గుమ్మడి నర్సయ్య

(గుమ్మడి నరసయ్య నుండి దారిమార్పు చెందింది)

సిపిఐ (ఎంఎల్ - న్యూ డెమోక్రసీ) పార్టీకి ప్రాతినిధ్యం వహించిన ఏకైక శాసనసభ సభ్యుడు గుమ్మడి నరసయ్య . పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుండే సిపిఐ (ఎంఎల్ - న్యూ డెమోక్రసీ) పార్టీ తన వైఖరిని మార్చుకుని మొదటిసారిగా 1983లో ఇల్లెందు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసింది. పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తూ గుమ్మడి నరసయ్య ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఐదు సార్లు గెలుపొందారు. టేకులగూడెం గ్రామ ప్రజలు తమ గ్రామాన్ని వైరా నియోజకవర్గంలోకి మార్చడం పట్ల నిరసన ప్రకటించి ఎన్నికలను బహిష్కరించారు. పదవిలో ఉన్నంతకాలం బస్సు, ట్రైన్ లో హైదరాబాద్ వచ్చి విద్యానగర్ లోని పార్టీ ఆఫీసులో పండుకుని ఆటోలో అసెంబ్లీకి వచ్చేవాడు.. కానీ ఈయనెప్పుడూ పబ్లిసీటీ చేసుకోలేదు. గెలిచిన అయిదు సార్లు ఎమ్మెల్యేగా పొందిన జీతం మొత్తం పార్టీకే ఇచ్చేవారు. కొద్ది పాటి పొలం[1] తప్ప నర్సయ్యకు సొంత ఆస్తులు లేవు.[2]

గుమ్మడి నర్సయ్య

మూలాలుసవరించు