గూగ్లి ఎల్మో మార్కోని

ఇతలిఅన్ ఇంవెంతొర్ మరియు రెడ్యొ పిఒనీర్

గుగ్లిఎల్మో జియోవన్ని మారియా మార్కోనీ (1874 ఏప్రిల్ 25 - 1937 జూలై 20) ఇటాలియన్ ఆవిష్కర్త, ఎలక్ట్రికల్ ఇంజనీర్. [1][2][3][4] అతను సుదూర ప్రాంతాలకు రేడియో ప్రసారాలు పంపుటకు, రేడియో టెలిగ్రాఫ్ వ్యవస్థను అభివృద్ధి చేయుటలో పితామహుడుగా గుర్తింపు పొందాడు[5]. అతను రేడియో యొక్క ఆవిష్కర్త[6]. 1909 లో కార్ల్ ఫెడ్రినాండ్ బ్రాన్ తో కలసి వైర్‍లెస్ టెలిగ్రాఫీ అనే అంశంపై భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి తీసుకున్నాడు[7][8][9]. 1897 లో బ్రిటన్ లో వైర్‍లెస్ టెలిగ్రాఫ్, సిగ్నల్ కంపెనీకి వ్యవస్థాపకునిగా ఉన్నాడు. అతను ఇతర భౌతిక శాస్త్రవేత్తల ప్రయోగాలను ఆధారంగా చేసుకొని రేడియో అనే కొత్త ఆవిష్కరణ చేసి వ్యాపార రంగంలో ఘనమైన విజయాన్ని సాధించాడు[10][11]. 1929 లో మార్కోనీని మార్చీజ్ అనే అవార్డుతో విక్టర్ ఇమ్మాన్యుయేల్ III గౌరవించాడు. 1931లో అతను పోప్ పియస్ XI కోసం వాటికన్ రేడియోను ఏర్పాటు చేశాడు.

గూగ్లి ఎల్మో మార్కోని
జననం1874, ఏప్రిల్ 25
పాలెజ్జో మారిస్కాల్చి, బోలొగ్నా, ఇటలీ
మరణం1937, జూలై 20
రోమ్,ఇటలీ
నివాసంఇటలీ
జాతీయతఇటాలియన్
చదువుకున్న సంస్థలుబోలోగ్నా విశ్వవిద్యాలయం
ప్రసిద్ధిరేడియో
ముఖ్యమైన పురస్కారాలునోబెల్ బహుమతి (1909)
సంతకం

చరిత్ర

మార్చు

బాల్యం

మార్చు

మార్కోని 1874 ఏప్రిల్ 25 లో ఇటలీ దేశంలోని బొలొగ్నాలో అన్నీ జేమ్‍సన్, గుసెప్ మార్కోనీ దంపతులకు జన్మించాడు. మార్కోని బొలోగ్నా యందుగల అగస్టో రిఘి లాబొరేటరీలో ప్రైవేటుగా చదువుకొన్నాడు. విద్యార్థి దశలో మార్కోనీ పరిశోధనల పట్ల మక్కువ చూపించేవాడు. అతనికి సోదరుడు ఆల్ఫోన్సో, సవతి సొదరుడు లూగీలు ఉండేవారు. మార్కోనీ, అతని సొదరుడు ఆల్ఫోన్సో లు తమ తల్లితో పాటు బెడ్‌ఫోల్డ్ పట్టణంలో నివసిస్తుండేవారు. [12][13]

విద్య

మార్చు

మార్కోని చిన్నతనంలో పాఠశాలకు హాజరు కాలేదు. ఏ పాఠశాల యందూ ఉన్నత విద్యాభ్యాసం చేయలేదు.[14][15][16] దీనికి బదులుగా అతను తన తల్లిదండ్రులచే నియమించబడిన ప్రైవేట్ ఉపాధ్యాయుల నుండి ఇంట్లో రసాయనశాస్త్రం, గణితం, భౌతిక శాస్త్రాలను నేర్చుకున్నాడు. టుస్కానీ లేదా ఫ్లోరెన్స్ ప్రాంతాల వెచ్చని వాతావరణం కోసం అతని కుటుంబం బోలోగ్నాను విడిచిపెట్టినప్పుడు, శీతాకాలంలో గూగ్లిఎల్మీ కోసం అదనపు శిక్షకులను నియమించింది[16]. లివోర్నోలోని ఉన్నత పాఠశాలలో పనిచేయుచున్న భౌతిక ఉపాధ్యాయుడు ప్రొఫెసర్ విన్సెంజో రోసా ముఖ్యమైన గురువుగా మార్కోని గుర్తించాడు.[17][15] రోసా 17 ఏళ్ల మార్కోనీకి భౌతిక దృగ్విషయాల ప్రాథమిక విషయాలను, అలాగే విద్యుత్తుపై కొత్త సిద్ధాంతాలను నేర్పించాడు. 18 యేళ్ళ వయస్సులో అతను తిగిరి బోలోగ్నాకు తిరిగి వచ్చాడు. అపుడు అతనికి హెన్రిచ్ హెర్ట్‌జ్ కనుగొన్న విషయాలపై పరిశోధన చేసిన బోలోగ్నా విశ్వవిద్యాలయ భౌతిక శాస్త్రవేత్త అగస్టో రిగితో పరిచయం ఏర్పడింది. విశ్వవిద్యాలయంలో ఉపన్యాసాలకు హాజరు కావడానికి, విశ్వవిద్యాలయం ప్రయోగశాల, గ్రంథాలయాన్ని ఉపయోగించటానికి మార్కోనిని అగస్టో రిగి అనుమతించాడు[18].

రేడియో పరిశోధన

మార్చు

యువకునిగా ఉన్న నాటి నుండి మార్కోని విజ్ఞానశాస్త్రం, విద్యుత్ పట్ల ఆసక్తి కలిగి ఉండేవాడు. 1890 ల ప్రారంభంలో, అతను "వైర్‌లెస్ టెలిగ్రాఫీ" అనే ఆలోచనపై పనిచేయడం ప్రారంభించాడు, అంటే ఎలక్ట్రిక్ టెలిగ్రాఫ్ ఉపయోగించిన వైర్లను కనెక్ట్ చేయకుండా టెలిగ్రాఫ్ సందేశాలను ప్రసారం చేయడం. ఇది కొత్త ఆలోచన కాదు; అనేక మంది పరిశోధకులు, ఆవిష్కర్తలు వైర్‌లెస్ టెలిగ్రాఫ్ టెక్నాలజీలను, విద్యుత్ ప్రసరణ, విద్యుదయస్కాంత ప్రేరణ , ఆప్టికల్ (లైట్) సిగ్నలింగ్ ఉపయోగించి 50 సంవత్సరాలుగా కొత్త వ్యవస్థలకోసం అన్వేషిస్తున్నారు. కానీ ఎవరూ సాంకేతికంగా, వాణిజ్యపరంగా విజయవంతం కాలేదు. కొత్త అభివృద్ధి హెన్రిచ్ హెర్ట్‌జ్ నుండి వచ్చింది. అతను 1888 లో, విద్యుదయస్కాంత వికిరణాన్ని ఉత్పత్తి చేయగలవచ్చునని, గుర్తించగలమని నిరూపించాడు. అతను విద్యుదయస్కాంత వికిరణాలపై పరిశోధనలు చేసి ప్రస్తుతం ఉన్న రేడియో తరంగాలు (అప్పట్లో వాటిని హెర్టిజియన్ తరంగాలు అని పిలిచేవారు) కనుగొన్నాడు.[19] 1894 లో హెర్ట్జ్ మరణానంతరం అతను పరిశోధనలను కొనసాగించి కొత్త ఆవిష్కరణను సృష్టించింది మార్కోని. అతను హెర్ట్జ్ పరిశోధనలను బొలోగ్నా విశ్వవిద్యాలయం భౌతిక శాస్త్రవేత్త ఆగస్టో రిఘితో కలసి కొనసాగించుటకు అనుమతి లభించింది[20].

