గుల్బదిన్ నాయిబ్

గుల్బదిన్ నాయిబ్ (జననం 1991 మార్చి 16) ఆఫ్ఘన్ క్రికెట్ ఆటగాడు. నాయబ్ ఆల్-రౌండరు -రైట్-ఆర్మ్ ఫాస్ట్-మీడియం బౌలింగ్ చేసే రైట్ హ్యాండ్ బ్యాటరు. 2019 ఏప్రిల్లో, ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB) 2019 క్రికెట్ ప్రపంచ కప్‌కు ముందు అస్గర్ ఆఫ్ఘన్ స్థానంలో నాయబ్‌ను జట్టు యొక్క కొత్త వన్డే ఇంటర్నేషనల్ (వన్‌డే) కెప్టెన్‌గా నియమించింది. [1] [2] అయితే, క్రికెట్ ప్రపంచ కప్ తర్వాత, ఆఫ్ఘనిస్తాన్ అన్ని మ్యాచ్‌లలో ఓడిపోయింది, రషీద్ ఖాన్ మూడు ఫార్మాట్లలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టుకు కొత్త కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. [3]

గుల్బదిన్ నాయిబ్
2019 లో గుల్బదిన్ నాయిబ్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1991-03-16) 1991 మార్చి 16 (వయసు 33)
పులి ఆలం, లోగార్, ఆఫ్ఘనిస్తాన్
ఎత్తు6 ft 1 in (1.85 m)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్-మీడియం
పాత్రఆల్ రౌండరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 24)2011 ఆగస్టు 9 - Canada తో
చివరి వన్‌డే2023 సెప్టెంబరు 5 - శ్రీలంక తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.11
తొలి T20I (క్యాప్ 15)2012 మార్చి 14 - నెదర్లాండ్స్ తో
చివరి T20I2023 మార్చి 24 - పాకిస్తాన్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2011/12Afghan Cheetahs
2017Boost Defenders
2018–presentBalkh Legends
2019Sylhet Strikers
కెరీర్ గణాంకాలు
పోటీ వన్‌డేలు ట్వంటీ20 ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 77 57 5 120
చేసిన పరుగులు 1,170 615 313 2,135
బ్యాటింగు సగటు 20.17 18.08 52.16 23.98
100లు/50లు 0/5 0/1 0/3 1/9
అత్యుత్తమ స్కోరు 82* 56* 88* 100
వేసిన బంతులు 2,589 541 460 3,958
వికెట్లు 67 22 14 114
బౌలింగు సగటు 34.83 33.81 23.28 31.52
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 0 1 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 6/43 2/13 5/29 6/43
క్యాచ్‌లు/స్టంపింగులు 22/– 22/– 6/– 35/–
మూలం: ESPNcricinfo, 7 June 2023

తొలి జీవితం, కెరీర్ మార్చు

గుల్బదిన్ నాయబ్ ఆఫ్ఘనిస్తాన్‌లోని లోగర్ ప్రావిన్స్‌లోని పులి ఆలమ్‌లో జన్మించాడు. [4] [5] అతను 2008 వరల్డ్ క్రికెట్ లీగ్ డివిజన్ ఫైవ్‌లో జపాన్‌పై ఆఫ్ఘనిస్తాన్ తరపున రంగప్రవేశం చేసి, ఐదు మ్యాచ్‌లు ఆడాడు. [6] అతను టోర్నమెంటు కోసం జట్టు చేస్య్తున్న సన్నాహాలను, ఆఫ్ఘనిస్తాన్‌లో వారి జీవితాలనూ చూపించిన డాక్యుమెంటరీ, అవుట్ ఆఫ్ ది యాషెస్‌లో పాల్గొన్నాడు; నాయబ్ కాబూల్ జిమ్‌లో బాడీ బిల్డింగ్‌ను చూపించాడు. ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్‌ తనకు స్ఫూర్తి అని చెప్పాడు. [5] డాక్యుమెంటరీ చిత్రీకరణ జరిగిన రెండు సంవత్సరాల తర్వాత, నాయబ్ ఆఫ్ఘన్ జట్టులో స్థానం కోల్పోయాడు. 2010 ఆసియా క్రీడలకు ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు తిరిగి ఎంపికై, హాంకాంగ్‌తో జరిగిన ఆటలలో ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. [6] ఈ పోటీలో ఆఫ్ఘనిస్తాన్ రజత పతకాన్ని కైవసం చేసుకుంది. శ్రీలంక జాతీయ క్రికెట్ జట్టుపై 2009 దాడి తర్వాత పాకిస్తాన్‌లో పర్యటించిన మొదటి జట్టు ఆఫ్ఘనిస్తాన్‌. అప్పుడు అతను లిస్టు Aలో అడుగుపెట్టాడు. పాకిస్తాన్ A కి వ్యతిరేకంగా మూడు అనధికారిక వన్డే ఇంటర్నేషనల్స్ (వన్‌డేలు) ఆడితే, వాటిలో నాయబ్ రెండింటిలో ఆడాడు. [7]

