గుడ్ నైట్ 2023లో విడుదలైన తమిళ సినిమా. మిలియన్ డాలర్ స్టూడియోస్,ఎమ్మార్పీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై యువరాజ్ గణేశన్, మహేశ్ రాజ్ పసిలన్, నజీరత్ పసిలన్ నిర్మించిన ఈ సినిమాకు వినాయక్ చంద్రశేఖరన్ దర్శకత్వం వహించాడు. కె. మణికంఠన్, మీతా రఘునాథ్, రమేశ్ తిలక్, రేచల్ రెబకా, బాలాజీ శక్తివేల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మే 12న విడుదలై, జులై 3 నుండి డిస్నీ+హాట్‌స్టార్‌లో నుంచి తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[1][2]

గుడ్ నైట్
దర్శకత్వంవినాయక్ చంద్రశేఖరన్
రచనవినాయక్ చంద్రశేఖరన్
నిర్మాత
  • యువరాజ్ గణేశన్
  • మహేశ్ రాజ్ పసిలన్
  • నజీరత్ పసిలన్
తారాగణం
  • కె. మణికంఠన్
  • మీతా రఘునాథ్
  • రమేశ్ తిలక్
  • రేచల్ రెబకా
  • బాలాజీ శక్తివేల్
ఛాయాగ్రహణంజయంత్ సేతుమాధవన్
కూర్పుభరత్ విక్రమన్
సంగీతంసీన్ రోల్డన్
నిర్మాణ
సంస్థలు
మిలియన్ డాలర్ స్టూడియోస్
ఎమ్మార్పీ ఎంట‌ర్‌టైన్‌మెంట్
పంపిణీదార్లుశక్తి ఫిలిం ఫ్యాక్టరీ
విడుదల తేదీ
2023 మే 12 (2023-05-12)
దేశంభారతదేశం
భాషతమిళ్

కథ మార్చు

మోహన్  సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తుంటాడు. అతడిది నిద్రపోయాడంటే గురక పెట్టె అలవాటుంది. ఒక రోజు తన బావతో కలిసి పని మీద ఓ ఇంటికి వెళ్లగా అక్కడ అను (మీతా రఘునాథ్)ను చూసి ఇష్టపడి ఆ తరువాత ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. అయితే పెళ్ళైన తరువాత మెుదటి రాత్రి రోజు అనుకు మోహన్ గురకం విషయం అర్థమవుతుంది. ఈ క్రమంలో మోహన్ పెట్టే గురకకు అనుకు నిద్రపట్టక ఆరోగ్యం కూడా పాడవుతుంది. గురక సమస్య తగ్గించుకేనేందుకు మోహన్ ఏం చేశాడు? గురక సమస్యతో మోహన్ కు వచ్చిన కష్టాలేంటి ? ఆ తరువాత ఏమి జరిగింది అనేదే మిగతా సినిమా కథ.[3]

నటీనటులు మార్చు

  • కె. మణికంఠన్
  • మీతా రఘునాథ్
  • రమేశ్ తిలక్
  • రేచల్ రెబకా
  • బాలాజీ శక్తివేల్
  • భగవతి పెరుమాళ్
  • రైచల్ రెబెకా
  • కౌసల్య నటరాజన్
  • ఉమా రామచంద్రన్
  • నిఖిల శంకర్
  • జగన్ కృష్ణన్
  • ప్రియలయ
  • శ్రీ ఆర్తీ
  • శైవం కల
  • వినాయక్ చంద్రశేఖరన్ (అతిధి పాత్ర)

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: మిలియన్ డాలర్ స్టూడియోస్,ఎమ్మార్పీ ఎంట‌ర్‌టైన్‌మెంట్
  • నిర్మాత: యువరాజ్ గణేశన్, మహేశ్ రాజ్ పసిలన్, నజీరత్ పసిలన్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వినాయక్ చంద్రశేఖరన్
  • సంగీతం: సీన్ రోల్డన్
  • సినిమాటోగ్రఫీ: జయంత్ సేతుమాధవన్
  • ఎడిటింగ్ : భారత్ విక్రమన్

మూలాలు మార్చు

  1. TV9 Telugu (3 July 2023). "కడుపుబ్బా నవ్వించే గురక.. ఓటీటీలోకి వచ్చేసిన 'గుడ్‌ నైట్‌'.. తెలుగు వెర్షన్‌ ఎక్కడ చూడొచ్చంటే?". Archived from the original on 12 July 2023. Retrieved 12 July 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. A. B. P. Desam (22 June 2023). "నవ్వించే గురక - ఓటీటీలోకి వచ్చేస్తున్న తమిళ మూవీ 'గుడ్ నైట్', తెలుగులోనూ స్ట్రీమింగ్!". Archived from the original on 12 July 2023. Retrieved 12 July 2023.
  3. Eenadu (3 July 2023). "రివ్యూ: గుడ్‌నైట్‌.. హీరో గురక.. ఎలాంటి సమస్యలు తెచ్చింది?". Archived from the original on 12 July 2023. Retrieved 12 July 2023.

బయటి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=గుడ్_నైట్&oldid=3930614" నుండి వెలికితీశారు