రేడియో టెలిగ్రాఫీని అభివృద్ధి

మార్చు

20 సంవత్సరాల వయస్సులో, మార్కోని రేడియో తరంగాలలో ప్రయోగాలు చేయడం ప్రారంభించాడు. తన నౌకరు మిగ్నాని సహాయంతో, ఇటలీలోని పోంటెచియోలోని విల్లా గ్రిఫోన్ వద్ద తన ఇంటి అటకపై తన సొంత పరికరాలను నిర్మించాడు. మార్కోని హెర్ట్‌జ్ అసలు ప్రయోగాలను అభివృద్ధి పరిచాడు. రిఘీ సూచన మేరకు, ఫ్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త ఎడ్వర్డ్ బ్రాన్లీ 1890 ఫలితాల ఆధారంగా ఒక ప్రారంభ డిటెక్టర్ అయిన కోహరర్‌ను ఉపయోగించడం ప్రారంభించాడు. రేడియో తరంగాలు క్రియాశీలకమైనప్పుడు నిరోధాన్ని మార్చుకొనే లాడ్జ్ చేసిన ప్రయోగాలను ఉపయోగించాడు[21]. 1894 వేసవిలో, అతను బ్యాటరీ, కోహెరర్, ఎలక్ట్రిక్ బెల్‌తో కూడిన తుఫాను అలారంను నిర్మించాడు. మెరుపు ద్వారా ఉత్పన్నమయ్యే రేడియో తరంగాలను ఎంచుకున్నప్పుడు అది ఆగిపోయింది. డిసెంబర్ 1894 లో ఒక రాత్రి మార్కోని తన తల్లికి ఒక రేడియో ట్రాన్సిమిటర్, రిసీవర్‌ను ప్రదర్శించాడు. ఇది ఒక పరికరాల అమరిక. ఒక బెంచ్ మీద టెలిగ్రాఫిక్ బటన్‌ను నొక్కడం ద్వారా గదికి అవతలి వైపు బెల్ రింగ్ చేసింది[21][22]. తన తండ్రి సహకారంతో, మార్కోని భౌతిక శాస్త్ర సాహిత్యాన్ని చదవడం కొనసాగించాడు. అందులో నుండి రేడియో తరంగాలతో ప్రయోగాలు చేస్తున్న భౌతిక శాస్త్రవేత్తల ఆలోచనలను తీసుకున్నాడు.

అతను పోర్టబుల్ ట్రాన్స్‌మిటర్లు, రిసీవర్ సిస్టమ్స్ వంటి పరికరాలను అభివృద్ధి చేశాడు, అవి ఎక్కువ దూరం పని చేయగలవు. అతని ప్రయోగశాల ప్రయోగం తప్పనిసరిగా ఉపయోగకరమైన కమ్యూనికేషన్ వ్యవస్థగా రూపొందింది.[20] [23]

మార్కోని అనేక భాగాలతో కూడిన పనిచేసే వ్యవస్థలను తయారుచేసాడు[24].

 • ఒక సాపేక్షంగా గల సాధారన డోలని (oscillator) లేదా స్ఫులింగము (spark) సృష్టించు రేడియో ప్రసారిణి.
 • ఒక లోహపు తీగ లేదా భూమి నుండి ఎత్తులో గల గ్రహించే సాధనం
 • ఒక గ్రాహకం: ఇది బ్రాన్లీ యొక్క అసలు పరికరంగా మార్చబడింది.
 • ఒక టెలిగ్రాఫ్ కీ: ప్రసరిణి నుండి లఘు స్పందనలను, పెద్ద స్పందనలనూ మోర్స్ కోడ్ ప్రకారం డాట్, డాష్ లుగా పంపుట
 • మోర్స్ కోడ్ ను నమోదు చేయుటకు టెలిగ్రాఫ్ రిజిస్టర్ ( ఇది కాగితం టేప్ లా ఉంటుంది)
 
Marconi's first transmitter incorporating a monopole antenna. It consisted of an elevated copper sheet (top) connected to a Righi spark gap (left) powered by an induction coil (center) with a telegraph key (right) to switch it on and off to spell out text messages in Morse code.

1895 వేసవిలో, మార్కోని తన ప్రయోగాలను బోలోగ్నాలోని తన తండ్రి ఎస్టేట్‌లో ఆరు బయటకు తరలించాడు. అతను యాంటెన్నా యొక్క విభిన్న ఏర్పాట్లు, ఆకృతులను ఉపయోగించి ప్రయత్నించాడు. కాని మెరుగైన విధానంలో కూడా అతను సిగ్నల్స్‌ను ఒక అర మైలు వరకు మాత్రమే ప్రసారం చేయగలిగాడు. ఆలివర్ లాడ్జ్ 1894 లో ఇదే రేడియో తరంగాలకు గరిష్ట ప్రసార దూరం అని ఊహించాడు[25].

ప్రసార పురోగతి

మార్చు

మార్కోని తన యాంటెన్నా యొక్క ఎత్తును పెంచిన తర్వాత చాలా ఎక్కువ పరిధిని సాధించవచ్చని కనుగొన్నప్పుడు, తీగల టెలిగ్రాఫీలో ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకోని, అతను ట్రాన్స్‌మిటర్, రిసీవర్లను గ్రౌండింగ్ చేయడం.వలన 1895 వేసవిలో ఒక పురోగతి వచ్చింది. ఈ మెరుగుదలలతో, ఈ వ్యవస్థ 2 మైళ్ళు (3.2 కిమీ), కొండల మీదుగా సంకేతాలను ప్రసారం చేయగలిగింది[26] [27]. హెర్ట్‌జ్ ఉపయోగించే డైపోల్ యాంటెన్నాలతో పోలిస్తే, మోనోపోల్ యాంటెన్నా తరంగాల పౌనఃపున్యం తగ్గించింది. ఎక్కువ దూరం ప్రయాణించగల నిలువుగా ధృవణం చెందబడిన రేడియో తరంగాలను ప్రసరింపచేసింది. ఈ సమయంలో, ఈ పరికరానికి అదనపు నిధులు ఖర్చుపెట్టి, పరిశోధనలు చేస్తే ఎక్కువ దూరాన్ని విస్తరించగలదని, వాణిజ్యపరంగా, సైనికపరంగా ఈ వ్యవస్థ విలువైనదని రుజువు చేసాడు. మార్కోని ప్రయోగాత్మక ఉపకరణం మొదటి పూర్తి- ఇంజనీరింగ్, వాణిజ్యపరంగా విజయవంతమైన రేడియో ప్రసార వ్యవస్థగా నిరూపించబడింది. [28][29][30] మార్కోని పియెత్రో లకావా నిర్దేశం ప్రకారం నిస్తంత్రీ టెలిగ్రాఫ్ యంత్రం గూర్చి వివరిస్తూ నిధుల కోసం పోస్ట్, టెలిగ్రాఫ్ మంత్రిత్వ శాఖకు రాశాడు. తన లేఖపై ఆయనకు ఎప్పుడూ స్పందన రాలేదు, చివరికి ఆ ప్రతిపాదనను మంత్రి కొట్టివేసాడు[31],

