గుమ్మడి టేకు ఒక విధమైన ఔషధ చెట్టు. ఇది భారతదేశం, ఆగ్నేయాసియా, చైనా, సియెర్రా లియోన్ , నైజీరియాలో వీటి పెరుగుదల ఉంటుంది. గుమ్మడి టేకు చెట్టు సుమారు 30 మీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. ముదురు, , పసుపు రంగులో ,తియ్యగా ఉంటుంది. పువ్వులు కూడా తింటారు. జ్వరం, గోనేరియా, దగ్గు, గాయాలు, పూతల, కుష్టు వ్యాధి , రక్త వ్యాధుల చికిత్సలో మొక్కల భాగాలను ఉపయోగిస్తారు. రక్త శుద్ధీకరణ కు తోడ్పడుతుంది. పర్యాయ పరముగా చూస్తే అడవులను పునరుద్ధరించడానికి అటవీ నిర్మూలన కార్యక్రమాలలో నాటవచ్చు. గుమ్మడి టేకు చెట్టు ఆకులు పశువులకు ,పట్టు పురుగుకుఆహరం లో వాడతారు. గుమ్మడి చెట్టు కలప నాణ్యత, బరువు తక్కువగా ఉంటుంది, చాలా బలంగా ఉంటుంది. పువ్వులు తేనెటీగలు, కీటకాలు పరాగసంపర్కం చేస్తాయి. మొక్క స్వీయ సారవంతమైనది కాదు,ఇసుక భారీ (బంకమట్టి) నేలలు, బాగా ఎండిపోయిన మట్టి లో, నిస్సార వంతమైన నేలలో పెరుగుతాయి.తేలికపాటి అడవులలో(నీడ) లో పెరుగుతుంది. ఈ మొక్క బలమైన గాలులను తట్టుకోగలదు. ఈ మొక్క ఉష్ణమండల , ఉపఉష్ణమండలాలలో పొడి నుండి తడి ప్రాంతాలలో రాగలదు. ఇక్కడ ఇది 2,100 మీటర్ల ఎత్తులో ఉంటుంది , పగటి ఉష్ణోగ్రతలు 22 - 34 ° c పరిధిలో ఉన్న ప్రాంతాలలో పెరుగుతుంది, కానీ 16 - 46 ° c ఉష్ణోగ్రతను కూడా తట్టుకోగలదు [1]

గుమ్మడి టేకు
Gmelina arborea tree plantation
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Species:
G. arborea
Binomial name
Gmelina arborea
Roxb.

భారత దేశం లో గుమ్మడి టేకు తూర్పు ఉప-హిమాలయ మార్గంలో, బెంగాల్ , అస్సాంలోని హిమాలయ మార్గంలోని తేమ ప్రాంతాలు ,మధ్య భారతదేశంలోని పొడి ప్రాంతాలలో మనకు ఈ చెట్లు కనబడతాయి. గుమ్మడి టేకు మొలకల మూల భాగాన్ని ఆరునెలల వరకు నాటి , తరువాత భూమి లో నాటడం మొదటి సంవత్సరంలో కలుపు తీయవలెను . చల్లని వాతావరణం లో ఆకులు కొమ్మలను తొలగించాలి [2]

టేకు కలప (టెక్టోనా గ్రాండిస్) కు ప్రత్యామ్నాయంగా గుమ్మడి చెట్టును ఉపయోగించవచ్చు. గుమ్మడి టేకు చెట్టును వాణిజ్య పరముగా చూస్తే ఎకరానికి 400-600 చెట్లు వేయడం. దీనిని 8-10 సంవత్సరాలలో పండించవచ్చు . ఇది 8-10 సంవత్సరాలలో ఎకరానికి సుమారు 500 మొక్కల కు దాదాపు Rs.40,00,000/- రాబడిని ఇస్తుంది [3]

గుమ్మడి టేకు ఉపయోగములు అటవీ సంరక్షణ, మందులలో

  • ఆకులు , మూలాలు ఆల్కలాయిడ్ల కలిగి ఉంటాయి మొక్కలను మందుల తయారీకి ఉపయోగిస్తారు.
  • గుమ్మడి టేకు పండు,చెట్టు బెరడులు పిత్త జ్వరం వాటిలో వాడటం.
  • రక్తము శుద్ధి కావటంలో వాడటం,గోనోరియా, దగ్గుకు, గాయాలు పూతలకి ఆకు ఉపయోగపడుతుంది.
  • కుష్ఠురోగం , రక్త వ్యాధుల చికిత్సకు పువ్వులు ఉపయోగిస్తారు.
  • అటవీ నిర్మూలన కార్యక్రమాలకు గుమ్మడి చెట్లు అనువైన ఎంపిక ఎందుకంటే స్థానిక అడవులను పునరుద్ధరించడానికి అటవీ నిర్మూలన ప్రాజెక్టులలో ఉత్తర థాయ్‌లాండ్‌లో వాడతారు. అడవులలో, బహిరంగ ( ఖాళీ ) ప్రదేశాలలో వివిధ జాతుల చెట్ల కలయికతో వేస్తారు. ఇవి వేగంగా పెరిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి, దట్టమైన, కలుపును అణచివేసే చెట్టు. ఫర్నిచర్, ప్లైవుడ్ తేలికపాటి నిర్మాణం కోసం కలప తయారీ గుమ్మడి టేకు పనికి వస్తుంది.. ఇది పడవలు, సంగీత వాయిద్యాలు, చిత్రాలను చెక్కడానికి కూడా వాడతారు.కలప మంచి గుజ్జును మంచి పేపర్ తయారీకి వాడతారు [4]

మూలాలు

మార్చు
  1. "Gmelina arborea Gmelina, Snapdragon, White Teak PFAF Plant Database". pfaf.org. Retrieved 2020-09-06.
  2. "Forestry :: Timber Tree Species". agritech.tnau.ac.in. Retrieved 2020-09-06.
  3. Sasi (2011-09-17). "Gmelina Arborea ( Kumil, White teak, Gamar) | Innovative farming solutions". Gmelina Arborea ( Kumil, White teak, Gamar) | Innovative farming solutions. Retrieved 2020-09-08.
  4. "Gmelina arborea - Useful Tropical Plants". tropical.theferns.info. Archived from the original on 2020-09-21. Retrieved 2020-09-08.