అంతర్జాతీయ కెరీర్ మార్చు

2011–13 ICC ఇంటర్‌కాంటినెంటల్ కప్ వన్-డేలో కెనడాపై నాయబ్ తన వన్డే అంతర్జాతీయ రంగప్రవేశం చేశాడు. [8] తర్వాత పర్యటనలో అతను క్రికెట్ కెనడా సమ్మర్ ఫెస్టివల్‌లో ట్రినిడాడ్ అండ్ టొబాగోతో జరిగిన ట్వంటీ20 లో కెనడాతో జరిగిన ఫెస్టివల్‌లో ఆడాడు. తరువాత, 2011లో, అతను ఫైసల్ బ్యాంక్ ట్వంటీ-20 కప్ 2011-12లో కొత్తగా ఏర్పడిన ఆఫ్ఘన్ చీతాస్ జట్టు తరఫున ఆడాడు. రావల్పిండి రామ్స్, ఫైసలాబాద్ వుల్వ్స్, ముల్తాన్ టైగర్స్‌తో జరిగిన పోటీలో మూడుసార్లు ఆడాడు. [9] అతను ఫైసలాబాద్ వుల్వ్స్‌పై 42 బంతుల్లో 68 పరుగులు చేసి, టోర్నమెంటు సమయంలో ట్వంటీ20ల్లో తన తొలి హాఫ్ సెంచరీ సాధించాడు. [10] 2011 డిసెంబరులో, 2011 ACC ట్వంటీ20 కప్ ఫైనల్‌లో అతను 50 బంతుల్లో చేసిన 57 పరుగులతో ఆఫ్ఘనిస్తాన్ హాంకాంగ్‌పై 8 పరుగుల తేడాతో విజయం సాధించి, ఆఫ్ఘనిస్తాన్ వారి మూడవ ACC ట్వంటీ20 కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. [11] [12]

2012 ఫిబ్రవరిలో షార్జాలో పాకిస్తాన్‌తో ఆడినప్పుడు పూర్తి సభ్య దేశంతో టెస్టు ఆడే దేశంపై ఆఫ్ఘనిస్తాన్ మొదటి వన్డే ఇంటర్నేషనల్‌లో నాయిబ్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో నాయిబ్ 7 పరుగులు చేసి, షాహిద్ ఆఫ్రిది ఐదు వికెట్లలో ఒకడు అయ్యాడు. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. [13] 2012 మార్చిలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరిగిన 2012 వరల్డ్ ట్వంటీ20 క్వాలిఫైయర్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ఎంపికయ్యాడు.[14] ఈ టోర్నమెంటు సమయంలో, నాయిబ్ నెదర్లాండ్స్‌పై తన ట్వంటీ20 ఇంటర్నేషనల్ (T20I) రంగప్రవేశం చేసాక, మరో రెండు T20I మ్యాచ్‌లు ఆడాడు. [15] అలాగే క్వాలిఫైయర్‌లో ట్వంటీ 20 అంతర్జాతీయ హోదాను కలిగి లేని దేశాలతో మరో ఆరు ట్వంటీ20 మ్యాచ్‌లు ఆడాడు.[9] అతను క్వాలిఫయర్‌లో 13.50 సగటుతో 86 పరుగులు చేశాడు, అత్యధిక స్కోరు 26 నాటౌట్. [16] టోర్నమెంటు ముగిసిన కొద్దికాలానికే, అతను ప్రపంచ క్రికెట్ లీగ్ ఛాంపియన్‌షిప్‌లో నెదర్లాండ్స్‌తో జరిగిన రెండు వన్‌డేలలో ఆడాడు. [8]