1896 లో మార్కోనీ ఇటలీని విడిచి ఇంగ్లాండు వెళ్ళేందుకు బోలోగ్నాలోని యునైటెడ్ స్టేట్స్ కాన్సులేట్‌లో గౌరవ కాన్సుల్ అయిన తన స్నేహితుడు కార్లో గార్డినితో మాట్లాడాడు.

గార్డిని లండన్‌లోని ఇటలీ రాయబారి అన్నీబెల్ ఫెర్రెరోకు మార్కోనీ గురించి, అతని అసాధారణ ఆవిష్కరణల గురించి వివరిస్తూ పరిచయ లేఖ రాసాడు. తన ప్రతిస్పందనలో, రాయబారి ఫెర్రెరో పేటెంట్ పొందిన వరకు మార్కోని ఫలితాలను వెల్లడించవద్దని వారికి సలహా ఇచ్చాడు. అతను మార్కోనిని ఇంగ్లాండ్‌లి రమ్మని ప్రోత్సహించాడు. అక్కడ తన ప్రయోగాలను ఆచరణాత్మక ఉపయోగంలోకి మార్చడానికి అవసరమైన నిధులను కనుగొనడం సులభం అని చెప్పాడు. ఇటలీలో తన పరిశోధన పట్ల పెద్దగా ఆసక్తి, ప్రశంసలు లేనందున, మార్కోని 1896 ప్రారంభంలో తన 21 వ ఏట తన తల్లితో కలిసి తన పరిశోధనలకు మద్దతు కోరడానికి లండన్ వెళ్ళాడు. మార్కోని డోవర్ వద్దకు వచ్చాడు. అక్కడ కస్టమ్స్ అధికారి వివిధ ఉపకరణాలను కనుగొనడానికి తన పెట్టెను తెరిచాడు. కస్టమ్స్ అధికారి వెంటనే లండన్‌లోని అడ్మిరల్‌ను సంప్రదించాడు. అక్కడ ఉన్నప్పుడు, మార్కోని బ్రిటిష్ పోస్ట్ ఆఫీస్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ విలియం ప్రీస్ ఆసక్తి, మద్దతును పొందాడు.

ఈ సమయంలో మార్కోని తన వ్యవస్థకు పేటెంట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అతను 1896 జూన్ న , బ్రిటిష్ పేటెంట్ నంబర్ 12039 తో "ఇంప్రూవ్‌మెంట్ ఇన్ ట్రాన్స్‌మిటింగ్ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ అండ్ సిగ్నల్స్" అనే శీర్షికతో దరఖాస్తు చేసుకున్నాడు. ఇది రేడియో తరంగ ఆధారిత సమాచార వ్యవస్థలో మొదటి పేటెంట్ అవుతుంది[32].

బ్రిటిష్ వారి ఆసక్తి

మార్చు
 
13 మే 1897 న ఫ్లాట్ హోల్మ్ ద్వీపంలో ప్రదర్శన సందర్భంగా బ్రిటిష్ పోస్ట్ ఆఫీస్ ఇంజనీర్లు మార్కోని యొక్క రేడియో పరికరాలను తనిఖీ చేశారు. ట్రాన్స్‌మిటర్ మధ్యలో ఉంది, దాని క్రింద కోహరర్ రిసీవర్, వైర్ యాంటెన్నాకు ఆధారాన్నిచ్చే పోల్ పైభాగంలో కనిపిస్తుంది.

జూలై 1896 లో మార్కోనీ తన వ్యవస్థ మొదటి ప్రదర్శనను బ్రిటిష్ ప్రభుత్వం కోసం చేశాడు.[33] బ్రిటీష్ వారి కోసం మరిన్ని ప్రదర్శనలు జరిగాయి. మార్చి 1897 నాటికి, మార్కోని మోర్స్ కోడ్‌ సంకేతాలను సాలిస్బరీ మైదానంలో 6 కిలోమీటర్ల (3.7 మైళ్ళు) దూరం వరకు ప్రసారం చేయగలిగాడు. 1897 మే 13 న మార్కోని బహిరంగ సముద్రంలో మొట్టమొదటి వైర్‌లెస్ కమ్యూనికేషన్‌ను పంపాడు. బ్రిస్టల్ కాలువ ద్వారా ఫ్లాట్ హోల్మ్ ద్వీపం నుండి పెనార్త్‌లోని లావెర్నాక్ పాయింట్ వరకు 6 కిలోమీటర్ల (3.7 మైళ్ళు) దూరం సందేశం పంపబడింది. ఆ సందేశం "ఆర్ యు రెడీ?"[34]. ప్రసార సామగ్రిని వెంటనే సోమెర్‌సెట్ తీరంలోని బ్రెన్ డౌన్ ఫోర్ట్‌కు మార్చారు. సమాచారం పంపే పరిధి 16 కిలోమీటర్లు (9.9 మైళ్ళు) విస్తరించింది.

 
బి.టి సెంటర్ వెలుపల ఉన్న ఫలకం మార్కోని మొట్టమొదటి వైర్‌లెస్ సిగ్నల్ ప్రసారాన్ని గుర్తుచేస్తుంది.

