గుబ్బల రాంబాబు సమాజ సేవకుడు. ఆయన "స్వర్ణాంధ్ర సేవాసంస్థ" స్థాపకుడు. ఆయన "స్వర్ణాంధ్ర రాంబాబు"గా సుప్రసిద్ధులు.[1] ఆయన స్వర్ణాంధ్ర వృద్ధుల కేంద్రం నిర్వాహకుడు.[2]

జీవిత విశేషాలు

మార్చు

సంస్థ పేరే ఇంటి పేరుగా పిలవబడే వ్యక్తులు చాలామంది వుంటారు. అందులో గుబ్బల రాంబాబు ఒకరు. స్వర్ణాంధ్ర కల్చరల్ అసోసియేషన్ నెలకొల్పి బహుముఖాలుగా సేవలందిస్తున్న రాంబాబు స్వర్ణాంధ్ర రాంబాబు అయ్యారు.ఎన్నో సేవాకార్యక్రమాలు చేపట్టి, పలు అవార్డులు, ప్రశంసాపత్రాలు అందుకున్నారు. డాక్టరేట్ కూడా పొందారు. లయన్స్ క్లబ్ రాజమండ్రి అధ్యక్షులుగా కూడా వ్యవహరిస్తున్నారు. బహుముఖ సేవలతో స్వర్ణాంధ్ర సేవా సంస్థను నడుపుతున్నారు.

పాత్రికేయ రంగం నుంచి

మార్చు

రాంబాబు పాత్రికేయ రంగంలో విలేకరిగా కొన్నాళ్ళు పనిచేసి, అక్కడ నుంచి జీవిత బీమా సంస్థలో ఉద్యోగిగా ప్రవేశించి, విధి నిర్వహణలో మంచి పేరు తెచ్చుకుంటూ, మరోపక్క సేవా లక్షణాన్ని పుణికి పుచ్చుకున్నారు. కొంతమంది మిత్రులతో కల్సి, "తోటి వారికి సాయం చేయండి - సమాజ సేవలో భాగస్వాములుగా చేరండి" అనే నినాదంతో 1998లో స్వర్ణాంధ్ర సేవా సంస్థ స్థాపించారు. తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామమూర్తి నాయుడు, సినీ నటుడు సుమన్, వంటి ప్రముఖులు ఈసంస్థలో గౌరవ సలహాదారులుగా వ్యవహరిస్తూ, భాగస్వామ్యం కలిగి ఉన్నారు.వికలాంగులకు మూడు చక్రాల సైకిళ్ళు, వృద్దులకు దుప్పట్ల- పేద విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ వంటి కార్యక్రమాలు స్వర్ణాంధ్ర ద్వారా రాంబాబు చేపట్టారు.

సేవా కార్యక్రమాలెన్నో

మార్చు

సంస్థ ద్వారా 200కి ఫైగా వైద్యశిబిరాలు, 60వరకు రక్తదానశిబిరాల నిర్వహణతో పాటు దోమల నివారణకు లెట్రిన్ గొట్టాలకు నెట్ లు కట్టడం వంటి కార్యక్రమాలు చేసారు. 2003 పుష్కరాలలో సేవలు అందించి, రాష్ట్ర ప్రభుత్వ ప్రశంసాపత్రం అందుకున్నారు. 2005లో ఆనాటి కలక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి చేతులమీదుగా రిపబ్లిక్ డే పురస్కారం, 2006 ఆగస్టు 15న మంత్రి గొల్లపల్లి సూర్యారావు నుంచి ప్రశంసాపత్రం, 2008లో నెహ్రూ యువక కేంద్రం ద్వారా జిల్లా కలక్టర్ చే అవుట్ స్టాండింగ్ బ్లడ్ డోనార్ అవార్డ్, 2009లో హైదరాబాద్ లంకా ఆర్ట్స్ ధియేటర్ సేవా సత్కారం, 2010లో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ నుంచి ఎన్ టి ఆర్ ట్రస్ట్ సేవా పురస్కారం, అదే ఏడాది డా బి ఆర్ అంబేద్కర్ జాతీయ ఫెలోషిప్ అవార్డ్, 2012లో కృషి అవార్డ్ అందుకున్నారు. ఇంకా పలు పురస్కారాలు, సత్కారాలు పొందారు.

