గుల్మము : ఇదొక చిన్న మొక్క. ఒక్కసారి పూసిన తర్వాత అంతరిస్తాయి. తులసి,పుదీనా లాంటివి కూడా గుల్మము శాఖలనే చెప్పవచ్చును . తులసిలో ఆకులు ( చిన్నవి ,పెద్దవి గా ) నిగనిగలాడే ఆకారంలో ఉంటాయి. మొక్క చాలా సున్నితమైనది వెచ్చని వాతావరణంలో పెరుగగలదు. తేమతో కూడిన పరిస్థితులలో పెరిగినప్పుడు. ఎండిన తులసి (పెద్ద) ఆకు సువాసనగా గా ఉంటాయి . తీపి, సుగంధ, తేలికపాటి రుచిని కలిగి ఉంటాయి. చిన్న తులసి యొక్క ఎండిన ఆకులు తక్కువ సువాసన రుచి గా ఉంటాయి [1]

Herbs: basil

ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రములలో రైతులలో ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్ ఔషధ , సుగంధ మొక్కల బోర్డు, హార్టికల్చర్ విశ్వవిద్యాలయాలు, వనరుల కేంద్రాలు ఔషధ మొక్కల పరిరక్షణ ప్రాంతాలు , వన సేవ సంరక్షణ సమితి వాటితో కార్యకలాపాలు చేపట్టబడ్డాయి [2] [3]

హెర్బల్ ,సుగంధ మొక్కలను ఆంధ్ర ప్రదేశ్,తెలంగాణ రాష్ట్రములలో సుమారు 21 జిల్లాలలో 24700 ఎకరాలలో ( 10000 హెక్టార్లలో) పెంపకం జరుగుతున్నది [4]

తులసి ఒక అద్భుతమైన పొద దీనిని "మూలికల రాణి" అని పిలుస్తారు. ఇది “లామియాసియా” కుటుంబానికి చెందినది. ఈ మొక్కను శతాబ్దాలుగా భారతదేశంలో బహుళ ఉపయోగాల కోసం సాగు చేస్తున్నారు. లవంగం నూనెతో పోలిస్తే తులసి నూనెలో 70 శాతం యూజీనాల్ ఉంటుంది. తులసిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. తులసి ఔషధ మొక్కల పెంపకం చాలా ప్రయోజనకరంగా ఉన్నాయి. భారతదేశంలోని అనేక రాష్ట్రాల రైతులు ఔషధ మొక్కలను పండించడం పెద్ద ప్రయోజనం ఏమిటంటే ఇది తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో మంచి లాభాలను ఇస్తుంది. కేవలం రూ. 15000 నుండి 20000 వరకు మూడు నెలల్లో 3 నుండి 4 లక్షలు సంపాదించవచ్చు. తులసి లో నాలుగు రకములైన కృష్ణ తులసి , ద్రుద్రిహా తులసి, రామ్ / కాళి తులసి, బాబీ తులసి చాల రకములైన తులసి మొక్కలు కనబడుతున్నాయి. ప్రతి ఒక్క తులసి మొక్క ఏంతో విలువైనవి. వాటి ప్రయోజనం వివరిస్తే కృష్ణ తులసి భారతదేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలలో కలవు. ఈ రకం ఆకులు వంకాయ రంగులో ఉంటాయి. కృష్ణ తులసిలో విటమిన్ ఎ, విటమిన్ కె బీటా కెరోటిన్ ఉన్నాయి. ఇది మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, పొటాషియం విటమిన్ సి యొక్క వనరులను కూడా ఇస్తుంది. ఈ రకాన్ని తులసి నూనె తయారీకి ఉపయోగిస్తారు, ఇది దోమలను అరికడుతుంది.మలేరియా వంటి వ్యాధుల నివారణ కు ఉపయోగం. ద్రుద్రిహా తులసి ప్రధానంగా బెంగాల్, నేపాల్, చాట్‌గావ్ ,మహారాష్ట్ర ప్రాంతాలలో కనుగొనబడింది. ఇది గొంతు పొడిబారడం నుండి ఉపశమనం ఇస్తుంది, చేతులు , కాళ్ళ వాపు , కీళ్ల నొప్పులను నిరోధించ గలదు. రామ్ / కాశీ తులసి చైనా, బ్రెజిల్, తూర్పు నేపాల్‌తో పాటు బెంగాల్, బీహార్, చాట్‌గావ్ , భారతదేశంలోని దక్షిణ రాష్ట్రాలలో కనుగొనబడింది. వంకాయ రంగులో ఉంటుంది ఆకులు ఆకుపచ్చ రంగులో ఉంది , వాసన కలిగి ఉంటాయి. వీటిలో వుండే ఔషధ గుణములతో అడాప్టోజెనిక్, యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ , రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇది వెచ్చని ప్రదేశాలలో పండుతుంది. [5]

గుల్మాలు వంటలలో, వైద్యంలోను విస్తృతంగా ఉపయోగపడుతున్నాయి. ఆకుకూరలు చాలా వరకు గుల్మాలే. ఉదాహరణ: తోటకూర, కొత్తిమిర మొదలైనవి. ఔషధ మొక్కలలోని ఆకులు, వేరు, విత్తనాలు మొదలైన భాగాలు ఇందుకోసం ఉపయోగపడతాయి.

మూలాలు

మార్చు
  1. "basil | Definition, Uses, & Facts". Encyclopedia Britannica (in ఇంగ్లీష్). Retrieved 2020-09-08.
  2. "Telangana State Medicinal Plants Board". tsmpb.in. Archived from the original on 2020-08-13. Retrieved 2020-09-08.
  3. "Andhra Pradesh Medicinal and Aromatic Plants Board". www.apmab.gov.in. Retrieved 2020-09-08.
  4. "Inventorising the Cultivation Status of Medicinal and Aromatic Plants in Telangana and Andhra Pradesh States" (PDF). ecronicon.com/. 2020-09-08. Archived from the original (PDF) on 2020-08-04. Retrieved 2020-09-08.
  5. "Earn 3 lakh in three months by Tulsi farming". krishijagran.com (in ఇంగ్లీష్). Retrieved 2020-09-08.
"https://te.wikipedia.org/w/index.php?title=గుల్మము&oldid=3912275" నుండి వెలికితీశారు