ఈ ప్రదర్శన, ఇతర ప్రదర్శనలతో ఆకట్టుకున్న ప్రీస్, మార్కోని చేసిన పరిశొధనా కృషిని రెండు ముఖ్యమైన లండన్ ఉపన్యాసాలలో సాధారణ ప్రజలకు పరిచయం చేశాడు: అవి ఒకటి 1896 డిసెంబరు 11న టాయిన్‌బీ హాల్‌లో "టెలిగ్రఫీ వితౌట్ వైర్స్"; రెండవది 897 జూన్ 4 న రాయల్ ఇనిస్టిట్యూషన్‌కు ఇచ్చిన "సిగ్నలింగ్ త్రూ స్పేస్ వితవుట్ వైర్స్ ". అనేక అదనపు ప్రదర్శనలు కూడా జరిగాయి. ఈ ప్రదర్శనలతో మార్కోని అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించడం ప్రారంభించాడు. జూలై 1897 లో, అతను ఇటాలియన్ ప్రభుత్వం కోసం తన స్వదేశంలో లా స్పీజియా వద్ద వరుస పరీక్షలు నిర్వహించాడు. ఉత్తర ఐర్లాండ్‌లోని బాలి కాజిల్, రాత్లిన్ ద్వీపం మధ్య లాయిడ్స్ కోసం ఒక పరీక్షను 1898 జూలై 6 న నిర్వహించారు. 1899 మార్చి 27 న ఫ్రాన్స్‌లోని విమెరెక్స్ నుండి ఇంగ్లాండ్‌లోని సౌత్ ఫోర్లాండ్ లైట్‌హౌస్ వరకు ఆంగ్ల ఛానెల్‌లో ప్రసారం జరిగింది. మార్కోని డోర్సెట్‌లోని సావెన్‌బ్యాంక్స్, పూలే హార్బర్‌లోని హెవెన్ హోటల్‌లో ఒక ప్రయోగాత్మక స్థావరాన్ని ఏర్పాటు చేశాడు, అక్కడ అతను 100 అడుగుల ఎత్తైన స్థంబాన్ని నిర్మించాడు. పూలే నౌకాశ్రయంలోని బ్రౌన్సీ ద్వీపం యజమానులు వాన్ రాల్టెస్ తో అతను స్నేహం చేశాడు. అతను సముద్రంలో ప్రయోగాలు చేయనప్పుడు అతను ప్రయాణిస్తున్న ఓడ "ఎలెట్రా" తరచుగా బ్రౌన్సీలో లేదా హెవెన్ హోటల్‌లో లంగరు వేయబడి ఉండేది. డిసెంబరు 1898 లో, డోవర్ వద్ద సౌత్ ఫోర్లాండ్ లైట్ హౌస్, పన్నెండు మైళ్ళ దూరంలో ఉన్న ఈస్ట్ గుడ్విన్ లైట్ షిప్ మధ్య వైర్‌లెస్ కమ్యూనికేషన్ ఏర్పాటుకు "బ్రిటిష్ లైట్‌షిప్ సర్వీసు" అధికారం ఇచ్చింది. 17 మార్చి 1899 న, ఈస్ట్ గుడ్విన్ లైట్ షిప్ మొదటి SOS సందేశాన్ని పంపింది. సౌత్ ఫోర్లాండ్ లైట్ హౌస్ యొక్క రేడియో ఆపరేటర్ ఈ సందేశాన్ని అందుకున్నాడు[35][36].

 
SS Ponce entering New York Harbor 1899, by Milton J. Burns

1899 శరదృతువులో, యునైటెడ్ స్టేట్స్‌లో మొదటి ప్రదర్శనలు జరిగాయి. న్యూజెర్సీలోని శాండీ హుక్ నుండి అమెరికా కప్ అంతర్జాతీయ పడవ రేసులను కవర్ చేయడానికి న్యూయార్క్ హెరాల్డ్ వార్తాపత్రిక ఆహ్వానం మేరకు మార్కోనీ యు.ఎస్. ప్రయాణమయ్యాడు. పోర్టో రికో లైన్ ప్రయాణీకుల ఓడ అయిన "ఎస్ఎస్ పోన్స్" మీదుగా ఈ ప్రసారం జరిగింది.[37] మార్కోని 1899 నవంబర్ 8 న అమెరికన్ లైన్ యొక్క ఎస్ఎస్ సెయింట్ పాల్‌లో ఇంగ్లాండ్ బయలుదేరాడు. అతనితో పాటు అతని సహాయకులు సముద్రయానంలో వైర్‌లెస్ పరికరాలను ఏర్పాటు చేశారు. నవంబర్ 15 న మార్కోని యొక్క "రాయల్ నీడిల్స్ హోటల్ రేడియో స్టేషన్" ఇంగ్లీష్ తీరానికి 66 నాటికల్ మైళ్ళ దూరంలో సెయింట్ పాల్ నౌకను ను సంప్రదించినప్పుడు, అది వైర్‌లెస్ ద్వారా గ్రేట్ బ్రిటన్‌కు తిరిగి రావడాన్ని నివేదించిన మొదటి వాణిజ్య నౌక అయ్యింది.

అట్లాంటిక్ ప్రసారాలు

మార్చు
 
మార్కోనీ చేత మాగ్నెటిక్ డిటెక్టర్ 1902 వేసవిలో ఓడలో ప్రయోగాత్మక ప్రచారం సందర్భంగా ఉపయోగించబడింది, మిలన్‌కు చెందిన మ్యూజియో నాజియోనెల్ డెల్లా సైయెంజా ఇ డెల్లా టెక్నోలాజియా లియోనార్డో డా విన్సీ వద్ద ప్రదర్శించారు.
 
మార్కోని గాలిపటం ఎగరవేస్తున్న సహచరులను చూస్తున్నాడు (B.F.S. బాడెన్-పావెల్ చే "లెవిటర్"[38]) సెయింట్ జాన్స్, న్యూఫౌండ్లాండ్, డిసెంబర్ 1901 వద్ద యాంటెన్నాను ఎత్తడానికి ఉపయోగిస్తారు.

20 వ శతాబ్దం ప్రారంభంలో, మార్కోని అట్లాంటిక్ టెలిగ్రాఫ్ కేబుళ్లతో పోటీ పడటానికి అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా సిగ్నల్ ఇచ్చే మార్గాన్ని పరిశోధించడం ప్రారంభించాడు. మార్కోనీ రోస్లార్ స్ట్రాండ్, కో.వెక్స్‌ఫోర్డ్ లోని మార్కోనీ హౌస్ వద్ద వైర్‌లెస్ ట్రాన్స్‌మిటింగ్ స్టేషన్‌ను స్థాపించాడు. ఇది ఇంగ్లాండ్‌లోని కార్న్‌వాల్‌లోని పోల్ధు, ఐర్లాండ్‌లోని కో. గాల్వేలోని క్లిఫ్డెన్ మధ్య లింక్‌గా పనిచేయడానికి స్థాపించడమైనది. 1901 డిసెంబర్ 12 న న్యూఫౌండ్లాండ్ (ఇప్పుడు కెనడాలో భాగం) లోని సెయింట్ జాన్స్ లోని సిగ్నల్ హిల్ వద్ద సందేశం అందుకున్నట్లు అతను ప్రకటించాడు. దీనికి సంకేతాల గ్రహణం కోసం 500-అడుగుల (150 మీ) గాలిపటం-ఆధారం గల యాంటెన్నాను ఉపయోగించడం-కార్న్‌వాల్‌లోని పోల్ధు వద్ద సంస్థ యొక్క కొత్త హై-పవర్ స్టేషన్ ద్వారా ప్రసారం చేయబడిన సంకేతాలు ఉపయోగించబడ్డాయి. రెండు ప్రదేశాల మధ్య దూరం సుమారు 2,200 మైళ్ళు (3,500 కి.మీ). ఇది గొప్ప శాస్త్రీయ పురోగతిగా పేర్కొనబడింది, అయినప్పటికీ ఈ వాదన గురించి అనేకమైన సందేహాలు కూడా ఉన్నాయి. ఉపయోగించిన ఖచ్చితమైన తరంగదైర్ఘ్యం తెలియదు, కానీ ఇది 350 మీటర్ల (పౌనఃపున్యం ≈ 850 kHz) పరిసరాల్లో ఉన్నట్లు విశ్వసనీయంగా నిర్ణయించబడింది. అట్లాంటిక్ మార్గం పగటిపూట ఉండే సమయంలో ఈ పరీక్ష జరిగినది. ఇది సరైన ఎంపిక కాదు అని ఇప్పుడు తెలుసు (మార్కోనీకి అప్పటికి తెలియదు). ఈ మధ్యస్థ తరంగదైర్ఘ్యం వద్ద, ఐనో ఆవరణంలో స్కై వేవ్‌ భారీగా శోషించుకొనడం వల్ల పగటిపూట సుదూర ప్రసారం సాధ్యం కాదు. ఇది గుడ్డి పరీక్ష కాదు; మోర్స్ కోడ్ అక్షరం S ను సూచిస్తూ మూడు క్లిక్‌ల పునరావృత సిగ్నల్ వినడం మార్కోనికి ముందుగానే తెలుసు. ఈ క్లిక్‌లు మందకొడిగా , అప్పుడప్పుడు విన్నట్లు తెలిసింది. నివేదించబడిన గ్రహణం యొక్క స్వతంత్ర నిర్ధారణ లేదు. ప్రసారాలు వాతావరణ శబ్దం నుండి వేరు చేయడం కష్టం. మార్కోని యొక్క ప్రారంభ అట్లాంటిక్ పరిశోధన వివరణాత్మక సాంకేతిక సమీక్ష జాన్ ఎస్. బెల్రోస్ రాసిన 1995 రచనలో కనిపిస్తుంది. పోల్ధు ట్రాన్స్‌మిటర్ రెండు దశల వలయం[39].[40] సంశయవాదులచే సవాలు చేయబడినట్లు భావించిన మార్కోని మెరుగైన వ్యవస్థీకృత, డాక్యుమెంట్ పరీక్షను సిద్ధం చేశాడు. ఫిబ్రవరి 1902 లో, "ఎస్ఎస్ ఫిలడెల్ఫియా" గ్రేట్ బ్రిటన్ నుండి మార్కోనితో పశ్చిమాన ప్రయాణించింది. పోల్ధు స్టేషన్ నుండి ప్రతిరోజూ పంపే సంకేతాలను జాగ్రత్తగా రికార్డ్ చేస్తూ ప్రయాణించింది. ఈ