స్వర్ణాంధ్ర డే-కేర్ సెంటర్

మార్చు

సేవకు హద్దు లేదన్న ఉద్దేశంతో ఎటువంటి ఆదరణకు నోచుకోని వృద్దులకు సేవ చేయాలన్న సంకల్పంతో రాజమండ్రి లాలాచెర్వులో వృద్దుల మధ్యాహ్న భోజన కేంద్రం (స్వర్ణాంధ్ర డే-కేర్ సెంటర్) 2007 ఫిబ్రవరి 3న నెలకొల్పి, మధ్యాహ్న భోజనం దాతల సహకారంతో అందిస్తున్నారు. 32మందితో ప్రారంభమైన ఈ కేంద్రంలో రేషన్ కార్డు, పెన్షన్ సౌకర్యం లేని 100మందికి ఫైగా వృద్దులు భోజన సదుపాయం పొందుతున్నారు. అలాగే సాయంత్రం పూట కేరేజ్ కూడా ఇస్తున్నారు.

కుట్టు శిక్షణ, విద్యాకేంద్రం

మార్చు

స్వర్ణాంధ్ర సంస్థ సభ్యులు, దాతల సహకారంతో నిరంతరాయంగా కొనసాగుతున్న నేపథ్యంలో 2010 ఏప్రియల్ 17న స్వర్ణాంధ్ర ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ఏర్పాటుచేసి, వందలాది మందికి టైలరింగ్, డ్రెస్ మేకింగ్ లలో శిక్షణ ఇచ్చి, సర్టిఫికేట్ అందజేశారు. అలాగే 2010 ఏప్రియల్ 14న స్థానికంగా వుండే చిన్నారుల కోసం ఉచిత విద్యాకేంద్రం కూడా ఏర్పాటు చేసి, పుస్తకాలు, పెన్నులు, దుస్తులు, ప్రతిరోజూ స్నాక్స్ అందించి, టీచర్ ద్వారా ట్యూషన్ చెప్పిస్తున్నారు. బహుముఖంగా సేవలందిస్తున్న స్వర్ణాంధ్ర సంస్థలో పుట్టిన రోజు- పెళ్ళిరోజు వేడుకలు; అలాగే పెద్దల సంస్మరణ పురస్కరించుకుని దాతలు చేయూత అందిస్తున్నారు.[3]

డాక్టరేట్ స్వీకారం

మార్చు

వృద్ధాశ్రమం ద్వారా సేవలందిస్తున్న రాంబాబు 2016 ఆగస్టు 15న అయోగా ఇంటర్నేషనల్‌ లూసియాన్‌ అమెరికాకు అనుబంధ సంస్థ ఎన్‌ఎల్‌టి యూనివర్సిటీ హైదరాబాద్‌ ద్వారా ఇంటర్నేషనల్‌ డాక్టరేట్‌ను అందుకున్నారు. ఎన్‌ఎల్‌టి యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్‌ డే - డాక్టరేట్స్‌ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో చాన్సలర్‌ డా|| జోసెఫ్‌ పలంగి చేతుల మీదుగా రాంబాబుకు డాక్టరేట్‌ పత్రాన్ని, మెమొంటో అందించారు. అనాధలు, వృద్ధులు, వికలాంగులు, మహిళల అభివృద్ధి, సంక్షేమంతో పాటు రాంబాబు తన సామాజిక సేవల ద్వారా సమాజాన్ని చైతన్య చేస్తున్నారని యూనివర్సిటీ ప్రతినిధులు ప్రశంసించారు. మొత్తానికి స్టెతస్కోప్ పట్టకపోయినా సేవలో నాడీపట్టి డాక్టర్ అయ్యారని పలువురు కితాబిచ్చారు.

పురస్కారాలు

మార్చు
  • రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి రోటరీ ప్రతిభా సేవా పురస్కారం.[4]

మూలాలు

మార్చు

ఇతర లింకులు

మార్చు