గులాబ్‌చంద్ హిరాచంద్ దోషి

భారతీయ వ్యాపారవేత్త

గులాబ్‌చంద్ హిరాచంద్ దోషి (1896-1967) వాల్‌చంద్ గ్రూప్ ప్రముఖుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త, జాతీయవాది. [1]

జీవిత విషయాలు

మార్చు

గులాబ్‌చంద్ 1896 సెప్టెంబరు 23 న మహారాష్ట్రలోని షోలాపూర్‌లో గుజరాతీ జైన కుటుంబంలో జన్మించాడు. [2] [3] లాల్‌చంద్ హిరాచంద్, రతన్‌చంద్ హిరాచంద్ లు అతని సోదరులు. [2]

కార్యకర్తగా

మార్చు

1944-1945 మధ్య కాలంలో గులాబ్ చంద్ మహారాష్ట్ర హిందూ సభ అధ్యక్షుడిగా, వీర సావర్కర్ సన్నిహితుడుగా వ్యవహరించాడు.1930 వ దశకంలో, అతను తన జాతీయవాద కార్యకలాపాల కోసం బ్రిటిష్ వారిచే ఖైదు చేయబడ్డాడు [1] [4]

వాల్‌చంద్‌నగర్ ఇండస్ట్రీస్

మార్చు

వాల్‌చంద్‌నగర్ ఇండస్ట్రీస్ అనే ఫ్లాగ్‌షిప్ గ్రూప్ కంపెనీ ఆధునీకరణ, పరివర్తనకు గులాబ్‌చంద్ బాధ్యత వహించాడు.[5] [6]

వాల్‌చంద్‌నగర్ ఇండస్ట్రీస్ ఇప్పుడు తన సోదరుడు లాల్‌చంద్ హిరాచంద్ కుమారులచే నిర్వహించబడుతోంది, వ్యాపారాల కుటుంబ విభజన తర్వాత, వాల్‌చంద్ గ్రూప్ వ్యవస్థాపకుడు, వాల్‌చంద్ హిరాచంద్ వారసులు లేకుండా మరణించాడు.

ఇతర పనులు

మార్చు

గులాబ్‌చంద్, వాల్‌చంద్ గ్రూప్ నిర్వహిస్తున్న వివిధ పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులకు ధర్మకర్తగా ఉన్నాడు. [7]

గులాబ్‌చంద్ జైన మతం గురించి అనేక పుస్తకాలను రచించాడు. జీవరాజ జైన గ్రంథమాల వాల్యూమ్ 9, కుంద కుంద, గులాబ్‌చంద్ హీరాచంద్ దోషి, కైలాష్ చంద్ర జైన్ అనేవి ఇతని రచనలు. [8]

మూలాలు

మార్చు

 

  1. 1.0 1.1 Seth Gulabchand Hirachand| Vinayak Damodar Savarkar
  2. 2.0 2.1 Progressive Jains of India – Satish Kumar Jain – Google Books
  3. Business Legends – Gita Piramal – Google Books
  4. Emperor vs Gulabchand Hirachand Doshi on 18 November, 1932
  5. Walchand Hirachand: man, his times, and achievements – Gaṅgādhara Devarāva Khānolakara, Thomas Gay – Google Books
  6. India's Industrialists – Margaret Herdeck, Gita Piramal – Google Books
  7. HND Pune » About Us Archived 1 జనవరి 2012 at the Wayback Machine
  8. "Jivaraja Jaina Granthmala, No. 20". Archived from the original on 2019-04-08. Retrieved 2021-10-17.