 
మార్కోని 1890 లలో తన మొదటి సుదూర రేడియో ప్రసారాలలో ఉపయోగించిన ఉపకరణాన్ని ప్రదర్శించాడు. ట్రాన్స్‌మిటర్ కుడి వైపున ఉంది, ఎడమవైపు పేపర్ టేప్ రికార్డర్‌తో రిసీవర్.

పరీక్ష ఫలితాలు కోహరర్-టేప్ రిసెప్షన్‌ను 1,550 మైళ్ళు (2,490 కిమీ), ఆడియో రిసెప్షన్ 2,100 మైళ్ళు (3,400 కిమీ) వరకు ఉత్పత్తి చేశాయి. రాత్రిపూట గరిష్ట దూరాలు సాధించబడ్డాయి. మీడియం వేవ్, లాంగ్‌ వేవ్ ట్రాన్స్‌మిషన్ల కోసం రేడియో సిగ్నల్స్ పగటి కంటే రాత్రి చాలా దూరం ప్రయాణిస్తాయని ఈ పరీక్షలు మొదట చూపించాయి. పగటిపూట, న్యూఫౌండ్లాండ్ వద్ద ఇంతకుముందు తెలియజేసిన దూరంలో సగం కంటే తక్కువ 700 మైళ్ళు (1,100 కిమీ) వరకు మాత్రమే సిగ్నల్స్ వచ్చాయి. ఇక్కడ పగటిపూట ప్రసారాలు కూడా జరిగాయి. ఈ కారణంగా, మార్కోని న్యూఫౌండ్లాండ్ వాదనలను పూర్తిగా ధృవీకరించలేదు. అయినప్పటికీ రేడియో సంకేతాలను వందల కిలోమీటర్ల వరకు పంపవచ్చని అతను నిరూపించాడు,

17 డిసెంబర్ 1902 న, కెనడాలోని నోవా స్కోటియాలోని గ్లేస్ బేలోని మార్కోని స్టేషన్ నుండి ప్రసారం ఉత్తర అమెరికా నుండి అట్లాంటిక్ దాటిన ప్రపంచంలోనే మొట్టమొదటి రేడియో సందేశంగా మారింది. 1901 లో, మార్కోని మసాచుసెట్స్‌లోని సౌత్ వెల్‌ఫ్లీట్ సమీపంలో ఒక స్టేషన్‌ను నిర్మించాడు. ఇది 1903 జనవరి 18 న యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు థియోడర్ రూజ్‌వెల్ట్ నుండి యునైటెడ్ కింగ్‌డమ్ రాజు ఎడ్వర్డ్ VII కు శుభాకాంక్షలు పంపబడినది. అయినప్పటికీ, స్థిరమైన అట్లాంటిక్ సిగ్నలింగ్ ఏర్పాటు చేయడం కష్టతరమైంది.

మార్కోని అట్లాంటిక్ యొక్క రెండు వైపులా సముద్రంలో ఓడలతో కమ్యూనికేట్ చేయడానికి, ఇతర ఆవిష్కర్తలతో పోటీగా అధిక శక్తితో కూడిన స్టేషన్లను నిర్మించడం ప్రారంభించాడు. 1904 లో, అతను రాత్రిపూట వార్తల సారాంశాలను చందాదారుల నౌకలకు ప్రసారం చేయడానికి ఒక వాణిజ్య సేవను స్థాపించాడు, వాటిని వారి ఆన్-బోర్డు వార్తాపత్రికలలో చేర్చవచ్చు.1907 అక్టోబర్ 17 న ఒక సాధారణ అట్లాంటిక్ రేడియో-టెలిగ్రాఫ్ సేవ ప్రారంభించబడింది [41][42]

సేవల కొనసాగింపు

మార్చు

సంవత్సరాలుగా, మార్కోని కంపెనీలు సాంకేతికంగా సాంప్రదాయికంగా పేరు తెచ్చుకున్నాయి. ప్రత్యేకించి అసమర్థమైన స్పార్క్-ట్రాన్స్‌మిటర్ల సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం కొనసాగించడం ద్వారా, రేడియోటెలెగ్రాఫ్ కార్యకలాపాలకు మాత్రమే ఉపయోగించబడుతుంది. రేడియో కమ్యూనికేషన్ యొక్క భవిష్యత్తు నిరంతరాయంగా ఉందని స్పష్టంగా కనిపించిన చాలా కాలం అవిచ్ఛిన్న-తరంగ ట్రాన్స్‌మిషన్లు ఉపయోగించేవారు. ఇవి మరింత సమర్థవంతంగా, ఆడియో ప్రసారాలకు ఉపయోగించబడతాయి.

కొంత ఆలస్యంగా, డోలన శూన్యనాళికలు (వాల్వ్) ప్రవేశపెట్టిన తరువాత, 1915 నుండి కంపెనీ నిరంతర-తరంగ పరికరాలతో గణనీయమైన తన సేవలు ప్రారంభించింది.

