గులాబ్ సింగ్ లోధి

భారతీయ స్వాతంత్య్ర సమరయోధుడు

గులాబ్ సింగ్ లోధి, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు.

గులాబ్ సింగ్ లోధి
'గులాబ్ సింగ్ లోధి' పోస్టల్ స్టాంప్‌ను
జననం1903
ఫతేపూర్ చౌరసి (చండికా ఖేరా), ఉన్నావ్ జిల్లా, ఉత్తర ప్రదేశ్
మరణం23 ఆగస్టు 1935 (వయసు 32)
అమీనాబాద్‌, లక్నో
తండ్రిఠాకూర్ రామ్ రతన్ సింగ్ లోధి
మతంహిందువు
Occupationస్వాతంత్ర్య సమరయోధుడు

లోధి 1903లో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం, ఉన్నావ్ జిల్లా, ఫతేపూర్ చౌరసి (చండికా ఖేరా) అనే గ్రామంలోని రాజ్‌పుత్ కుటుంబంలో జన్మించాడు. తండ్రి ఠాకూర్ రామ్ రతన్ సింగ్ లోధి రైతు.

ఉద్యమం

మార్చు

స్వాతంత్ర్యోద్యమం తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా నిర్వహించిన అనేక రాజకీయ కార్యకలాపాలలో లోధి చురుకుగా పాల్గొన్నాడు.

లోధి లక్నోలోని అమీనాబాద్‌లోని జాందేవాలా పార్కులో 1935, ఆగస్టు 23న మరణించాడు.[1] ఆ రోజు లక్నోలో జరిగిన స్వాతంత్ర్యోద్యమ ఊరేగింపులో లోధి పాల్గొన్నాడు. ఆ ఊరేగింపు భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసేందుకు అమీనాబాద్ పార్కుకు చేరుకుంది. అప్పటికే ఆ పార్కు చుట్టూ బ్రిటిష్ సైన్యం నిలుచుంది. గులాబ్ సింగ్ లోధి బ్రిటీష్ సైన్యాన్ని ధిక్కరించి ముందుకు కదిలాడు. పార్కులో ఉన్న చెట్టు ఎక్కి, జెండాను ఎగురవేస్తుండగా, బ్రిటిష్ అధికారి కాల్చి చంపాడు.[2]

గుర్తింపు

మార్చు

2013, డిసెంబరు 23న భారత ప్రభుత్వం 'గులాబ్ సింగ్ లోధి' గౌరవార్థం పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేసింది.[3] పార్కులో 2004లో లోధి విగ్రహం స్థాపించబడింది, కానీ 2009 నాటికి శిథిలావస్థకు చేరుకుంది.[1]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 Tripathi, Ashish (5 October 2009). "From triumph tales to unsung history". The Times of India. Retrieved 15 April 2014.
  2. |title=Gulab Singh Lodhi |date=13 january 2015
  3. website |url=http://www.istampgallery.com/gulab-singh-lodhi/%7Ctitle=[permanent dead link] Gulab Singh Lodhi |date=13 january 2015