2012 జూలైలో, నాయబ్ ఇంటర్ కాంటినెంటల్ కప్ కమిట్‌మెంట్‌లలో భాగంగా ఐర్లాండులో పర్యటించిన ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ఎంపికై, ఐర్లాండ్‌తో జరిగిన రెండు జట్టు వరల్డ్ క్రికెట్ లీగ్ ఛాంపియన్‌షిప్ వన్‌డేలలో ఆడాడు. [8] మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైనప్పటికీ, రెండవ మ్యాచ్‌లో అతను నియాల్ ఓ'బ్రియన్‌ను అవుట్ చేయడంతో తన తొలి వన్‌డే వికెట్‌ను కైవసం చేసుకున్నాడు. జార్జ్ డాక్రెల్ చేతిలో ఔట్ అయ్యే ముందు 23 బంతుల్లో 19 పరుగులు చేశాడు. ఐర్లాండ్ 59 పరుగుల తేడాతో ఆ మ్యాచ్‌ను గెలుచుకుంది. [17] అతను ఇంటర్‌కాంటినెంటల్ కప్ మ్యాచ్‌లో తన తొలి ఫస్ట్-క్లాస్ ఆట ఆడాడు.[18] ఈ మ్యాచ్‌లో అతను ఆడిన ఏకైక ఇన్నింగ్స్‌లో 13 పరుగుల వద్ద అలెక్స్ కుసాక్ బౌలింగులో అవుటయ్యాడు. ఐర్లాండ్ మొదటి-ఇన్నింగ్స్‌లో అతను ఆండ్రూ బల్బిర్నీ వికెట్ తీసుకున్నాడు. ఆరు ఓవర్లలో 33 పరుగులకు ఒక వికెట్‌తో ముగించాడు. [19] 2012 ఆగస్టులో, నాయిబ్ షార్జాలో ఆస్ట్రేలియాతో ఆడినప్పుడు ఐసిసి పూర్తి సభ్యదేశంతో ఆఫ్ఘనిస్తాన్ ఆడిన రెండవ వన్‌డేలో ఆడాడు.[8] ఆస్ట్రేలియా మొదటి-ఇన్నింగ్స్‌లో 272/8 చేసినపుడు, అతను రెండు ఓవర్లు బౌలింగ్ చేసి, 18 పరుగులు ఇచ్చాడు. డేవిడ్ హస్సీని రనౌట్ చేశాడు. ఆఫ్ఘనిస్తాన్ ఛేజింగ్‌లో, అతను 17 బంతుల్లో 22 పరుగులు చేశాడు. ఇందులో మూడు సిక్సర్లు ఉన్నాయి, అతను జేమ్స్ ప్యాటిన్సన్ చేతిలో ఔటయ్యాడు. ఆస్ట్రేలియా 66 పరుగుల తేడాతో గెలిచింది. [20] మ్యాచ్ సమయంలో, 2012 సెప్టెంబరులో శ్రీలంకలో జరిగే వరల్డ్ ట్వంటీ 20 కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టులో నాయిబ్‌కు చోటు దక్కింది. అతను ఇంగ్లండ్‌పై 44 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ 119 పరుగుల తేడాతో గెలుపొందిన మ్యాచ్‌లో రెండంకెల స్కోరు సాధించిన ఏకైక ఆఫ్ఘన్ బ్యాట్స్‌మన్, నాయిబ్. [21]

2019 ఏప్రిల్లో, అతను 2019 క్రికెట్ ప్రపంచ కప్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. [22] [23] మేలో, ప్రపంచకప్‌కు ముందు, ఐర్లాండ్‌తో జరిగిన రెండో వన్‌డే లో, నాయిబ్ 43 పరుగులకు ఆరు వికెట్లు పడగొట్టాడు. ఇది అతని మొదటి ఐదు వికెట్ల పంట. వన్‌డేలలో ఆఫ్ఘనిస్తాన్ బౌలరు సాధించిన మూడవ అత్యుత్తమ గణాంకాలవి. [24] 2019 జూన్ 24న, బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో, నాయిబ్ ఆఫ్ఘనిస్తాన్ తరపున తన 100వ అంతర్జాతీయ మ్యాచ్‌లో ఆడాడు. [25] అదే మ్యాచ్‌లో అతను వన్డే క్రికెట్‌లో తన 1,000వ పరుగు కూడా సాధించాడు. [26]