1920 లో, వాక్యూమ్ ట్యూబ్ ట్రాన్స్‌మిటర్లను ఉపయోగిస్తూ యునైటెడ్ కింగ్‌డమ్‌లో, చెల్మ్‌స్‌ఫోర్డ్ లొని న్యూ స్ట్రీట్ వర్క్స్ ఫ్యాక్టరీ మొట్టమొదటి వినోద రేడియో ప్రసారాలకు ప్రారంభించింది. 1922 లో రిటిల్‌లోని మార్కోని రీసెర్చ్ సెంటర్ నుండి సాధారణ వినోద ప్రసారాలు ప్రారంభమయ్యాయి.

తరువాతి సంవత్సరాలు

మార్చు

1914 లో మార్కోనీని ఇటాలియన్ సెనేట్‌లో సెనేటర్‌గా చేశారు. అతను యునైటెడ్ కింగ్‌డమ్‌లో రాయల్ విక్టోరియన్ కు ఆర్డర్ గౌరవ నైట్ గ్రాండ్ క్రాస్ నియమించారు. మొదటి ప్రపంచ యుద్ధం-1 యుద్ధ సంఘర్షణలో ఇటలీ మిత్రరాజ్యాల పక్షంలో చేరింది. మార్కోని ఇటాలియన్ మిలిటరీ రేడియో సేవకు బాధ్యత వహించాడు. అతను ఇటాలియన్ సైన్యంలో లెఫ్టినెంట్, ఇటాలియన్ నేవీలో కమాండర్ హోదాను పొందాడు. 1929 లో, అతన్ని కింగ్ విక్టర్ ఇమ్మాన్యుయేల్ III మార్క్వెస్ (యూరోపియన్ సమాజంగా అత్యున్నత పదవి) గా చేశాడు. మార్కోని 1923 లో ఇటాలియన్ ఫాసిస్ట్ పార్టీలో చేరాడు. 1930 లో, ఇటాలియన్ నియంత బెనిటో ముస్సోలినీ అతన్ని రాయల్ అకాడమీ ఆఫ్ ఇటలీ అధ్యక్షుడిగా నియమించారు. ఇది మార్కోనిని ఫాసిస్ట్ గ్రాండ్ కౌన్సిల్ సభ్యునిగా చేసింది.

మార్కోని రోమ్‌లో 1937 జూలై 20 న 63వ యేట, గుండెపోటుతో మరణించాడు. ఇటలీ అతనికి జాతీయ అంత్యక్రియలు నిర్వహించింది. దీనికి నివాళిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని రేడియో స్టేషన్లు మరుసటి రోజు రెండు నిమిషాల నిశ్శబ్దాన్ని పాటించాయి.

వ్యక్తిగత జీవితం

మార్చు
 
అమెరికన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఆల్ఫ్రెడ్ నార్టన్ గోల్డ్ స్మిత్, మార్కోని 26 జూన్ 1922 న.

మార్కోనికి ఒక సోదరుడు, అల్ఫోన్సో, ఒక సవతి సోదరుడు లుయిగి ఉన్నారు. మార్కోని 16 మార్చి 1905 న హాన్‌ బెత్రిస్ ఒబ్రిన్ (1882-1976) వివాహం చేసుకున్నాడు. వారికి ముగ్గురు కుమార్తెలు. ఒక కుమారుడు. మార్కోనిస్ 1924 లో విడాకులు తీసుకున్నాడు. మార్కోని కోరిక మేరకు 1927 ఏప్రిల్ 27 న వివాహం రద్దు చేయబడింది. [43] 1927 జూన్ 12న అతను మారియా క్రిస్టినా బెజ్జి-స్కారి (1900-1994) ను వివాహమాడాడు[44][45]. వారికి ఒక కుమార్తె (మారియా ఎలెట్ట్రా లెన అన్న) జన్మించింది. ఆమె 1966లో చార్లో జియోవన్నెల్లి రాజుని వివాహమాడింది. తరువాత వారికి విడాకులయ్యాయి.

వివరించలేని కారణాల వల్ల, మార్కోని తన సంపదను తన రెండవ భార్యకు, వారి ఏకైక బిడ్డకు విడిచిపెట్టాడు. అతని మొదటి వివాహం యొక్క పిల్లలకు ఏమీ ఇవ్వలేదు[46].

మార్కోని వ్యక్తిగతంగా 1931 లో మైక్రోఫోన్ వద్ద పోప్, పియస్ XI చే ప్రకటించడం ద్వారా మొదటి రేడియో ప్రసారాన్ని పరిచయం చేయాలనుకున్నాడు:

"ప్రకృతి యొక్క చాలా మర్మమైన శక్తులను మనిషి వద్ద ఉంచే దేవుని సహాయంతో, ఈ పరికరాన్ని నేను సిద్ధం చేయగలిగాను, ఇది మొత్తం విశ్వాసులకు పవిత్ర తండ్రి యొక్క స్వరాన్ని విన్న ఆనందాన్ని ఇస్తుంది[47] "

వారసత్వం, గౌరవాలు

మార్చు
 • 1909 లో, రేడియో సమాచార ప్రసారానికి చేసిన కృషికి మార్కోని భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని కార్ల్ బ్రాన్‌తో పంచుకున్నారు.[7]
 • 1918 లో, అతనికి ఫ్రాంక్లిన్ ఇన్స్టిట్యూట్ నుండి ఫ్రాంక్లిన్ పతకం లభించింది.
 • 1929 లో, అతన్ని కింగ్ విక్టర్ ఇమ్మాన్యుయేల్ III చేత మార్క్వెస్ చేసాడు, తద్వారా మార్చేస్ మార్కోని అయ్యాడు.
 • 1977 లో, మార్కోనిని నేషనల్ బ్రాడ్‌కాస్టర్ హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి చేర్చారు.[48]
 • 1988 లో, రేడియో హాల్ ఆఫ్ ఫేమ్ (మ్యూజియం ఆఫ్ బ్రాడ్‌కాస్ట్ కమ్యూనికేషన్స్, చికాగో) మార్కోనిని మార్గదర్శిగా చేర్చింది (అవార్డులు ప్రారంభమైన వెంటనే).[49]
 • 2001 లో, బ్రిటన్ మార్కోని యొక్క మొట్టమొదటి వైర్‌లెస్ కమ్యూనికేషన్ యొక్క 100 వ వార్షికోత్సవాన్ని జరుపుకునే స్మారక బ్రిటిష్ రెండు పౌండ్ల నాణెం విడుదల చేసింది..
 • వైర్‌లెస్ టెలిగ్రాఫీలో మార్కోని యొక్క ప్రారంభ ప్రయోగాలు రెండు IEEE మైలురాళ్లకు సంబంధించినవి; ఒకటి 2003 లో స్విట్జర్లాండ్‌లోను, ఇటీవల 2011 లో ఇటలీలోను.[50]
 • 2009 లో, మార్కోనీ యొక్క నోబెల్ బహుమతి యొక్క శతాబ్దిని పురస్కరించుకుని ఇటలీ స్మారక వెండి € 5 నాణెం జారీ చేసింది.
 • 2009 లో, అతన్ని న్యూజెర్సీ హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి చేర్చారు.[51]
 • డచ్ రేడియో అకాడమీ అత్యుత్తమ రేడియో కార్యక్రమాలు, సమర్పకులు, స్టేషన్లకు ఏటా మార్కోని అవార్డులు ఇస్తుంది.
 • నేషనల్ అసోసియేషన్ ఆఫ్ బ్రాడ్‌కాస్టర్స్ (యుఎస్) వార్షిక రేడియో కార్యక్రమాలు, స్టేషన్ల కోసం వార్షిక NAB మార్కోని రేడియో అవార్డులను కూడా ఇస్తుంది.

