లామియేసి
లామియేసి (Lamiaceae) కుటుంబములో సుమారు 180 ప్రజాతులు, 3,500 జాతుల మొక్కలు ఉన్నాయి. ఇవి ఎక్కువగా ఉష్ణ, సమశీతోష్ణ మండలాలఓ విస్తరించి ఉన్నాయి. భారతదేశంలో 64 ప్రజాతులు, 400 జాతులను గుర్తించారు.
మింట్ కుటుంబం | |
---|---|
Lemon balm (Melissa officinalis) | |
Scientific classification | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | |
Family: | లామియేసి |
ప్రజాతి | |
Many, see text Ref: Watson and Dallwitz |
కుటుంబ లక్షణాలు
మార్చు- గుల్మాలు, శాఖీయ భాగాలు కేశాలతో కప్పబడి ఉంటాయి.
- కాండము నలుపలకలుగా ఉంటుంది.
- సువాసన గల లఘుపత్రాలు, అభిముఖ డెకుసేట్ పత్ర విన్యాసము.
- థైర్పస్ లేదా వర్టిసిలాస్టర్ పుష్ప విన్యాసము.
- పాక్షిక సౌష్టవ యుతము, అండకోశాధిస్థిత పుష్పాలు.
- రెండు పెదవులుగా చీలిన ఆకర్షణ పత్రావళి.
- ద్విదీర్ఘ, మకుట దళోపరిస్థిత కేసరాలు.
- ద్విఫలదళ, సంయుక్త అండాశయము.
- పీఠ అండాన్యాసము.
- పీఠ సంబంధ కీలము.
- కార్సెరూలస్ ఫలము.
ఆర్ధిక ప్రాముఖ్యత
మార్చుఈ కుటుంబములోని అనేక మొక్కల నుండి సుగంధ తైలం లభిస్తుంది.
- రోస్ మెరినస్ అఫిసినాలిస్ నుండి రోస్ మేరి తైలం తయారుచేస్తారు.
- లావెండ్యులా పుష్పాలు, పత్రాల నుండి లావెండరు నూనెను తీస్తారు. దీనిని సబ్బులు, తలనూనెలు, పౌడరుల తయారీలో ఉపయోగిస్తారు.
- మెంథా జాతుల నుండి మింట్ తైలం లభిస్తుంది. దీనిని పిప్పర్ మింట్ లలోను, పౌడరులలోను, మందుగాను వాడతారు.
- సాల్వియా జాతుల నుండి సేజ్ తైలం లభిస్తుంది.
- థైమస్ వల్గారిస్ నుండి థైమాల్ లభిస్తుంది. దీనిని టూత్ పేస్టుల తయారీలో వాడతారు.
- కొన్ని మొక్కలు మందు మొక్కలుగా ఉపయోగపడతాయి. తులసి ఆకులను దగ్గు, జలుబు నివారణకు ఉపయోగిస్తారు.
- పుదీనా ఆకును ఆకు కూరగా వాడతారు.
- చాలా జాతులను సాల్వియా, కోలియస్, లావెండ్యులా జాతులను తోటలలో అందం కోసం పెంచుతారు.
ముఖ్యమైన మొక్కలు
మార్చు- ఆసిమమ్ (Ocimum) - తులసి
- ల్యూకాస్ (Leucas) - తుమ్మి
- లావెండ్యులా (Lavendula) - లావెండర్ మొక్క
- కోలియస్ (Coleus) :
- కోలియస్ ఆరోమాటికస్ - వాము ఆకు
- కోలియస్ బ్లూమై - నెమలి పింఛము
- లియోనైటిస్ ఆక్సిల్లారిస్ - రణభేరి
- సాల్వియా (Salvia) - సేజ్
- మెంథా (Mentha) - పుదీనా
- విటెక్స్ (Vitex) :
- విటెక్స్ నెగుండొ - సింధువార/వావిలి
- విటెక్స్ ట్రైఫోలియా - నీరువావిలి
- గుమ్మడి టేకు
- ఓరిగేనమ్ మజొరానా - మరువము
- పాషాణ భేది
- హిప్టిస్ (Hyptis) :
- హిప్టిస్ సువియోలెన్స్ - సీమ తులసి
- హిస్సాపస్ (Hyssopus) - హిస్సాప్