టీ20 ఫ్రాంచైజీ కెరీర్ మార్చు

2018 సెప్టెంబరులో, ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటు మొదటి ఎడిషన్‌లో బాల్ఖ్ జట్టులో నాయిబ్ ఎంపికయ్యాడు. [27] మరుసటి నెలలో, అతను 2018-19 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో సిల్హెట్ సిక్సర్స్ జట్టుకు ఎంపికయ్యాడు. [28]

మూలాలు మార్చు

  1. "Asghar Afghan removed as Afghanistan announce split captaincy". International Cricket Council. Retrieved 5 April 2019.
  2. "Rahmat, Rashid given leadership roles in Afghanistan revamp". ESPN Cricinfo. Retrieved 5 April 2019.
  3. "Rashid to captain Afghanistan across formats, Asghar appointed his deputy". ESPN Cricinfo. Retrieved 12 July 2019.
  4. Gulbadin Naib Profile. Cricbuzz.com.
  5. 5.0 5.1 Berry, Scyld (22 March 2012). "Afghanistan cricketers on the fast-track to Test status after World Twenty20 success in Dubai". The Daily Telegraph. Retrieved 26 August 2012.
  6. 6.0 6.1 "Other matches played by Gulbudeen Naib". CricketArchive. Archived from the original on 25 October 2012. Retrieved 3 August 2011.
  7. "List A Matches played by Gulbudeen Naib". CricketArchive. Retrieved 3 August 2011.
  8. 8.0 8.1 8.2 8.3 "One-Day International Matches played by Gulbudeen Naib". CricketArchive. Archived from the original on 9 November 2012. Retrieved 10 August 2011. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "ODI" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  9. 9.0 9.1 "Twenty20 Matches Played by Gulbudeen Naib". CricketArchive. Retrieved 30 September 2011.
  10. "Afghan Cheetas v Faisalabad Wolves, 2011/12 Faysal Bank T-20 Cup". CricketArchive. Retrieved 30 September 2011.
  11. "Ireland v Afghanistan, 2011 ACC Twenty20 Cup". CricketArchive. Retrieved 26 August 2012.
  12. Nixon, Andrew (11 December 2011). "Afghanistan win ACC Twenty20 again". www.cricketeurope4.net. Archived from the original on 4 March 2016. Retrieved 26 August 2012.
  13. Sundar, Nitin (10 February 2012). "Afridi sets up victory against spirited Afghanistan". ESPNcricinfo. Retrieved 10 February 2012.
  14. "Squads for World Twenty20 Qualifier". Cricketeurope4.net. 18 February 2012. Archived from the original on 29 October 2013. Retrieved 26 August 2012.
  15. "International Twenty20 Matches played by Gulbadeen Naib". CricketArchive. Retrieved 26 August 2012.
  16. "Twenty20 Batting and Fielding in Each Season by Gulbadeen Naib". CricketArchive. Retrieved 26 August 2012.
  17. "Ireland v Afghanistan, 2011–13 ICC World Cricket League Championship". CricketArchive. Retrieved 26 August 2012.
  18. "First-Class Matches played by Gulbadeen Naib". CricketArchive. Retrieved 26 August 2012.
  19. "Ireland v Afghanistan, 2011–13 ICC Intercontinental Cup". CricketArchive. Retrieved 26 August 2012.
  20. "Afghanistan v Australia, 2012". CricketArchive. Retrieved 26 August 2012.
  21. "Hamid Hassan returns for Afghanistan". ESPNcricinfo. 25 August 2012. Retrieved 26 August 2012.
  22. "Hamid Hassan picked in Afghanistan's World Cup squad; Naib to captain". ESPN Cricinfo. Retrieved 22 April 2019.
  23. "Asghar Afghan included in Gulbadin Naib-led World Cup squad". International Cricket Council. Retrieved 22 April 2019.
  24. "Shahzad ton as Afghanistan tune up for World Cup with series-levelling victory". ESPN Cricinfo. Retrieved 21 May 2019.
  25. "ICC World Cup 2019: Match 31, Bangladesh vs Afghanistan – Statistical Preview". Crictracker. Retrieved 24 June 2019.
  26. "Afghanistan vs Bangladesh live cricket score and updates, AFG vs BAN Match 31". Cricket Country. Retrieved 24 June 2019.
  27. "Afghanistan Premier League 2018 – All you need to know from the player draft". CricTracker. Retrieved 10 September 2018.
  28. "Full players list of the teams following Players Draft of BPL T20 2018-19". Bangladesh Cricket Board. Retrieved 29 October 2018.