పేటెంట్లు

మార్చు

బ్రిటిష్ పేటెంట్లు

మార్చు
 • British patent No. 12,039 (1897) "Improvements in Transmitting Electrical impulses and Signals, and in Apparatus therefor". Date of Application 2 June 1896; Complete Specification Left, 2 March 1897; Accepted, 2 July 1897 (later claimed by Oliver Lodge to contain his own ideas which he failed to patent).
 • British patent No. 7,777 (1900) "Improvements in Apparatus for Wireless Telegraphy". Date of Application 26 April 1900; Complete Specification Left, 25 February 1901; Accepted, 13 April 1901.
 • British patent No. 10245 (1902)
 • British patent No. 5113 (1904) "Improvements in Transmitters suitable for Wireless Telegraphy". Date of Application 1 March 1904; Complete Specification Left, 30 November 1904; Accepted, 19 January August 1905.
 • British patent No. 21640 (1904) "Improvements in Apparatus for Wireless Telegraphy". Date of Application 8 October 1904; Complete Specification Left, 6 July 1905; Accepted, 10 August 1905.
 • British patent No. 14788 (1904) "Improvements in or relating to Wireless Telegraphy". Date of Application 18 July 1905; Complete Specification Left, 23 January 1906; Accepted, 10 May 1906.

యు.ఎస్.పేటెంట్లు

మార్చు

తిరిగి విడుదల చేయబడింది (యుఎస్)

మార్చు
 • U.S. Patent RE11,913 "Transmitting electrical impulses and signals and in apparatus, there-for". Filed 1 April 1901; Issued 4 June 1901.

వనరులు

మార్చు
 • Hong, Sungook (2001). Wireless: From Marconi's Black-Box to the Audion (PDF). Cambridge, Mass.: MIT Press. ISBN 0-262-08298-5.

ఇతర పఠనాలు

మార్చు
బంధువులు, సంస్థ ప్రచురణలు
ఇతరులు
 • Ahern, Steve (ed), Making Radio (2nd Edition) Allen & Unwin, Sydney, 2006 ISBN 9781741149128.
 • Aitken, Hugh G. J., Syntony and Spark: The Origins of Radio, New York: John Wiley & Sons, 1976. ISBN 0-471-01816-3
 • Aitken, Hugh G. J., The Continuous Wave: Technology and American Radio, 1900–1932, Princeton, New Jersey: Princeton University Press, 1985. ISBN 0-691-08376-2.
 • Anderson, Leland I., Priority in the Invention of Radio – Tesla vs. Marconi
 • Baker, W. J., A History of the Marconi Company, 1970.
 • Brodsky, Ira. The History of Wireless: How Creative Minds Produced Technology for the Masses (Telescope Books, 2008)
 • Cheney, Margaret, Tesla: Man Out of Time Laurel Publishing, 1981. Chapter 7, esp pp 69, re: published lectures of Tesla in 1893, copied by Marconi.
 • Clark, Paddy, "Marconi's Irish Connections Recalled," published in 100 Years of Radio, IEE Conference Publication 411, 1995.
 • Coe, Douglas and Kreigh Collins (ills), Marconi, pioneer of radio, New York, J. Messner, Inc., 1943. LCCN 43010048
 • Garratt, G. R. M., The early history of radio: from Faraday to Marconi, London, Institution of Electrical Engineers in association with the Science Museum, History of technology series, 1994. ISBN 0-85296-845-0 LCCN gb 94011611
 • Geddes, Keith, Guglielmo Marconi, 1874–1937, London : H.M.S.O., A Science Museum booklet, 1974. ISBN 0-11-290198-0 LCCN 75329825 (ed. Obtainable in the United States. from Pendragon House Inc., Palo Alto, California.)
 • Hancock, Harry Edgar, Wireless at sea; the first fifty years: A history of the progress and development of marine wireless communications written to commemorate the jubilee of the Marconi International Marine Communication Company, Limited, Chelmsford, Eng., Marconi International Marine Communication Co., 1950. LCCN 51040529 /L
 • Hughes, Michael and Bosworth, Katherine, Titanic Calling : Wireless Communications During the Great Disaster[permanent dead link], Oxford, The Bodleian Library, 2012, ISBN 978-1-85124-377-8
 • Janniello, Maria Grace, Monteleone, Franco and Paoloni, Giovanni (eds) (1996), One hundred years of radio: From Marconi to the future of the telecommunications. Catalogue of the extension, Venice: Marsilio.
 • Jolly, W. P., Marconi, 1972.
 • Larson, Erik, Thunderstruck, New York: Crown Publishers, 2006. ISBN 1-4000-8066-5 A comparison of the lives of Hawley Harvey Crippen and Marconi. Crippen was a murderer whose Transatlantic escape was foiled by the new invention of shipboard radio.
 • MacLeod, Mary K., Marconi: The Canada Years – 1902–1946, Halifax, Nova Scotia: Nimbus Publishing Limited, 1992, ISBN 1551093308
 • Masini, Giancarlo, Guglielmo Marconi, Turin: Turinese typographical-publishing union, 1975. LCCN 77472455 (ed. Contains 32 tables outside of the text)
 • Mason, H. B. (1908). Encyclopaedia of ships and shipping, Wireless Telegraphy. London: Shipping Encyclopaedia. 1908.
 • Perry, Lawrence (1902). "Commercial Wireless Telegraphy". The World's Work: A History of Our Time. V: 3194–3201. Retrieved 10 July 2009.
 • Stone, Ellery W., Elements of Radiotelegraphy
 • Weightman, Gavin, Signor Marconi's magic box: the most remarkable invention of the 19th century & the amateur inventor whose genius sparked a revolution, 1st Da Capo Press ed., Cambridge, MA : Da Capo Press, 2003. ISBN 0-306-81275-4
 • Winkler, Jonathan Reed. Nexus: Strategic Communications and American Security in World War I. (Cambridge, MA: Harvard University Press, 2008). Account of rivalry between Marconi's firm and the United States government during World War I.

