్పింది.[2] 2006 ఫిబ్రవరి 15లో అనుమానాస్పద పరిస్థితుల్లో మెట్లపై నుండి జారిపడి ఆర్తి ఆసుపత్రి పాలైంది. 2007, నవంబరు 22 న ఆర్తీ రాణీగంజ్‌లోని ఆర్యసమాజంలో న్యూజెర్సీకి చెందిన గుజరాతీ ప్రవాసభారతీయుడు ఉజ్వల్‌ నికమ్ ను వివాహమాడింది. వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకున్నారు. వివాహం తర్వాత అమెరికాలో కొంతకాలం ఉండి తిరిగి తెలుగు సినిమా రంగంలో రెండవ అంకాన్ని ప్రారంభించడానికి వచ్చింది. ఆర్తీ చెల్లెలు అదితి కూడా తెలుగు సినిమాలలో నటిగా అల్లు అర్జున్ చిత్రం గంగోత్రితో పరిచయమైంది.

సెకండ్ ఇన్నింగ్సవరించు

పెళ్లయ్యాక కొన్ని సినిమాలు చేసినా అవి పెద్దగా ఫలితాల్ని ఇవ్వలేదు. ‘జంక్షన్ లో జయమాలిని’, ‘ఆమె ఎవరు ?’ సినిమాలు అంగీకరించింది. 2015 జూన్ 5న ఆర్తీ నటించిన ‘రణం 2’ విడుదలయింది. ‘ఆపరేషన్ గ్రీన్ హంట్’ విడుదలకావాల్సివుంది.

మరణంసవరించు

గత కొంతకాలంగా స్థూలకాయం, శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్న ఆర్తీ చికిత్సకోసం అమెరికా వెళ్లి అక్కడే చికిత్స తీసుకున్నది. 2015 జూన్ 4న అమెరికాలోని అట్లాంటిక్ సిటీలో లైపోసక్షన్ సర్జరీ చేయించుకుంది. చికిత్స వికటించడంతో గుండెపోటు వచ్చి ఇన్ ఫెక్షన్ తలెత్తడంతో ఎగ్ హార్బర్ టౌన్ షిప్ లోని తన స్వగృహంలో అనూహ్యంగా జూన్ 6, 2015 న కన్ను మూసింది.

మరణ కారణంసవరించు

హీరోయిన్ ఓరియెంటెడ్ "జంక్షన్‌లో జయమాలిని" చిత్రం కోసం బరువు తగ్గడానికి ఆర్తి చేసిన ప్రయత్నమే ఆమె ప్రాణాలమీదకు తెచ్చింది. ఈ సినిమాలో డ్యూయెల్ రోల్‌ ఉండగా, ఒక పాత్రలో మాస్ ఇమేజ్ కోసం ఆర్తి వెయిట్ తగ్గాల్సివచ్చింది. అప్పటికి 89 కేజీల బరువున్న ఆర్తి 63 కేజీలకు తగ్గింది. మరో మూడు కేజీల బరువు తగ్గడం కోసం లైపో సెక్షన్ చేయించుకోవడానికి ఆమె తన జన్మస్థలమైన అమెరికాలోని న్యూజెర్సీ నగరానికి వెళ్లింది.[3]

నటించిన చలన చిత్రాలుసవరించు

తెలుగుసవరించు

హిందిసవరించు

మూలాలుసవరించు

  1. 1.0 1.1 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-05. Retrieved 2015-06-06.
  2. Actress Aarti Agarwal attempts suicide? Archived 2009-05-17 at the Wayback Machine The Hindu మార్చి 24, 2005
  3. జయమాలిని కోసం మరో 3 కేజీలు తగ్గే ప్రయత్నంలో.. Archived 2015-06-11 at the Wayback Machine ఆంధ్రజ్యోతి శనివారం, జూన్ 6, 2015

బయటి లింకులుసవరించు