గుల్జార్ హౌజ్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని చార్మినార్ సమీపంలోని చారిత్రాత్మక ఫౌంటైన్. చార్మినార్‌కూ, మదీనాకీ వెళ్ళేదారిలో రోడ్డు మధ్యలో ఈ గుల్జార్ హౌజ్ నిర్మించబడింది.[1]

1880లో తీసిన గుల్జార్ హౌజ్ ఛాయాచిత్రం

నిర్మాణం మార్చు

నిజాం కాలంలో అప్పటి ఇంజనీర్ల సహకారంతో నగరంలోని అనేక ప్రాంతాల్లో ఇలాంటి ఫౌంటైనులు నిర్మించబడ్డాయి. అలంకరణకోసం, ఆకర్షణీయంగా కనిపించడంకోసం నీరు ఉవ్వెత్తున అందంగా ఎగిరేలా రోడ్డుమధ్యలో ఇలాంటి ఫౌంటైనులు కట్టించారు. ఎనిమిది పలకలతో గుల్జార్ హౌజ్ ఫౌంటేన్ నిర్మాణం జరిగింది.

మూలాలు మార్చు

  1. Haig, Sir Wolseley (1907). Historic Landmarks of the Deccan (in ఇంగ్లీష్). Printed at the Pioneer Press. p. 211.