బాహ్య లంకెలు

మార్చు
 
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
వికీమీడియా
సాధారణ విజయాలు
స్థాపనలు, విద్యావేత్తలు
మల్టీమీడియా, పుస్తకాలు
అట్లాంటిక్ "సిగ్నల్స్" , రేడియో
"కీ "లు, "సంకేతాలు"
ఆవిష్కరణకు ప్రాధాన్యత

vs Tesla

వ్యక్తిగతం
ఇతరులు


మూలాలు

మార్చు
 1. https://www.britannica.com/biography/Guglielmo-Marconi
 2. https://www.telegraph.co.uk/technology/connecting-britain/guglielmo-marconi-birth/
 3. http://www.history.com/topics/inventions/guglielmo-marconi
 4. Gavin Weightman, The Industrial Revolutionaries: The Making of the Modern World 1776-1914, Grove/Atlantic, Inc. - 2010, page 357
 5. Bondyopadhyay, Prebir K. (1995). "Guglielmo Marconi – The father of long distance radio communication – An engineer's tribute". 25th European Microwave Conference, 1995. p. 879. doi:10.1109/EUMA.1995.337090.
 6. Hong, p. 1
 7. 7.0 7.1 "Guglielmo Marconi: The Nobel Prize in Physics 1909"
 8. Bondyopadhyay, P.K. (1998). "Sir J.C. Bose diode detector received Marconi's first transatlantic wireless signal of December 1901 (the 'Italian Navy Coherer' Scandal Revisited)". Proceedings of the IEEE. 86: 259. doi:10.1109/5.658778.
 9. Roy, Amit (8 December 2008). "Cambridge 'pioneer' honour for Bose". The Telegraph. Kolkota. Retrieved 10 June 2010.
 10. Icons of invention: the makers of the modern world from Gutenberg to Gates. ABC-CLIO. Retrieved 7 August 2011.
 11. Ingenious Ireland: A County-by-County Exploration of the Mysteries and Marvels of the Ingenious Irish. Simon and Schuster. Retrieved 7 August 2011.
 12. Alfonso, not Guglielmo, was a pupil at Bedford School: 'It is not generally known that the Marconi family at one time lived in Bedford, in the house on Bromham Road on the western corner of Ashburnham Road, and that the elder brother of the renowned Marchese Marconi attended this School for four years.' The Ousel, June 1936, p. 78. From Alfonso's obituary.
 13. Bedfordshire Times. 23 July 1937, p. 9 (Marconi's obituary)
 14. McHenry, Robert, ed. (1993). "Guglielmo Marconi". Encyclopædia Britannica.
 15. 15.0 15.1 "The Marconi Society, book synopsis - Marc Raboy, The Discovery that Continues to Change the World". Archived from the original on 2019-10-03. Retrieved 2020-03-04.
 16. 16.0 16.1 Dunlap, Orrin Elmer, Marconi, the man and his wireless, Macmillan - 1937, page 10
 17. Guglielmo Marconi Foundation, Profiles, Vincenzo Rosa
 18. Guglielmo Marconi (Fabrizio Bònoli, Giorgio Dragoni). Scienzagiovane.unibo.it. Retrieved on 10 June 2016.
 19. "22. Word Origins". earlyradiohistory.us.
 20. 20.0 20.1 Icons of Invention: The Makers of the Modern World from Gutenberg to Gates. ABC-CLIO. 2009. p. 162. ISBN 978-0-313-34743-6.
 21. 21.0 21.1 Brown, Antony. Great Ideas in Communications. D. White Co., 1969, page 141
 22. Guglielmo Marconi, padre della radio Archived 2013-06-02 at the Wayback Machine. Radiomarconi.com. Retrieved on 12 July 2012.
 23. Hong, p. 22
 24. Marconi delineated his 1895 apparatus in his Nobel Award speech. See: Marconi, "Wireless Telegraphic Communication: Nobel Lecture, 11 December 1909." Nobel Lectures. Physics 1901–1921. Amsterdam: Elsevier Publishing Company, 1967: 196–222. p. 198.
 25. Hong, p. 6
 26. Hong, pp. 20–22
 27. Marconi, "Wireless Telegraphic Communication: Nobel Lecture, 11 December 1909." Nobel Lectures. Physics 1901–1921. Amsterdam: Elsevier Publishing Company, 1967: 196–222. p. 206.
 28. The Saturday review of politics, literature, science and art, Volume 93. "THE INVENTOR OF WIRELESS TELEGRAPHY: A REPLY. To the Editor of the Saturday Review" Guglielmo Marconi and "WIRELESS TELEGRAPHY: A REJOINDER. To the Editor of the Saturday Review," Silvanus P. Thompson.
 29. Gualandi, Lodovico (26 June 2000). "MARCONI E LO STRAVOLGIMENTO DELLA VERITÀ STORICA SULLA SUA OPERA". radiomarconi.com. Archived from the original on 7 మార్చి 2016. Retrieved 4 మార్చి 2020.
 30. Proceedings of the Institution of Electrical Engineers, Volume 28 By Institution of Electrical Engineers. p. 294.
 31. Solari, Luigi (February 1948) "Guglielmo Marconi e la Marina Militare Italiana", Rivista Marittima
 32. Guglielmo Marconi, seas.columbia.edu
 33. "Flickr Photo".
 34. BBC Wales, "Marconi's Waves". Archived from the original on 20 January 2007. Retrieved 20 January 2007.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
 35. "Marconi's Wireless Telegraph by Cleveland Moffett, McClure's Magazine, June 1899, pages 99-112.
 36. The first-ever radio distress call is made off Kent coast
 37. Helgesen, Henry N. "Wireless Goes to Sea: Marconi's Radio and SS Ponce". Sea History (Spring 2008): 122.
 38. First Atlantic Ocean crossing by a wireless signal Archived 30 జనవరి 2013 at the Wayback Machine. Carnetdevol.org. Retrieved on 12 July 2012.
 39. Belrose, John S. (5 September 1995) "Fessenden and Marconi: Their Differing Technologies and Transatlantic Experiments During the First Decade of this Century Archived 2012-12-28 at the Wayback Machine". International Conference on 100 Years of Radio.
 40. "Marconi and the History of Radio". IEEE Antennas and Propagation Magazine. 46 (2): 130. 2004. doi:10.1109/MAP.2004.1305565.
 41. "The Clifden Station of the Marconi Wireless Telegraph System". Scientific American. 23 November 1907.
 42. Second Test of the Marconi Over-Ocean Wireless System Proved Entirely Successful Archived 2013-10-19 at the Wayback Machine. Sydney Daily Post. 24 October 1907.
 43. Degna Marconi, My Father, Marconi (Guernica Editions, 2001), pp. 218–227 ISBN 1550711512.
 44. Gerald Sussman, Communication, Technology, and Politics in the Information Age. 1997. p. 90 ISBN 0803951396.
 45. George P. Oslin, The Story of Telecommunications. 1992. p. 294 ISBN 0865546592.
 46. Degna Marconi, My Father, Marconi (Guernica Editions, 2001), p. 232 ISBN 1550711512.
 47. "80 Years of Vatican Radio, Pope Pius XI and Marconi. .. and Father Jozef Murgas?". Saint Benedict Center.
 48. National Broadcasters Hall of Fame. Archived 2014-07-03 at the Wayback Machine Accessed 10 February 2009
 49. "Pioneer: Guglielmo Marconi". radiohof.org. Archived from the original on 5 మే 2012. Retrieved 30 May 2012.
 50. "List of IEEE Milestones". IEEE Global History Network. IEEE. Retrieved 29 July 2011.
 51. New Jersey to Bon Jovi: You Give Us a Good Name. accesshollywood.com (2 February 2009).